- Home
- Entertainment
- నాగ చైతన్య 10 బ్లాక్‌బస్టర్ మూవీస్, అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలెన్ని? డిజాస్టర్స్ సంగతేంటి?
నాగ చైతన్య 10 బ్లాక్‌బస్టర్ మూవీస్, అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలెన్ని? డిజాస్టర్స్ సంగతేంటి?
Naga Chaitanya Top 10 Highest Grossing Movies : అక్కినేని నటవారసుడు నాగ చైతన్యకు 39 ఏళ్లు నిండాయి. హిట్ ప్లాప్ లతో సంబందం లేకుండా మంచి మంచి కాన్సెప్ట్ లతో సినిమాలు చేస్తూ వస్తున్న నాగచైతన్య.. కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలు ఏవో తెలుసా.

నాగ చైతన్య 10 బ్లాక్‌బస్టర్ మూవీస్
నాగ చైతన్య 'లాల్ సింగ్ చద్దా' 2022లో రిలీజైంది. 180 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా 132 కోట్లు వసూలు చేసింది. బాక్సాఫీస్ దగ్గర ఈసినిమా డిజాస్టర్‌గా నిలిచింది. అమీర్ ఖాన్, కరీనా కపూర్ లీడ్ రోల్స్ చేశారు.
తండేల్
2025లో వచ్చిన నాగ చైతన్య 'తండేల్' సూపర్ హిట్ అయ్యింది. 70 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈసినిమా 93.5 కోట్లు వసూలు చేసింది. చందూ మొండేటి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. .
మనం
అక్కినేని ఫ్యామిలీ అంతా కలిసి చేసిన సినిమా మనం. ఏఎన్నార్ కు చివరి సినిమా ఇది. ఈసినిమా 2014లో రిలీజైంది. విక్రమ్ కె కుమార్ డైరెక్షన్‌లో 30 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా 67 కోట్లు వసూలు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఏఎన్ఆర్, నాగార్జున కూడా నటించారు.
మజిలీ
నాగ చైతన్య 'మజిలీ' 2019లో వచ్చింది. శివ నిర్వాణ డైరెక్షన్‌లో 25 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా 67 కోట్లు వసూలు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. చైతన్య జోడీగా ఈసినిమాలో సమంత హీరోయిన్‌గా నటించింది.
వెంకీ మామ
2019లో వచ్చిన నాగ చైతన్య 'వెంకీ మామ' బడ్జెట్ 40 కోట్లు. ఇది 66 కోట్లు వసూలు చేసింది. బాబీ కొల్లి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో వెంకటేష్ నాగచైతన్య మేనమామగా నటించారు. రాశీ ఖన్నా హీరోయిన్ గా నటించిన ఈసినిమా సూపర్ హిట్ గా నిలిచింది.
బంగార్రాజు
2022లో వచ్చిన 'బంగార్రాజు'లో నాగ చైతన్య, రమ్యకృష్ణ, నాగార్జున నటించారు. 35 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా 65 కోట్లు వసూలు చేసింది. కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ హిట్ అయింది.
లవ్ స్టోరీ
నాగ చైతన్య 2021 హిట్ సినిమా 'లవ్ స్టోరీ'లో సాయి పల్లవి హీరోయిన్. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఈ సినిమా 35 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి.. 63 కోట్లు వసూలు చేసింది.
రారండోయ్ వేడుక చూద్దాం..
కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో నాగచైతన్య హీరోగా నటించిన 'రారండోయ్ వేడుక చూద్దాం' 2017లో రిలీజ్ అయ్యింది. 25 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా 50 కోట్లు వసూలు చేసింది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా, జగపతి బాబు ప్రధాన పాత్రలో నటించారు.
100% లవ్
నాగ చైతన్య సూపర్ హిట్ '100% లవ్' 2011లో వచ్చింది. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా 15 కోట్ల బడ్జెట్‌తో రూపొంది.. 40 కోట్లు వసూలు చేసింది. తమన్నా భాటియా, తారా అలీషా హీరోయిన్లుగా నటించారు.
తడాఖా
2013లో వచ్చిన నాగ చైతన్య 'తడాఖా' బడ్జెట్ 20 కోట్లు. ఈ మూవీ 39 కోట్లు వసూలు చేసింది. కిషోర్ కుమార్ పార్ధసాని డైరెక్టర్. ఇందులో తమన్నా భాటియా లీడ్ రోల్‌లో నటించింది.

