- Home
- Entertainment
- బాలయ్యకు ఆ పదం వింటేనే చిర్రెత్తుకొస్తుందట...?ఎదురుగా ఎవరున్నా అయిపోయినట్టేనా..? కారణం ఏంటి..?
బాలయ్యకు ఆ పదం వింటేనే చిర్రెత్తుకొస్తుందట...?ఎదురుగా ఎవరున్నా అయిపోయినట్టేనా..? కారణం ఏంటి..?
బాలయ్య బాబుకి ముక్కు మీద కోపం.. ఆ విషయం ఇండస్ట్రీ అంతా తెలుసు.. ఆయన దగ్గర కాస్త తేడా వచ్చినా.. ఎంతటివారినైనా లెక్క చేయడు... ఆ విషయం కూడా తెలిసిందే..? అయితే బాలకృష్ణ ముందు ఓ పదం వాడితే ఆయనకు చిర్రెత్తుకొస్తుందట. ఇంతకీ ఏంటా పదం..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ముక్కుసూటిగా.. ఉన్నది ఉన్నట్టు మాట్లాడేవారు చాలాతక్కువ మంది ఉన్నారు. అందులో .. నందమూరి నట సింహం బాలయ్య బాబు కూడా ఒకరు. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఉన్నది ఉన్నట్లు ముఖంమీద మాట్లాడుతాడు. ముక్కుసూటిగా ఉండే మనిషి .. ఎదురుగా ఎవరు ఉన్నా సరే.. తప్పుగా మాట్లాడితే.. డోంట్ కేర్ అంటుంటారు బాలయ్య బాబు. అవతల ఉన్నది ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే తప్పు చేస్తే చీల్చి చెండాడేస్తాడు .
బాలయ్య బాబు కోపం గురించి అందరికీ తెలిసిందే. ఎంత కోపం ఉంటుందో అంత మంచి మనసు ఆయనది. ఎంతరినో అక్కున చేర్చుకుని ఆదరించిన గుణం బాలయ్యది. క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎందరికో ప్రాణం పోస్తున్నారు బాలయ్య. కుడిచేత్తో చేసిన దానం ఎడమచేతికి కూడా తెలియకుండా.. ఎన్నో గుప్తదానాలు చేశారు ఆయన. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎందరినో ఆదుకున్నారు బాలయ్య.
ఇటు సినిమాలు .. అటురాజకీయాలు రెండింటిని బ్యాలన్స్ చేస్తూ వస్తోన్న ఈ స్టార్ హీరో.. గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . బాలయ్య లేడీస్ కు బాగా రెస్పెక్ట్ ఇస్తారు. అంతేకాదు లేడీస్ ని ఎవరైనా సరే తన ముందు తప్పుడు మాటలు మాట్లాడితే మాత్రం ఉతికి ఆరేస్తారు . పాలిటిక్స్ పరంగా కూడా బాలయ్య ఏనాడు కూడా హద్దులు మీర లేదు .
అయితే బాలయ్యకు నచ్చని విషయాలలో బూతులు తిట్టడం కూడా ఒకటంట. మరీ ముఖ్యంగా.. బాలయ్యకు ఆడవాళ్ళని బూతు పదాలు తిడితే ఒళ్ళు మండిపోతుందట. అందుకే తన సినిమాల్లో కూడా ఆడవారి హక్కులు.. వారిని గౌరవించడం లాంటివి ఎక్కువగా పెడుతంటారు. రీసెంట్ గా ఆయన నటించిన భగవంత్ సింగ్ కేసరిలో కూడా ఇలాంటివి చాలా ఉన్నాయి.
మరీ ముఖ్యంగా.. చిన్నారి ఆడపిల్లలపై అఘాయిత్యాలపై.. ఆయన చెప్పిన డైలాగ్ బాగా పాపులర్ అయ్యింది. గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ అంటూ.. ఆయన తల్లీతండ్రులకు, ఆడపిల్లలకు చెప్పిన మాటలు వైరల్ అయ్యాయి. అంతేకాదు అలా తన ముందు ఏ పెద్ద స్టార్ అయిన రాజకీయ నాయకుడు అయిన సరే బూతులు మాట్లాడితే చీల్చి చండాడేస్తాడట బాలయ్య బాబు.
ఇక ప్రస్తుతం బాలకృష్ణ.. బాబీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమా అయిపోయిన వెంటనే బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ2 ను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు.