- Home
- Entertainment
- నా మాట స్ట్రైట్ గా ఉంటుంది, డబుల్ మీనింగ్ ఉండదు.. మొదట గుర్తొచ్చే నటి ఎవరంటే, చైతు కామెంట్స్
నా మాట స్ట్రైట్ గా ఉంటుంది, డబుల్ మీనింగ్ ఉండదు.. మొదట గుర్తొచ్చే నటి ఎవరంటే, చైతు కామెంట్స్
నాగ చైతన్య ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీ అవుతున్నాడు. సామ్ తో డివోర్స్ తర్వాత చైతు తన వర్క్ ఫై ఫోకస్ పెట్టాడు. చైతు చివరగా లవ్ స్టోరీ, బంగార్రాజు చిత్రాలతో విజయాలు దక్కించుకున్న సంగతి తెలిసిందే.

నాగ చైతన్య ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీ అవుతున్నాడు. సామ్ తో డివోర్స్ తర్వాత చైతు తన వర్క్ ఫై ఫోకస్ పెట్టాడు. చైతు చివరగా లవ్ స్టోరీ, బంగార్రాజు చిత్రాలతో విజయాలు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాగ చైతన్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'థాంక్యూ' అనే చిత్రంలో నటిస్తున్నాడు.
ఈ చిత్రం జూలై 22న రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో ప్రమోషన్స్ మొదలు పెట్టారు. నాగ చైతన్య, రాశి ఖన్నా ఓ ఫన్నీ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకు కేవలం 5 సెకండ్లలో సమాధానం చెప్పాలి. టాప్ బ్రాండ్ కార్ల పేర్లు, మాథమెటిక్ ఫార్ములాస్, కుక్కల పేర్లు ఇలా ఏమి అడిగినా కేవలం 5 సెకండ్లలోనే సమాధానం ఇవ్వాలి.
యాంకర్ అడిగిన ప్రశ్నలకు చాలా వాటికి రాశి ఖన్నా, చైతు తడబడ్డారు. కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. ఐదు సెకండ్లలో మూడు డబుల్ మీనింగ్ మాటలు చెప్పమని యాంకర్ అడగగా.. చైతూ, రాశి ఖన్నా నవ్వేశారు. చైతు మాట్లాడుతూ.. నేనెప్పుడూ డబుల్ మీనింగ్ పదాలు మాట్లాడను.. ఏదైనా ఉంటే స్టైట్ గా అడిగేస్తా అని చైతు తెలిపాడు.
ఇక మాథమెటిక్ ఫార్ములాలు చెప్పమంటే.. తనకి (a+b)^2 మాత్రమే గుర్తుందని.. అది కూడా 100 పర్సెంట్ లవ్ చిత్రం వల్లే అని నాగ చైతన్య తెలిపాడు. ఇక హాట్ అనగానే గుర్తుకు వచ్చే ముగ్గురు నటుల పేర్లు చెప్పాలని అడగగా.. చైతు.. వరల్డ్ ఫేమస్ ఏంజెలినా జోలీ పేరు చెప్పాడు. ఆ తర్వాత తీరిగ్గా ఆలోచించుకుని డానియల్ క్రేగ్, జెసికా చాస్టన్ అని నాగ చైతన్య హాలీవుడ్ నటుల పేర్లు చెప్పాడు.
ఇదిలా ఉండగా థ్యాంక్యూ మూవీ రొమాంటిక్ అండ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా అలరించేందుకు రెడీ అవుతోంది. చైతు సరసన రాశి ఖన్నా తో పాటు అవికా గోర్, మాళవిక నైర్ కూడా నటిస్తున్నారు.
విక్రమ్ కుమార్ స్టైల్ లో ఈ మూవీ ఊహించని ట్విస్ట్ లతో ఉండబోతోంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీత దర్శకుడు. గతంలో నాగ చైతన్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో మనం చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.