ఎంగేజ్మెంట్ రింగ్ చూపించి ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన హీరోయిన్...!
బాలీవుడ్ హీరోయిన్ మౌని రాయ్ ఎంగేజ్మెంట్ రింగ్ చూపిస్తూ ఫోటోకి పోజిచ్చారు. సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన ఆ ఫోటో ఫ్యాన్స్ ని షాక్ గురిచేయడంతో పాటు అనేక అనుమానాలకు కారణం అయ్యింది. అసలు విషయం తెలుసుకున్న తరువాత అవునా అని అందరూ నిట్టూర్చారు.
ఢిల్లీలో మాస్ కమ్యూనికేషన్ కోర్స్ మధ్యలో వదిలేసి బాలీవుడ్ హీరోయిన్ గా ఎదగాలని ముంబై వచ్చిన మౌని రాయ్...2004లో వచ్చిన రన్ మూవీలో ఓ సాంగ్ లో డాన్సర్ గా వెండితెర ఎంట్రీ ఇవ్వడం జరిగింది.
బాలీవుడ్ లో హీరోయిన్ గా అవకాశాలు రాకపోవడంతో ఆమె బుల్లితెర బాట పట్టారు. 2006 నుండి 2018 వరకు అనేక బుల్లితెర సీరియల్స్ లో మౌని రాయ్ కీలక పాత్రలు చేయడం జరిగింది.
ఐతే నాగిని సిరీస్ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సిరీస్ లో వచ్చిన మూడు భాగాలలో మౌని రాయ్ నాగిని గా నటించి బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సీరియల్స్ ద్వారా వచ్చిన ఫేమ్ మౌని రాయ్ కి బాలీవుడ్ లో అవకాశాలు తెచ్చిపెట్టింది.
కెజిఎఫ్ హిందీ వర్షన్ లో మౌని రాయ్ స్పెషల్ సాంగ్ చేశారు. అక్షయ్ నటించి గోల్డ్ మూవీతో పాటు రాజ్ కుమార్ రావ్ హీరోగా వచ్చిన మేడ్ ఇన్ చైనా మూవీలో మౌని రాయ్ నటించారు.
ప్రస్తుతం బాలీవుడ్ లో హీరోయిన్ గా సెటిల్ అయిన మౌని రాయ్ కరణ్ జోహార్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం బ్రహ్మాస్త్ర మూవీలో కీలక రోల్ చేస్తున్నారు. అమితాబ్, రన్బీర్ కపూర్, నాగార్జున, అలియా భట్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు చేస్తున్నారు.
ఇక మౌని రాయ్ తన వేలికి ధరించిన డైమండ్ రింగ్ ఓ జ్యూవెలరీ కంపెనీ ప్రొమోషన్స్ కోసం దిగిన ఫోటో అట. ఓర్నాజ్ అనే ఓ సంస్థ ప్రత్యేకంగా ఎంగేజ్మెంట్ రింగ్స్ అందుబాటులోకి తెచ్చారట. ఇదే విషయాన్ని మౌని రాయ్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.