- Home
- Entertainment
- పుట్టుకతోనే కళ్యాణ్ బాబుకి చిన్న సమస్య.. ఇప్పటికీ అమ్మని అడుగుతూనే ఉంటాడు, ఇష్టమైన ఫుడ్ గురించి నాగబాబు
పుట్టుకతోనే కళ్యాణ్ బాబుకి చిన్న సమస్య.. ఇప్పటికీ అమ్మని అడుగుతూనే ఉంటాడు, ఇష్టమైన ఫుడ్ గురించి నాగబాబు
జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. నాగబాబు ఇటీవల ఇంటర్వ్యూలో తమ ముగ్గురు సోదరులు ఇద్దరు చెల్లెల్లు, వాళ్ళ అమ్మ అంజనా దేవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గెలుపొందగా.. జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు విజయం సాధించారు. పవన్ కళ్యాణ్ కోరుకున్నట్లుగా 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించారు.
జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. నాగబాబు ఇటీవల ఇంటర్వ్యూలో తమ ముగ్గురు సోదరులు ఇద్దరు చెల్లెల్లు, వాళ్ళ అమ్మ అంజనా దేవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిన్న తనంలో అమ్మ మమ్మల్ని చదవండి అని బాగా విసిగించేది అట. అమ్మకి అన్నయ్య అంటే బాగా ఇష్టం. అమ్మకి ప్రతి పనిలో అన్నయ్య సాయం చేసేవాడు.
నన్ను మాత్రం బాగా కొట్టేది. ఇంట్లో కళ్యాణ్ బాబు అంటే అందరికి స్పెషల్.. ఎందుకంటే కళ్యాణ్ బాబు ఆరోగ్యంగా పుట్టిన బేబీ కాదు. చాలా బలహీనంగా పుట్టాడు. దీనితో కళ్యాణ్ బాబుని అమ్మ ఎంతో కేరింగ్ తో చూసుకుంది. నాన్నకి మాత్రం విపరీతమైన కోపం. ఎలాంటి కోపం వచ్చినా నాన్న ముందుగా పెద్ద కొడుకు అన్నయ్య కాబట్టి ఆయన్నే తిట్టేవారు.
పెద్దయ్యాక కూడా కొడుకుల కోసం అంజనాదేవి స్పెషల్ వంటకాలు చేస్తుందట నిజమేనా అని యాంకర్ ప్రశ్నించారు. నాగబాబు మాట్లాడుతూ.. కళ్యాణ్ బాబుకి పులావ్ బాగా ఇష్టం. తినాలని అనిపించినప్పుడు ఏదైనా వండి పంపొచ్చు కదమ్మా అని అడుగుతాడు. అమ్మ కూడా ఎప్పుడు అడుగుతాడా అని ఎదురుచూస్తూ ఉంటుంది. స్పెషల్ గా పులావ్ వండి పంపిస్తుంది.
అమ్మ ఎక్కువగా కళ్యాణ్ బాబు, అన్నయ్యతో ఉంటుంది. వాళ్లిద్దరే అమ్మ బాగోగులు చూసుకుంటున్నారు అని నాగబాబు తెలిపారు. మా అమ్మకి కోడళ్ళు ఎవరు వంట చేసినా నచ్చదు అంటూ నవ్వుతూ చెప్పాడు.
ఇటీవల పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో విజయం సాధించగానే అంజనా దేవి స్పందించిన సంగతి తెలిసిందే. ఇన్నేళ్లు వాడు పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది అని.. ఇకపై నుంచి తాను గాజు గ్లాసు లోనే టీ తాగుతానని తెలిపింది.