- Home
- Entertainment
- `సమంతతో కెమిస్ట్రీ` నాగచైతన్య షాకింగ్ కామెంట్స్.. ఆ ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ ది బెస్ట్ అంటూ..
`సమంతతో కెమిస్ట్రీ` నాగచైతన్య షాకింగ్ కామెంట్స్.. ఆ ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ ది బెస్ట్ అంటూ..
నాగచైతన్య.. మరోసారి సమంత గురించి ఓపెన్ అయ్యారు. సమంతతో కెమిస్ట్రీ ఎలా ఉంటుందో బయటపెట్టాడు. తాజాగా ఆయన చెప్పిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

నాగచైతన్య(Naga Chaitanya), సమంత(Samantha) విడిపోయి ఆల్మోస్ట్ తొమ్మిది నెలలవుతుంది. కానీ వారిద్దరికి సంబంధించి ఏ విషయం బయటకొచ్చిన హాట్ టాపిక్ అవుతుంది. వాళ్లు స్పందించే ప్రతి విషయం చర్చనీయాంశంగా, సంచలనంగా మారుతుంది. అయితే ఒకరిపై ఒకరు స్పందించేందుకు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. తమ వ్యక్తిగత విషయాలు ఓపెన్ అయ్యేందుకు ఆసక్తి చూపించడం లేదు.
కానీ ఒకేసారి అటూ నాగచైతన్యపై సమంత, సమంతపై నాగచైతన్య రియాక్ట్ కావడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. `కాఫీ విత్ కరణ్` (Koffe with Karan)షోలో నాగచైతన్య గురించి చెప్పింది సమంత. ఆయన తన మాజీ భర్త అని, విడిపోవడం ఈజీగా జరగలేదని, చాలా మనోవేదనకు గురయ్యానని తెలిపింది. అంతేకాదు ఇప్పుడు ఇద్దరం ఒకగదిలో ఉంటే అందులో కత్తుల్లాంటివి లేకుండా చూసుకోవాలని తెలిపింది. అంతే ఇద్దరి మధ్య ఆ స్థాయిలో కోపం ఉందనే విషయాన్ని వెల్లడించింది సమంత.
తాజాగా సమంతపై నాగచైతన్య స్పందించిన వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. నాగచైతన్య నటించిన `థ్యాంక్యూ`(Thank You) సినిమా నేడు శుక్రవారం(జులై 22)న విడుదలైంది. ఈ చిత్ర ప్రమోషన్లో భాగంగా ఓ తమిళ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు నాగచైతన్య. ఇందులో ఆయన సమంతతో కెమిస్ట్రీ గురించి ఓపెన్ అవడం విశేషం.
`మీరు ఇప్పటి వరకు నటించిన హీరోయిన్లలో ఎవరితో రొమాన్స్ బాగుంటుందని, ఎవరితో కంఫర్ట్ గా ఫీలయ్యారనేది ప్రశ్నించారు. దీనికి నాగచైతన్య స్పందిస్తూ సాయిపల్లవితోపాటు సమంత పేర్లు చెప్పడం విశేషం. `లవ్ స్టోరీ`లో సాయిపల్లవి(Sai Pallavi)తో గ్రేట్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కుదిరిందని వెల్లడించారు. ఆ తర్వాత సమంతతోనూ కెమిస్ట్రీ చాలా బాగుంటుందని చెప్పడం విశేషం. ఈ ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చాలా బాగుంటుందని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే నాగచైతన్య, సమంత కలిసి మూడు ది బెస్ట్ లవ్ స్టోరీస్ చేశారు. వారి మధ్య ప్రేమకి కారణమైందే లవ్ స్టోరీ నేపథ్యంలో వచ్చిన `ఏం మాయ చేసావె`. ఈ చిత్రంతోనే ఇద్దరు దగ్గరయ్యారు. ఆ తర్వాత `మనం`, `ఆటో నగర్ సూర్య`, `మజిలి` చిత్రాలు చేసిన విషయం తెలిసిందే. `ఆటోనగర్ సూర్య` తప్ప మిగిలిన అన్ని ఫీల్ గుడ్ మూవీస్ విజయాలు సాధించాయి. ఇద్దరు మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది.
వెండితెరపై సమంత, చైతూ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిన కారణంగానే రియల్ లైఫ్‌లోనూ వీరిద్దరు ఒక్కటయ్యారు. దాదాపు ఎడెళ్లు సీక్రెట్‌గా ప్రేమించుకున్న వీరిద్దరు 2017లో అక్టోబర్‌లో పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. కానీ సరిగ్గా నాలుగేళ్లకి ఈ ఇద్దరు విడిపోవడం అభిమానులను, సినీ వర్గాలను ఆందోళనకి గురి చేసింది.
విడిపోవడమనేది చాలా బాధతో జరిగిందని, ఆ తర్వాత తాను ఎంతో స్ట్రగుల్స్ పడ్డానని, మానసికంగా ఎంతో వేదన అనుభవించినట్టు సమంత తెలిపింది. ఇప్పుడు ఆమె చాలా స్ట్రాంగ్‌గా తయారైనట్టు తెలిపింది. మరోవైపు చైతూ ఈ విషయంపై ఓ సందర్భంలో చెబుతూ, ఇద్దరం ఇష్టపూర్వకంగానే విడిపోయామని, ఇద్దరం హ్యాపీగానే ఉన్నామని చెప్పడం గమనార్హం.