నమ్రత, ప్రియాంక, ఐశ్వర్య.... వయసులో చిన్నోళ్లను చేసుకున్న స్టార్ హీరోయిన్స్!
సాంప్రదాయానికి భిన్నంగా కొందరు స్టార్ హీరోయిన్స్ భాగస్వాములను ఎంచుకున్నారు. వయసులో తమకంటే చిన్నోళ్లను పెళ్లి చేసుకున్నారు.

Namrata Shirodkar
పెళ్ళికి ఈడు జోడు కావాలంటారు. వధువు కంటే వరుడు పెద్దవాడై ఉండాలనేది ఆనవాయితీ. ఈ రూల్ బ్రేక్ చేసిన కొందరు హీరోయిన్స్ తమకంటే చిన్నవాళ్ళను వివాహం చేసుకున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు, హీరోయిన్ నమ్రత శిరోద్కర్ ప్రేమ వివాహం చేసుకున్నారు. 2005లో నిరాడంబరంగా కేవలం కుటుంబ సభ్యుల మధ్య జరిగింది. మహేష్ కంటే నమ్రత దాదాపు నాలుగేళ్లు పెద్దది. 1975 ఆగస్టు 9న మహేష్ పుట్టాడు. నమ్రత 1972 జనవరి 22న జన్మించారు.
1973 సెప్టెంబర్ 1న జన్మించిన ఐశ్వర్య రాయ్ ప్రస్తుత వయసు 49 ఏళ్ళు. 1976లో పుట్టిన అభిషేక్ బచ్చన్ ఆమె కంటే రెండేళ్లకు పైగా చిన్నోడు. 2007లో అభిషేక్-ఐశ్వర్య వివాహం చేసుకున్నారు. ఈ మధ్య విడాకులు తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతుంది.
Image: Google
బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ మొదటి భార్య అమృతా సింగ్ ఆయనకంటే వయసులో పెద్దది. 1970 ఆగస్టు 11న జన్మించిన సైఫ్ అలీ ఖాన్ వయసు 52 ఏళ్ళు కాగా... అమృతా సింగ్ ఏకంగా 65 ఏళ్ళు. అంటే ఏడేళ్ల ఏజ్ డిఫరెన్స్ ఉంది. ఇద్దరు పిల్లలు పుట్టాక 2004లో విడాకులు తీసుకున్నారు. సైఫ్ అనంతరం కరీనా కపూర్ ని వివాహం చేసుకున్నారు.
హీరోయిన్ శిల్పా శెట్టి సైతం వయసులో తనకంటే చిన్నవాడైన రాజ్ కుంద్రాను వివాహం చేసుకుంది. అయితే రాజ్ కుంద్రా-శిల్పా శెట్టి మధ్య వయసులో నెలల వ్యత్యాసం మాత్రమే ఉంది. 1975లో వీరిద్దరూ పుట్టారు. ఆ మధ్య రాజ్ కుంద్రా నీలి వీడియోల ఆరోపణలపై అరెస్ట్ కాబడ్డారు.
Image: Varinder Chawla
ఇక గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా తనకంటే వయసులో పదేళ్ల చిన్నవాడిని పెళ్లి చేసుకుంది. 1982 జులై 18న జన్మించిన ప్రియాంక చోప్రా వయసు 40 ఏళ్ళు. ఆమె భర్త నిక్ జోనాస్ వయసు 30 ఏళ్ళు. వీరు 2018 లో ప్రేమ వివాహం చేసుకున్నారు.
Image credit: Anushka Sharma/Facebook
1988 మే 1న జన్మించిన అనుష్క శర్మ వయసు 34 ఏళ్ళు. ఆమె స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని వివాహం చేసుకున్నారు. 1988 నవంబర్ 5న జన్మించిన విరాట్ కోహ్లీ ఓ నాలుగు నెలలు భార్య కంటే చిన్నవాడు. ఇలా కొందరు హీరోయిన్స్ వయసులో తమకంటే చిన్న వాళ్ళను వివాహం చేసుకున్నారు.