మన తెలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడంతో పాటు ఎన్నో కాంట్రవర్సీలు కూడా క్రియేట్ చేశాయి.
మన తెలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడంతో పాటు ఎన్నో కాంట్రవర్సీలు కూడా క్రియేట్ చేశాయి. సాధారణంగా సినిమాల ఈవెంట్ లో మన తారలు మాట్లాడే మాటలు వివాదాలు సృష్టిస్తుంటాయి. కానీ కొన్ని సినిమాలు వాటంతటవే వివాదాలను సృష్టిస్తుంటాయి. ఆ సినిమాలేవో ఇప్పుడు ఓ లుక్కేద్దాం!
దువ్వాడ జగన్నాథం - ఈ సినిమాలో 'ఒడిలో బడిలో' సాంగ్ చాలా వివాదాలను క్రియేట్ చేసింది. చివరకు దర్శకుడు స్వయంగా లిరిక్స్ లో మార్పులు చేశాడు. కొన్ని బ్రాహ్మణ సంఘాలు తమ కమ్యునిటీని తక్కువ చేసే విధంగా పాట ఉందని గొడవ చేశాయి.
కెమెరామెన్ గంగతో రాంబాబు - టీడీపీ, వైఎస్ఆర్ సీపీ వాళ్లు ఈ సినిమాలోని డైలాగ్స్ వాళ్లని ఉద్దేశించే విధంగా ఉన్నాయని వివాదానికి తెరలేపారు. అలానే తెలంగాణా మూవ్మెంట్ ని కూడా నెగెటివ్ గా చూపించారంటూ పెద్ద కాంట్రవర్సీ సృష్టించాయి.
దేనికైనా రెడీ - విష్ణు నటించిన ఈ సినిమా కొన్ని బ్రాహ్మణ సంఘాలను ఆగ్రహానికి గురి చేసింది. తమ జాతిని సినిమాలో తప్పుగా చూపించారంటూ గొడవ చేశారు.
కృష్ణంవందే జగద్గురుం - బీజేపీ లీడర్ గాలి జనార్ధన్ రెడ్డిని ఈ సినిమాలోని మాఫియా లీడర్ రెడ్డెప్ప మాదిరి చూపించారంటూ పొలిటికల్ పార్టీల్లో చాలా గొడవలు జరిగాయి.
బస్ స్టాప్ - మారుతి తెరకెక్కించిన చాలా సినిమాలు వల్గర్ గా ఉన్నాయనే కామెంట్స్ వినిపించేవి. వాటిలో 'బస్ స్టాప్' సినిమా మరిన్ని వివాదాలను సృష్టించింది. కొన్ని స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఈ సినిమాకి వ్యతిరేకంగా నిరసన చేపట్టాయి. సంధ్య థియేటర్ వద్ద సినిమాను బ్యాన్ కూడా చేశారు.
దరువు - ఈ సినిమా టైటిల్ వివాదాన్ని సృష్టించింది. 'దరువు' అనేది తెలంగాణాలో కల్చరల్ అసోసియేషన్ పేరు. దీంతో ఆ సమయంలో కాస్త గొడవలు జరిగాయి.
రచ్చ - ఈ సినిమాలో 'వాన వాన వెల్లువాయే' పాటను గౌతం బుద్ధ విగ్రహం ముందు చిత్రీకరించారు. ఇది సంస్కృతిని అవమానించడమేనని మహిళా సంఘాలు నిరసన చేపట్టాయి.
డమరుకం - నవీన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ సినిమా టైటిల్ రిజిస్టర్ చేయించుకున్నానని.. షూటింగ్ కూడా సగం పూర్తయిందని గొడవ చేశారు.
అర్జున్ రెడ్డి - సినిమాలో లిప్ లాక్స్ ఎక్కువ ఉన్నాయని రాజకీయనాయకులు చాలా మంది మండిపడ్డారు. ఇలాంటి సినిమాల కారణంగా యువత చెడిపోయే అవకాశం ఉందంటూ గొడవ చేశాయి.
లక్ష్మీస్ ఎన్టీఆర్ - వర్మ తెరకెక్కించిన చాలా సినిమాలు వివాదాలను సృష్టించాయి. వాటిలో ఎక్కువగా చెప్పుకోవాల్సిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా గురించే. ఎన్టీఆర్ గురించి ఎవరికీ తెలియని కోణాన్ని వెండితెరపై ప్రదర్శించారు. ఇందులో చంద్రబాబుని తప్పుగా చూపించారని టీడీపీ పార్టీ కార్యకర్తలు కేసులు, గొడవలు చాలానే చేశాయి.
చీకటి గదిలో చితక్కొట్టుడు - ఈ సినిమా టైటిల్ ఎన్నో వివాదాలను సృష్టించింది. ఈ సినిమా విడుదల కాకూడదంటూ మహిళా సంఘాలు ధర్నా చేశాయి.
డిగ్రీ కాలేజ్ - ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేసిన జీవిత రాజశేఖర్ స్వయంగా స్టేజ్ మీద చిత్రయూనిట్ ని తిట్టిపారేసింది. సినిమా ట్రైలర్ లో సన్నివేశాలు అసభ్యంగా ఉండడంతో సినిమాను అడ్డుకోవాలనే ప్రయత్నాలు జరిగాయి.
ఏడు చేపల కథ - పోస్టర్లతో వివాదాన్ని సృష్టించిన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ తరువాత మరిన్ని గొడవలకు కారణమైంది.
గన్స్ అండ్ థైస్ - వర్మ రూపొందించిన ఈ వెబ్ సిరీస్ కథ తనదంటూ ఓ కుర్ర రైటర్ నిరసన చేపట్టాడు. వర్మ తనను మోసం చేశాడని మీడియా ముందుకొచ్చి హాట్ టాపిక్ అయ్యాడు.
బందోబస్త్- సూర్య నటిస్తోన్న ఈ సినిమా కథ తనదేనని జాన్ అనే రైటర్ కోర్టుకెక్కాడు. ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది.
కమ్మ రాజ్యంలో కడప రెడ్లు - వర్మ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా పూర్తిగా కాస్ట్ సిస్టం మీద నడవబోతుంది. ఇప్పటికే విడుదలైన సినిమాలో పాటలు వివాదాన్ని సృష్టిస్తున్నాయి.
Today's Poll
Please select an option to vote
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?