- Home
- Entertainment
- సౌత్ లో తిరుగులేని క్రేజ్.. భారీగా డిమాండ్ చేస్తున్న అనిరుధ్, సినిమాకు ఎంత తీసుకుంటున్నాడంటే..?
సౌత్ లో తిరుగులేని క్రేజ్.. భారీగా డిమాండ్ చేస్తున్న అనిరుధ్, సినిమాకు ఎంత తీసుకుంటున్నాడంటే..?
35 ఏళ్లు రాకుండానే.. తిరుగులేనిక్రేజ్ తో పాటు.. కోట్లలో సంపాదిస్తున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్. తమిళ తెలుగు సినిమాలతో పాటు సౌత్ లో అన్ని భాషల్లో మ్యూజిక్ చేస్తున్న అనిరుధ్.. సినిమాకు భారిగా డిమాండ్ చేస్తున్నాడట.

సౌత్ లో ఇప్పుడు ఎక్కడ విన్నా అనిరుధ్ పేరే వినిపిస్తోంది.. అనిరుధ్ మ్యూజికే వినిపిస్తుంది. స్టార్ హీరోల సినిమాలంటే చాలు.. ఈ కుర్ర మ్యూజిక్ డైరెక్టర్ నే తీసుకుంటున్నాడు. అతను కూడా అదిరిపోయే ట్యూన్లు చేస్తూ.. వరుసగా హిట్లు కొట్టేస్తున్నాడు. దాంతో అనిరుధ్ కు డిమాండ్ బాగా పెరిగిపోయిందట. రెమ్యూనరేషన్ కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
తాజాగా రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ మూవీ రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేస్తోంది. ఈ సినిమాకు మ్యూజిక్ చేయడంతో పాటు.. తలైబా ఎలివేసన్ సీన్స్.. సినిమా మొత్తానికి బీజియంతో పాటు.. కావాలయ్య సాంగ్ తో దుమ్మురేపాడు అనిరుధ్ రవిచంద్రన్. ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్, బీజీఎం హైలెట్ గా నిలిచింది. జైలర్ మూవీ సక్సెస్ తో అనిరుధ్ తో పని చేయాలని ప్రయత్నిస్తున్న హీరోలు, దర్శకుల సంఖ్య పెరుగుతోంది.
అయితే అనిరుధ్ టైమ్ మాత్రం దొరకడంలేదట. కాస్త లేట్ అయినా.. ఈ కుర్ర మ్యూజిక్ డైరెక్టర్ నే తీసుకోవాలని చూస్తున్నారట మేకర్స్.. దాంతో అతను కూడా రెమ్యునరేషన్ గట్టిగా అడుగుతున్నాడని సమాచారం. ప్రస్తుతం సినిమాకు 8 కోట్ల వరకూ డిమాండ్ చేస్తున్నాడట అనిరుధ్. అయితే ఇందులో నిజం ఎంతో తెలియదు కాని.. అనిరుథ్ డిమాండ్ 5 కోట్లు పై మాటే అని అంతా అంటున్నారు.
అనిరుధ్ చేతిలో వరుసగా పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి టాలీవుడ్ నుంచి ఎన్టీఆర్ దేవర సినిమా చేస్తున్నాడు. అటు బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ జవాన్ కు కూడా ఇతనే మ్యూజిక్ చేస్తున్నాడు. ఇంకా అతని ఖాతాలో చాలా సినిమాలు ఉన్నాయి. అనిరుధ్ మ్యూజిక్ కు చాలామంది ఫిదా అవుతున్నారు. సౌత్ లో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ అని చాలామంది అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
చాలా చిన్న వయస్సులో కెరీర్ స్టార్ట్ చేసి.. కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటూ.. దూసుకుపోతున్న ఈ కుర్ర మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పటికే 100 కోట్లకు పైగా ఆస్తులు కూడపెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రెహమాన్ లాంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు మాత్రమే సినిమాకు 8 కోట్ల వరకూ తీసుకుంటున్నారు. అటువంటిది.. ఇంత చిన్నవయస్సులో అనిరుధ్ అంత రెమ్యూనరేషన్ తీసుకోవడంతో పాటు.. తన మ్యూజిక్ తో సినిమాలను హిట్టు బాట పట్టిస్తున్నాడు కూడా.