సమంతకు మరో షాక్ ఇచ్చిన నాగచైతన్య, ఆమె లేకుండా ఉండలేనంటూ కామెంట్స్
సమంత ఫ్యాన్స్ కు షాక్ ఇస్తూ.. శోభిత గురించి మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు నాగచైతన్య. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని, చైతూ చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి.

అక్కినేని వారసుడిగా
అక్కినేని వారసుడిగా, మూడో తరం హీరోగా నాగచైతన్య కొనసాగుతున్నాడు. స్టార్ హీరోల సరసన లేకపోయినా.. డిఫరెంట్ స్టోరీలను సెలెక్ట్ చేసుకుంటూ.. టాలీవుడ్ లో తన మార్క్ చూపిస్తున్నాడు. రీసెంట్ గా నాగచైతన్య నటించిన తండేల్ మూవీ 100 కోట్లకుపైగా వసూలు చేసి, బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్న నాగచైతన్య, పర్సనల్ లైఫ్ విషయంలో కూడా వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు. రీసెంట్ గా ఓఇంటర్వ్యూలో పాల్గొన్న అక్కినేని హీరో, తన సినిమాల గురించి, పర్సనల్ లైఫ్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
సమంతతో విడాకులు, శోభితతో పెళ్లి
2021 లో సమంతతో విడాకుల తరువాత అక్కినేని నాగ చైతన్య గతేడాది చివర్లో శోభిత ధూళిపాళని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. బంధువులు, స్నేహితులు, అతికొద్దిమంది సమక్షంలో వీరి పెళ్లి చాలా సింపుల్ గా జరిగింది. సమంతతో దాదాపు ఏడేళ్లుగా ప్రేమలో ఉన్న చైతన్య ఆవిషయాన్ని చాలా రహస్యంగా ఉంచగలిగారు. కానీ శోభిత తో ప్రేమలో పడ్డప్పుడు మాత్రం చాలా సందర్భాల్లో వీరు దొరికిపోయారు. ఫారెన్ డేట్ ఫోటోలు వైరల్ అవ్వడం, చైతు ఇంటిముందు శోభిత కారు కనిపించడం లాంటివి బాగా వైరల్ అయ్యాయి. కానీ వాళ్ళు కలిసి ఒక్క సినిమాలో కూడా నటించకపోవడంతో ఆ ప్రచారంలో నిజం లేదేమో అని అంతా అనుకున్నారు. కానీ సడెన్ గా నిశ్చితార్ధం చేసుకుని, వెంటనే పెళ్లి కూడాచేసుకున్నారు ఈ స్టార్ సెలబ్రిటీలు.
ఆమెలేకుండా ఉండలేను
జగపతి బాబు హోస్ట్ గా నిర్వహిస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా కార్యక్రమంలో రీసెంట్ గా పాల్గొన్నాడు నాగచైతన్య. ఈ క్రమంలో చైతన్య నుంచి చాలా విషయాలు రాబట్టాడు జగపతి బాబు. ఎవరు లేకుండా నువ్వు ఉండలేవు, అంతగాప్రేమించే వ్యక్తి ఎవరు అని జగ్గుభాయ్ అడిగారు. దాంతో నాగచైతన్య మాట్లాడుతూ.. '' నా భార్య శోభిత లేకుండా నేను ఉండలేను, శోభిత నా భార్య మాత్రమే కాదు… నాకు పెద్ద బలం కూడా. తన సపోర్ట్ నాకు మంచి ఎనర్జీ ఇస్తుంది. ఆమె లేకుండా నేను ఉండలేను ” అంటూ భార్య గురించి చాలా ఎమోషనల్ కామెంట్స్ చేశాడు నాగచైతన్య.
శోభితతో ప్రేమ అలా మొదలైంది
అసలు నాగ చైతన్య, శోభిత ప్రేమ ఎలా మొదలైంది? వారు ఎలా కలుసుకున్నారు? ఎలా దగ్గరయ్యారు? అనే విషయాలు తెలుసుకోవాలి అని అక్కినేని అభిమానుల్లో ఉంది. ఈ విషయాలపై కూడా క్లారిటీ ఇచ్చాడు నాగచైతన్య. “శోభితతో నా ప్రయాణం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మొదలైంది. ఒకసారి నా క్లౌడ్ కిచెన్ గురించి పోస్ట్ పెట్టినప్పుడు, శోభిత ఒక ఎమోజీతో రెస్పాన్స్ ఇచ్చింది. అప్పటి నుండి ఆమెతో చాట్ చేయడం మొదలుపెట్టాను. ఆ తర్వాత ఒకసారి కలుసుకున్నాం. అలా మా ప్రయాణం ప్రేమ వరకూ వెళ్లింది. నా భార్యను అలా కలుస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఆమె సినిమాలు, వర్క్ నాకు బాగా తెలుసు'' అని అన్నారు నాగచైతన్య. సమంతను అంతగాప్రేమించిన చైతూ.. శోభిత గురించి ఈ కామెంట్స్ చేయడంత్ సమంత ఫ్యాన్స్ ఒకింత బాధపడుతున్నారు.
సమంతతో పెళ్లి, విడాకులు
నాగచైతన్య హీరోగా నటించిన ఏం మాయచేసావే సినిమాలో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది సమంత. ఇద్దరికి మధ్య ఈ సినిమా టైమ్ లోనే ప్రేమ చిగురించింది. అప్పటి నుంచి ప్రేమించుకున్న వీరు..ఎప్పుడు ఈ విషయం బయట చెప్పలేదు. అంతే కాదు కెమెరా కాళ్లకు కూడా ఎప్పుడూ చిక్కలేదు. దాదాపు ఏడేళ్ల ప్రేమ తరువాత 2017 లో వీరు పెళ్లిచేసుకోబోతున్నట్టు ప్రకటించారు. ఫ్యామిలీని ఒప్పించి రెండు మతాచారాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ఏడేళ్లు ప్రేమిచుకున్న ఈ జట నాలుగేళ్లు కూడా కలిసి ఉండలేకపోయారు. మనస్పర్ధల కారణంగా 2021 లో నాగచైతన్య, సమంత విడాకులు తీసుకుని విడిపోయారు. సమంత ఇప్పటికీ ఒంటరిగా జీవిస్తూ.. తన సినిమాలు తాను చేసుకుంటోంది.