చెరిగిపోని సమంత జ్ఞాపకం.. చేతిపై ఉన్న టాటూ తొలగించడంపై స్పందించిన చైతు..
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'లాల్ సింగ్ చడ్డా'. చిత్రంతో నాగ చైతన్య బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాగ చైతన్య ఈ చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. అమీర్ ఖాన్ స్నేహితుడు బాలరాజు పాత్రలో చైతు ఈ చిత్రంలో నటిస్తున్నాడు.

లాల్ సింగ్ చడ్డా(Lalsingh Chadda) ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న నాగ చైతన్యకి అతడి వ్యక్తిగత జీవితానికి గురించిన ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి. దీనితో మరోసారి నాగ చైతన్య, సమంత విడాకుల వ్యవహారం తెరపైకి వచ్చింది. సమంత నాగ చైతన్య 2017లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గత ఏడాది అక్టోబర్ లో వీరిద్దరూ విడిపోయిన సంగతి తెలిసిందే.
తాజాగా ఇంటర్వ్యూలో నాగ చైతన్య తన చేతిపై ఉన్న టాటూపై స్పందించాడు. ఆ టాటూ సమంతకి సంబంధించినది. తమ పెళ్లి రోజుని నాగ చైతన్య(Naga Chaitanya) చేతిపై టాటూగా వేయించుకున్నాడు. వీరిద్దరూ విడిపోయినప్పటికీ ఆ టాటూ చెరిగిపోని జ్ఞాపకంగా మిగిలిపోయింది.
ఆ టాటూని తొలగిస్తారా అని ప్రశ్నించగా.. ఇప్పటికి అలాంటి ఆలోచన లేదని నాగ చైతన్య తెలిపాడు. తమ వెడ్డింగ్ డేట్ ని మోర్స్ కోడ్ రూపంలో టాటూ వేయించుకున్నారు. ఈ సందర్భంగా నాగ చైతన్య ఫ్యాన్స్ కి ఓ సలహా ఇచ్చారు. కీలకమైన పర్సనల్స్ డీటెయిల్స్ ని టాటూగా వేయించుకోవద్దని సూచించాడు. భవిష్యత్తులో అవి మారిపోయే అవకాశం ఉంది కాబట్టి టాటూల జోలికి వెళ్ళొద్దని తెలిపాడు.
సమంత(Samantha) కూడా తన బాడీపై నాగ చైతన్యకి సంబంధించిన టాటూ వేయించుకుంది. ఇటీవల సామ్ కూడా.. జీవితంలో ఎప్పుడూ టాటూ వేయించుకోకూడదని సలహా ఇచ్చింది. విడిపోయిన తర్వాత చైతు, నాగ చైతన్య ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీ అయిపోయారు.
వెండితెరపై సమంత, చైతూ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిన కారణంగానే రియల్ లైఫ్‌లోనూ వీరిద్దరు ఒక్కటయ్యారు. దాదాపు ఎడెళ్లు సీక్రెట్‌గా ప్రేమించుకున్న వీరిద్దరు 2017లో అక్టోబర్‌లో పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. కానీ సరిగ్గా నాలుగేళ్లకి ఈ ఇద్దరు విడిపోవడం అభిమానులను, సినీ వర్గాలను ఆందోళనకి గురి చేసింది.
సమంత(Samantha) కూడా తన బాడీపై నాగ చైతన్యకి సంబంధించిన టాటూ వేయించుకుంది. ఇటీవల సామ్ కూడా.. జీవితంలో ఎప్పుడూ టాటూ వేయించుకోకూడదని సలహా ఇచ్చింది. విడిపోయిన తర్వాత చైతు, నాగ చైతన్య ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీ అయిపోయారు.
ఇక సినిమాల విషయానికి వస్తే నాగ చైతన్యకి చివరగా 'థాంక్యూ' మూవీ రూపంలో బిగ్ షాక్ ఎదురైంది. లాల్ సింగ్ చడ్డా రేపు ప్రేక్షకుల ముందుకు రానుండడంతో ఉత్కంఠ నెలకొంది. ఇక నాగ చైతన్య తదుపరి సర్కారు వారి పాట ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో కూడా ఒక చిత్రానికి కమిటై ఉన్నాడు.