- Home
- Entertainment
- ఎన్టీఆర్‌కి పోటీగా తారకరత్నని తీసుకొచ్చిన నందమూరి ఫ్యామిలీ.. తెరవెనుక బాలయ్య.. అసలు నిజం ఏంటంటే?
ఎన్టీఆర్‌కి పోటీగా తారకరత్నని తీసుకొచ్చిన నందమూరి ఫ్యామిలీ.. తెరవెనుక బాలయ్య.. అసలు నిజం ఏంటంటే?
జూ. ఎన్టీఆర్ అంటే నందమూరి ఫ్యామిలీకి మొదట పడదని, తారక్‌కి పోటీగా తారకరత్నని సినిమాల్లోకి తీసుకొచ్చినట్టు వార్తలొచ్చాయి. అయితే తెరవెనుక ఏం జరిగింది, అసలు వాస్తవం ఏంటనేది చూస్తే..

నందమూరి నట వారసుడిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు తారకరత్నం. ఎన్టీఆర్ కుమారుల్లో ఒకరైన మోహనకృష్ణ తనయుడే తారకరత్న. ఆయన 2002లో `ఒకటో నెంబర్ కుర్రాడు` చిత్రంతో హీరోగా టాలీవుడ్‌కి పరిచయం అయ్యారు. తొలి చిత్రంతోనే సంచలనం సృష్టించారు తారకరత్న. ఆయన ఫస్ట్ మూవీ రిలీజ్ కాకముందే ఏకంగా తొమ్మిది కొంత సినిమాలను స్టార్ట్ చేశారు. ఆ తర్వాత వాటిలో కొన్ని షూటింగ్ జరుపుకుని, రిలీజ్‌కాగా, చాలా వరకు ఆదిలోనే ఆగిపోయాయి.
మొదటి సినిమా `ఒకటో నెంబర్ కుర్రాడు` చిత్రానికి చాలా బజ్ వచ్చింది. అందులోని పాటలు బాగా హిట్ అయ్యాయి. ఎక్కడ చూసినా అవే వినిపించేవి. దీంతో ఆయనతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు క్యూ కట్టాయి. పైగా నందమూరి ఫ్యామిలీ హీరో అంటే ఆ బజ్ వేరే లెవల్ అని చెప్పొచ్చు. తారకరత్న విషయంలో అదే జరిగింది. కానీ తొలి చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో సీన్ రివర్స్ అయ్యింది. దీంతో నిర్మాతలు వెనక్కి తగ్గారు. విడుదలైన సినిమాలు కూడా సక్సెస్ కాలేదు.
అయితే ఆసమయంలో తారకరత్న హీరో ఎంట్రీకి సంబంధించి పెద్ద చర్చ నడిచింది. పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ అయ్యింది. ఎన్టీఆర్ అప్పట్లో హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన సినిమాలు వరుసగా ఆడుతున్నాయి. బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. దీంతో ఎన్టీఆర్‌కి పోటీగానే తారకరత్నని నటుడిగా దించారనే వార్త ఊపందుకుంది. ఇది ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. తారక్ అంటే గిట్టని నందమూరి ఫ్యామిలీ ఆయనకు పోటీగా తారకరత్నని తెరపైకి తీసుకొచ్చారనే ప్రచారం జరిగింది. అందుకే తొలి సినిమా టైమ్‌లోనే ఏకంగా పది ప్రాజెక్ట్ లు తీసుకొచ్చారని, దీని వెనకాల బాలకృష్ణ ఉన్నారని టాక్ వచ్చింది. అప్పట్లో ఇది పెద్ద దుమారం రేపింది.
ఇదిలా ఉంటే దీనిపై ఇటీవల స్పందించారు తారకరత్న. గతేడాది ఆయన `9అవర్స్` వెబ్ సిరీస్‌లో నటించారు. ఆ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఎన్టీఆర్ తో పోటీ వివాదంపై రియాక్ట్ అయ్యారు. తమ్ముడు ఎన్టీఆర్ తరువాతే తను సినిమాల్లోకి వచ్చినట్లు చెప్పారు. అప్పటికే ఎన్టీఆర్ 'ఆది' లాంటి హిట్స్ ఇచ్చాడని, తాను ఎన్టీఆర్ కి కాంపిటిషన్ కాదని, ఎప్పుడూ అలా ఫీల్ అవ్వలేదని చెప్పారు. ఎన్టీఆర్ కి కాంపిటిషన్ గా తనను లాంచ్ చేశారనే విషయంలో నిజం లేదని, హీరో కావాలనేది తన డ్రీమ్ అని, దానికి తన తండ్రి, బాబాయ్ సపోర్ట్ చేసి ఓకే చెప్పారని తెలిపారు.
ఎన్టీఆర్ గొప్ప నటుడు అని, మేమంతా నందమూరి బిడ్డలేమని, ఈరోజు నందమూరి ఫ్యామిలీ లెగసీ కంటిన్యూ అవుతుందంటే దానికి ఎన్టీఆర్ కూడా ఒక కారణమని పేర్కొన్నారు. ఎవరు ముందుకు వెళ్లినా, నందమూరి ఫ్యామిలీనే ముందుకు వెళ్తుందని, తమ్ముడు ఎన్టీఆర్ తీసుకెళ్లినా, అన్న కళ్యాణ్ రామ్ తీసుకెళ్లినా తనకు సంతోషమే అని చెప్పారు. ఎన్టీఆర్ సక్సెస్ చూసి ఒక అన్నగా ఎంతో సంతోషపడతానని చెప్పుకొచ్చారు. మొత్తానికి ఆ వార్తలను ఇలా ఫుల్‌స్టాప్ పెట్టారు. తారకరత్న హీరోగా సక్సెస్ కాలేదు. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారుతున్నారు. వరుసగా సినిమాలు చేస్తున్నారు. మరోవైపు రాజకీయాల్లోనూ యాక్టివ్‌గా మారుతున్నారు.