బిగ్ బాస్ చెప్పగానే లిప్ స్టిక్, కొత్త డ్రెస్ వేసుకొని డేట్ కి రెడీ అయిన మోనాల్...అఖిల్ తో స్మశానానికి వెళ్ళి
First Published Nov 26, 2020, 12:06 AM IST
బిగ్ బాస్ సీజన్ 4 మొదలై 12వరాలు దాటిపోతుంది. మరో నాలుగు వారాల్లో సీజన్ ముగియనుంది. ప్రస్తుతం హౌస్ లో ఏడుగురు సభ్యులు మాత్రమే ఉన్నారు. గత వారం లాస్య ఎలిమినేటై వెళ్లిపోగా, ఈ వారానికి గాను అఖిల్, మోనాల్, అరియనా మరియు అవినాష్ ఎలిమినేషన్ లో ఉన్నారు. బిగ్ బాస్ టాస్క్ లో గెలిచిన అవినాష్ ఎలిమినేషన్ ఇమ్యూనిటీ కార్డు పొందడం వలన, వచ్చే వారం అవినాష్ ఎలిమినేటయ్యే అవకాశం లేదు.

అఖిల్, మోనాల్ లేదా అరియనా హౌస్ నుండి వచ్చే వారం ఎలిమినేట్ కానున్నారు. కాగా నిన్న ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ ని దెయ్యాల కొంపగా మార్చేశాడు. హౌస్ లో విచిత్రమైన శబ్దాలు మొదలవగా, అరియనాకు దెయ్యాలు కూడా కనిపించాయి. ఒక లేడీ దెయ్యం వాయిస్ ఇంటి సభ్యులను భయపెట్టే ప్రయత్నం చేసింది.

బిగ్ బాస్ హౌస్ గార్డెన్ ఏరియాను స్మశానంలా మార్చేశారు. కాగా ఇంటి సభ్యులలో అఖిల్, అభిజిత్ లకు బిగ్ బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. మొదటి నుండి అఖిల్, అభిజిత్ వలన మోనాల్ అనేక సమస్యలు ఎదుర్కొన్నారు అన్నాడు. మోనాల్ ని ఇబ్బంది పెట్టిన అఖిల్, అభిజిత్ గార్డెన్ ఏరియాలో ఉన్న స్మశానానికిఆమెను డేట్ కి తీసుకెళ్లాలని బిగ్ బాస్ కోరాడు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?