- Home
- Entertainment
- Naga Chaitanya: హాట్ టాపిక్ గా చైతూ సెకండ్ మ్యారేజ్ రూమర్స్.. నిర్ణయం నాగ్ దేనా, ఆమె ఎవరంటే..?
Naga Chaitanya: హాట్ టాపిక్ గా చైతూ సెకండ్ మ్యారేజ్ రూమర్స్.. నిర్ణయం నాగ్ దేనా, ఆమె ఎవరంటే..?
అక్కినేని నాగ చైతన్య కెరీర్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. లవ్ స్టోరీ, బంగార్రాజు చిత్రాలతో చైతు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధించాడు. ప్రస్తుతం నాగ చైతన్య.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థ్యాంక్యూ అనే చిత్రంలో నటిస్తున్నాడు.

Naga Chaitanya
అక్కినేని నాగ చైతన్య కెరీర్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. లవ్ స్టోరీ, బంగార్రాజు చిత్రాలతో చైతు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధించాడు. ప్రస్తుతం నాగ చైతన్య.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థ్యాంక్యూ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా గత ఏడాది నాగ చైతన్య, సమంత విభేదాల కారణంగా వైవాహిక జీవితానికి ముగింపు పలికారు.
Naga Chaitanya
ప్రేమించుకుని వివాహం చేసుకున్న ఈ జంట మూడేళ్లపాటు అన్యోన్యంగా జీవించారు. ఆ తర్వాత ఊహించని విధంగా వచ్చిన విభేదాల వల్ల విడిపోయారు. దీనితో ఇది అభిమానులకు జీర్ణించుకోలేని షాక్ గా మారింది. ఏమైనా ఆ చేదు జ్ఞాపకాలని పక్కన పెట్టి ఇద్దరూ తమ వర్క్ లో బిజీగా మారారు.
Naga Chaitanya
ఇదిలా ఉండగా నాగ చైతన్య గురించి ప్రస్తుతం షాకింగ్ రూమర్స్ వినిపిస్తున్నాయి. నాగ చైతన్య త్వరలో రెండవ వివాహానికి రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ న్యూస్ ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే దీనిపై అక్కినేని కాంపౌడ్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు.
Naga Chaitanya
జరుగుతున్న ప్రచారం ప్రకారం నాగ చైతన్య రెండవ వివాహానికి సుముఖంగా ఉన్నారని అంటున్నారు. దీనితో నాగార్జున.. చైతూకి సరైన జోడీని వెతికే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే చైతూ సెకండ్ మ్యారేజ్ రూమర్స్ రకరకాలుగా వినిపిస్తున్నాయి.
Naga Chaitanya
గతంలో నాగ చైతన్య ఇష్టం మేరకు నాగార్జున అతడికి వివాహం చేశారు. కానీ ఈసారి డెసిషన్ నాగార్జున చేతుల్లోకి వెళ్లిందట. కానీ పూర్తిగా కాదు. నాగ చైతన్య ఇష్టాయిష్టాలు తెలుసుకుని అతడికి సరైన జోడీని వెతికే బాధ్యతని నాగార్జున తీసుకున్నారట. ఈసారి మాత్రం నాగ చైతన్య నటిని వివాహం చేసుకోవడం లేదని.. చిత్ర పరిశ్రమతో సంబంధం లేని అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Naga Chaitanya
ఇక్కడ మరో రూమర్ కూడా వైరల్ గా మారింది. చైతు.. మజిలీ నటి దివ్యాంష కౌశిక్ తో రిలేషన్ లో ఉన్నట్లు.. ఆమెని వివాహం చేసుకునే అవకాశం ఉన్నట్లు ఒక రూమర్ ప్రచారం జరుగుతోంది. అయితే నాగ చైతన్య సెకండ్ మ్యారేజ్ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఏం జరగబోతోందో వేచి చూడాలి.
Naga Chaitanya
ఇదిలా ఉండగా నాగ చైతన్య ప్రస్తుతం థాంక్యూ చిత్రంతో పాటు.. అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా చిత్రంలో కూడా నటిస్తున్నాడు. నాగ చైతన్య అక్కినేని వారసుడిగా 'జోష్' చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.