- Home
- Entertainment
- Mouni Roy : బ్లాక్ డ్రెస్ లో మెస్మరైజ్ చేస్తున్న ‘మౌని రాయ్’.. సింపుల్ లుక్ లోనూ చింపేస్తోంది...
Mouni Roy : బ్లాక్ డ్రెస్ లో మెస్మరైజ్ చేస్తున్న ‘మౌని రాయ్’.. సింపుల్ లుక్ లోనూ చింపేస్తోంది...
బాలీవుడ్ నటి మౌనీ రాయ్ సరికొత్త లుక్స్ తో తన ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేస్తోంది. ఎప్పటికప్పుడు కొత్తలుక్ లో దర్శనమిస్తోంది. సోషల్ మీడియాలో తన సరికొత్త ఫొటోలను పోస్ట్ చేస్తున్న ఈ భామ, తాజాగా కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

బాలీవుడ్ నటి మౌనీరాయ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువనే చెప్పాలి. ఆమె నటించిన హిందీ సీరియల్ నాగిని.. విశేష ఆదరణ పొందింది. దీంతో.. ఆమెకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్ సినిమాల్లోనూ ఆమె అవకాశాలు దక్కించుకుంటోంది.
మౌని రాయ్ అందానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే. అయితే.. ఆమె ఫ్యాషన్ సెన్స్ కి కూడా విపరీతమైన క్రేజ్ ఉందనే చెప్పాలి. ఆమె ఎప్పటికప్పుడు.. కొత్త రకం ఫ్యాషన్ ట్రెండ్ ని ఫాలో అవుతూ ఉంటారు.
తాజాగా, మౌని రాయి కొన్ని ఫొటోలను సోషల్ మీడియా అప్ లోడ్ చేసింది. ఈ ఫొటోలను చూసిన అభిమానులు, ఆమె ఫాలోవర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫొటోలను చూసిన పలువురు నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పూర్తిగా బ్లాక్ ప్యాంట్, టాప్ ధరించిన మౌని రాయ్ చాలా గ్లామర్ గా కనిపిస్తున్నారు. అయితే తన ఫొటోలకు క్యాప్షన్స్ తో పాటు కొన్ని లైన్స్ కూడా యాడ్ చేసింది. ‘కొన్ని చలికాలాలు ఎప్పూడు కరగవో.. కొన్ని వేసవికాలాలూ ఎప్పూడు గడ్డ కట్టనట్టే.. కొన్ని కథలలో మాత్రమే జీవిస్తుంటాయి’ అంటూ రాసుకొచ్చింది. మరో ఫొటోకు ‘ ప్రతిది ఒక డ్యాన్స్ లాంటిదే.. ముద్దు లాంటిదే.. వర్షం లాంటిదేనని’ తెలిపింది. ఇంకో ఫొటోను పోస్ట్ చేస్తూ ‘నేనెప్పుడూ నా సహజీవనాన్ని ప్రేమిస్తాను’ అంటోంది మౌనీ రాయ్.
అయితే, బాయ్‌కి చెందిన తన ప్రియుడు సూరజ్ నంబియార్‌తో జనవరి 27న మౌనిరాయి పెళ్లి చేసుకోబోతోంది. అయితే వీరి పెళ్లిపై కొత్త వార్తలు వస్తున్నాయి. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పెళ్లి ఇప్పుడు సింపుల్‌గా జరగనుంది. మీడియా నివేదికల ప్రకారం, పెరుగుతున్న కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా, ఇప్పుడు మౌని రాయ్ కుటుంబం మరియు కొంతమంది ప్రత్యేక స్నేహితుల మధ్య మాత్రమే వివాహం చేసుకోబోతున్నారు. దీంతో పాటు పెళ్లి తర్వాత రిసెప్షన్ కూడా క్యాన్సిల్ అయింది.
కాగా, తాజాగా పోస్ట్ చేసిన ఫొటోలకు పెట్టిన క్యాప్షన్ ఈ వార్తలకు కొంత బలమిస్తున్నాయంటూ పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా బ్లాక్ అండ్ బ్లాక్ లో చౌలా ప్రశాంతంగా కనిపిస్తున్న మౌనీరాయి తన క్యూట్ నెస్ తో ఆకట్టుకుంటోంది. సింపుల్ స్టైల్ తో కిల్లింగ్ లుక్స్ తో అదరగొట్టింది.