MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఒకే టైటిల్ తో రెండు సినిమాలు చేసిన బాలకృష్ణ..ముఖ్యమంత్రి ఫైనల్ చేసిన కథ సూపర్ హిట్

ఒకే టైటిల్ తో రెండు సినిమాలు చేసిన బాలకృష్ణ..ముఖ్యమంత్రి ఫైనల్ చేసిన కథ సూపర్ హిట్

నందమూరి బాలకృష్ణ ముందుగా తన తండ్రి ఎన్టీఆర్ చిత్రాల్లో నటిస్తూ ఆ తర్వాత సోలో హీరోగా మారారు. బాలకృష్ణ హీరోగా నిలదొక్కుకునే వరకు ఆయన తండ్రి ఎన్టీఆర్ కథలు ఫైనల్ చేసేవారు. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Feb 16 2025, 06:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
NTR, Balakrishna

NTR, Balakrishna

నందమూరి బాలకృష్ణ ముందుగా తన తండ్రి ఎన్టీఆర్ చిత్రాల్లో నటిస్తూ ఆ తర్వాత సోలో హీరోగా మారారు. బాలకృష్ణ హీరోగా నిలదొక్కుకునే వరకు ఆయన తండ్రి ఎన్టీఆర్ కథలు ఫైనల్ చేసేవారు. దర్శకులు ముందుగా ఎన్టీఆర్ కి కథ వినిపిస్తే.. ఆయన అవసరం అయితే మార్పులు సూచించేవారు. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Nandamuri Balakrishna

Nandamuri Balakrishna

నందమూరి బాలకృష్ణ ఒకే టైటిల్ తో రెండు సినిమా చేశారు. అదేంటంటే కథానాయకుడు చిత్రం. కథానాయకుడు 1984లో విడుదలై సూపర్ హిట్ అయింది. అదే టైటిల్ తో మరో చిత్రం కూడా చేశారు. కాకపోతే అది 'ఎన్టీఆర్ కథానాయకుడు' చిత్రం. ఎన్టీఆర్ బయోపిక్ మూవీ గా తెరకెక్కిన ఆ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ రెండు చిత్రాల్లో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఎన్టీఆర్ ప్రమేయం ఉండడం యాదృచ్చికం. 

 

34

1984లో విడుదలైన కథానాయకుడు చిత్ర కథని ఎన్టీఆర్ ఫైనల్ చేశారు. దీని వెనుక పెద్ద చరిత్రే ఉంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో సురేష్ బాబు.. బాలయ్యతో నిర్మించిన చిత్రం ఇది. మురళి మోహనరావు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. పరుచూరి బ్రదర్స్ కథ అందించారు. బాలకృష్ణతో సినిమా చేస్తున్నాం అని ఎన్టీఆర్ కి చెబితే తెల్లవారు జామున 4 గంటలకి ఇంటికి రమ్మని ఆయన పిలిచారట. ఆ టైంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 

 

44
Balakrishna

Balakrishna

సురేష్ బాబు, పరుచూరి బ్రదర్స్ తో కలసి ఎన్టీఆర్ దగ్గరకి వెళ్లారు. పరుచూరి బ్రదర్స్ కథ చెబుతుంటే ఎన్టీఆర్ ముఖ్యమైన అంశాలని వివిధ కలర్స్ లో నోట్ చేసుకుంటున్నారట. అరగంట బ్రేక్ తీసుకుని తిరిగి వచ్చి.. కథ ఇక్కడ వరకు జరిగింది.. అక్కడి నుంచే మొదలు పెట్టండి అని చెప్పారట. కథ మొత్తం విన్న తర్వాత ఎలాంటి మార్పులు అవసరం లేదు సినిమా ప్రారంభించండి అని ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సురేష్ బాబు గుర్తు చేసుకున్నారు. విజయశాంతి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
నందమూరి బాలకృష్ణ
తెలుగు సినిమా
Latest Videos
Recommended Stories
Recommended image1
Peddi 4 Days Collections: పెద్ది 4 రోజుల్లో రాబట్టింది ఇంతే, ఆదివారం ర్యాంపేజ్‌.. హిట్‌ కావాలంటే ఇంకా ఎంత రావాలంటే?
Recommended image2
Anchor Suma: కత్తిలాంటి ఫిగర్ సుమ.. అంటూ కామెంట్ చేసిన హీరో ఎవరో తెలుసా? స్టార్ యాంకర్ రియాక్షన్ ఇదే
Recommended image3
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ తెలుగు 10 నుంచి అదిరిపోయే అప్‌ డేట్‌, కంటెస్టెంట్లు వీరేనా.. సరికొత్త ట్విస్ట్ తో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved