- Home
- Entertainment
- Nagababu: రాజకీయాలకి కావాలి ఓ సపరేట్ లుక్... పూర్తిగా పవన్ లా మారిన నాగబాబును చూడండి!
Nagababu: రాజకీయాలకి కావాలి ఓ సపరేట్ లుక్... పూర్తిగా పవన్ లా మారిన నాగబాబును చూడండి!
తెల్ల బట్టలు,గడ్డం, కళ్ళజోడు దేశ్ కి నేతా అవతారంలో సరికొత్తగా ఉన్నారు నాగబాబు. మరి రాజకీయాలకు ఓ సపరేట్ లుక్ ఉంటుంది. దాన్ని మైంటైన్ చేస్తేనే జనాలు నమ్ముతారు. ఈ విషయాన్ని నాగబాబు బాగా ఒంటబట్టించుకున్నారు.

Nagababu - Pawan Kalyan
రాజకీయ నాయకుడిగా ఉండడం చాలా కష్టం. దీని కోసం చాలా త్యాగాలు చేయాలి. నచ్చిన బట్ట వేసుకోలేం, కోరిన తిండి తినలేం. నోటికి వచ్చింది మాట్లాడలేం. నవ్వాలంటే నవ్వలేం, ఏడవాలంటే ఏడవలేం . ఒకరకంగా చెప్పాలంటే మనసులో ఇన్నర్ ఫీలింగ్ ఏదైనా జనాలు నవ్వితే నవ్వాలి, ఏడిస్తే ఏడవాలి. పొలిటికల్ మైలేజ్ కోసం నానా పనులు చేయాలి. రోడ్లు ఊడవడం నుండి చిన్నపిల్లల ముడ్లు కడగడం వరకు అన్నీ చేయాలి. ప్రజలకు దగ్గరవ్వాలన్నా, వాళ్ళ నమ్మకం సాధించాలన్నా ఇవ్వన్నీ తప్పని సరి.
Nagababu - Pawan Kalyan
నటుడు నాగబాబు (Nagababu)తన లైఫ్ స్టైల్ కి విరుద్ధంగా ప్రస్తుతం ఇదే చేస్తున్నారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ ని అక్షరాలా అనుసరిస్తూ.. వేషధారణ నుండి మాట తీరు వరకు మార్చేశాడు. నాగబాబు రాజకీయాల్లోకి వచ్చి చాలా కాలం అవుతుంది. 2019లో జనసేన పార్టీ ఓటమి తర్వాత ఆయన అంత యాక్టీవ్ గా లేరు.
Nagababu - Pawan Kalyan
పవన్ ఎమ్మెల్యేగా రెండు చోట్ల పోటీ చేసి పరాజయం పొందగా, నాగబాబు ఎంపీగా ఎన్నికల బరిలో దిగి ఓటమి చెందారు. ఎన్నికలు జరిగి మూడేళ్లు అవుతున్నా నాగబాబు రాజకీయాల్లో క్రియాశీలకంగా కనిపించలేదు. జనసేన పార్టీ కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొన్న దాఖలాలు లేవు. సడన్ గా రెండు నెలల నుండి నాగబాబు జనసేన వేదికలపై తమ్ముడు పవన్ తో పాటు కూర్చుంటున్నారు.
Nagababu
జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు తెల్ల బట్టలో ఫక్తు రాజకీయ నాయకుడిగా దర్శనమిచ్చారు. సడన్ గా లుక్ మార్చితే జనాలు షాక్ అవుతుంటారనుకున్నారేమో కానీ... ఆ సభకు రెండు రోజుల ముందు సుదీర్ఘమైన ఓ ఎమోషనల్ సీరియస్ నోట్ వదిలారు. ఇకపై ఈ జీవితం ప్రజాసేవకే అంకితం అంటూ భారీ వాగ్దానం చేశాడు.
సాధారణంగా రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నామంటే మన ఉద్దేశం ప్రజాసేవ చేయడమని. మరి 2019 ఎన్నికల్లో ఎంపీగా నాగబాబు ఏ ఉద్దేశంతో పోటీ చేశారో ఆయనకే తెలియాలి. 2024 ఎన్నికలే లక్ష్యంగా కార్యాచరణ మొదలు పెట్టిన జనసేన పార్టీలో నాగబాబు కూడా క్రియాశీలకంగా కనిపిస్తున్నాడు.
జనసేన పార్టీ (Janasena Party)కార్యక్రమాల్లో, సభల్లో పాల్గొంటున్నాడు. దీని కోసం ఆయన తెల్లబట్టలు, కళ్ళ జోడు ధరించి గడ్డం పెంచి ఫక్తు ప్రజాసేవకుడిగా మారిపోయారు. సాధారణంగా నాగబాబు కలర్ ఫుల్ డ్రెస్ లు ధరించడానికి ఇష్టపడతారు. బట్టల తల కూడా కనిపించడకుండా బ్యాండ్ ధరిస్తారు. రౌడీ లుక్ లో ఫోటో షూట్స్ చేయడం కూడా ఓ సరదా. అవన్నీ నాగబాబు పక్కన పెట్టినట్లు కనిపిస్తుంది.
మొత్తంగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ని స్ఫూర్తిగా తీసుకున్న నాగబాబు ఆయన మాదిరే ప్రవర్తిస్తున్నారు. టీవీ షోలలో మాత్రం నాగబాబు మోడరన్ దుస్తుల్లో కనిపిస్తున్నారు. పవన్ సినిమాల్లో పాత్రలకు అనుగుణంగా బట్టలు ధరిస్తారు. విదేశీ ప్రయాణాల కోసం ట్రెండీగా తయారవుతారు. నిజానికి రాజకీయ నాయకులు గాంధీజీలా, నేతాజీలా వస్త్రాలు ధరించాలని రూలూ లేదు... ప్రజలూ కోరుకోరు. ఒక పొలిటీషియన్ చర్యల ద్వారానే జనాలు అభిమానం పెంచుకుంటారు. ఈ నిజాలు తెలియని కొందరు రాజకీయ నాయకులు సందర్భానికి తగ్గట్టు వేషం కడుతూ ఉంటారు.