MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఎలా ఉండే బాలయ్య ఎలా మారిపోయాడు, అంతా కొడుకు కోసమేనా.. హ్యాట్రిక్ హిట్లకు కారణం అదే 

ఎలా ఉండే బాలయ్య ఎలా మారిపోయాడు, అంతా కొడుకు కోసమేనా.. హ్యాట్రిక్ హిట్లకు కారణం అదే 

నందమూరి బాలకృష్ణ అంటే ముక్కుసిటి వ్యక్తిత్వం గుర్తుకు వస్తుంది. మనసులో అనిపించింది బయటకి చెప్పేస్తారు. ఆ విధంగా బాలయ్య ఎన్నోసార్లు వివాదాల్లో చిక్కుకున్నారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 24 2024, 08:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

నందమూరి బాలకృష్ణ అంటే ముక్కుసిటి వ్యక్తిత్వం గుర్తుకు వస్తుంది. మనసులో అనిపించింది బయటకి చెప్పేస్తారు. ఆ విధంగా బాలయ్య ఎన్నోసార్లు వివాదాల్లో చిక్కుకున్నారు. పబ్లిక్ లో బాలయ్య కొన్ని సార్లు యాంగ్రీ గా, కొన్నిసార్లు సరదాగా కనిపిస్తారు. 

27

సినిమాల విషయానికి వస్తే ఒకప్పటి బాలయ్య వేరు.. ఇప్పుడు బాలయ్య పూర్తిగా వేరు అని విశ్లేషకులు అంటున్నారు. ఒకప్పుడు బాలయ్య సినిమాల విషయంలో పూర్తిగా భారం మొత్తం డైరెక్టర్ పైనే వేసేవారు. తన డైరెక్టర్ ని గుడ్డిగా నమ్మేసేవారు. ఒకప్పుడు బాలయ్య ఎవరైనా దర్శకుడు కథ తీసుకునివెళితే ఆ టైం కి మనసు బావుంటే వెంటనే ఒకే చేసేస్తారు. 

37

దర్శకుడు ఎవరు, నిర్మాత ఎవరు లాంటి విషయాలు అనవసరం. కథ కూడా పట్టించుకునేవారు కాదు. నేరుగా సెట్స్ కి వెళ్లి డైరెక్టర్ చెప్పింది చేసి వచ్చేవారు. బాలయ్య అలా చేయడం వల్ల ఒక దశలో సూపర్ హిట్లు పడ్డాయి. ఒకదశలో డిజాస్టర్లు ఎదురయ్యాయి. 

 

47

లక్ష్మి నరసింహ చిత్రం తర్వాత సింహ వరకు మధ్యలో బాలయ్యకి ఒక్క హిట్టు కూడా లేదు. వైవిఎస్ చౌదరి లాంటి దర్శకుల కథ కూడా వినకుండా బాలయ్య సినిమాలు ఒకే చేసేశారు. ఫలితంగా డిజాస్టర్లు ఎదురయ్యాయి. కానీ ఇప్పుడు బాలయ్య గతంలో లాగా కాదట. దర్శకుడు చెప్పిన కథలో ఇన్వాల్వ్ కావడమే కాదు.. కథపై గ్రిప్ తెచ్చుకుని మార్పులు కూడా చేయిస్తున్నారట. 

57

అవసరం అయితే రీషూట్స్ కి కూడా వెళ్ళాలి అని చెబుతున్నారట. భగవంత్ కేసరి చిత్రంలో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలని పూర్తిగా మార్పించింది బాలయ్యే. అనిల్ రావిపూడి అంతకు ముందు వేరే వర్షన్ రాసుకున్నారు. ఇప్పుడు బాబీ తెరకెక్కిస్తున్న చిత్ర కథలో కూడా బాలయ్య కొన్ని మార్పులు సూచించారట. కొన్ని సీన్లు సరిగ్గా రాలేదని రీ షూట్ అవసరం అని కూడా చెప్పారట. ఒకప్పుడు డైరెక్టర్ ఏది చెబితే అది గుడ్డిగా చేసేసే బాలయ్యలో ఇంత మార్పు ఏంటా అని సినీ జనాలు షాక్ అవుతున్నారు. బాలయ్య హ్యాట్రిక్ హిట్స్ కొట్టారు అంటే అందుకు కారణం ఈ మార్పే అని అంటున్నారు. 

67

అయితే ఆసక్తికర విషయం ఏంటంటే.. బాలయ్య ఇంతలా మారింది తన కొడుకు కోసమే అని అంటున్నారు. మోక్షజ్ఞ ఎంట్రీ త్వరలో ఉండబోతోంది. మోక్షజ్ఞ చిత్ర పరిశ్రమలో టాప్ స్టార్ గా ఎదిగేలా బాలయ్య ప్రణాళిక ఉండబోతోంది. దీనికోసం బాలయ్య అన్ని విషయాల్లో గ్రిప్ పెంచుకుంటున్నారు. 

77

మోక్షజ్ఞ తొలి చిత్రం, ఆ తర్వాత చేయబోయే చిత్రాల ఫైనల్ డెసిషన్ బాలయ్యదే. కాబట్టి అద్భుతమైన కథలని ఎంచుకోవాల్సి ఉంటుంది. దర్శకుడు తప్పులు చేస్తే గుర్తించాల్సి ఉంటుంది. ఇదంతా జరగాలంటే తన చిత్రాల నుంచే మార్పు మొదలు కావాలని బాలయ్య ఇలా మారిపోయినట్లు చెబుతున్నారు. మొత్తంగా కొడుకు కోసం మార్పు మంచిదే అని అంటున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
నందమూరి బాలకృష్ణ

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT Release: బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్, ఇప్పుడు సైలెంట్‌గా ఓటీటీలోకి కార్తీక్ ఆర్యన్ సినిమా.. ఎక్కడ చూడాలంటే?
Recommended image2
Amala Paul: విజయ్ డైరెక్టర్‌తో ప్రేమ.. మూడేళ్లకే విడాకులు.. ఎవరీ హీరోయిన్?
Recommended image3
Sudharshan: ఎన్టీఆర్ ఫ్లాప్ సినిమాపై కమెడియన్ సెటైర్లు..ఆమె యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అంటూ యాంకర్ పై జోకులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved