Mithra Mandali Review: మిత్ర మండలి ఫస్ట్ రివ్యూ, బొమ్మ బ్లాక్ బస్టర్ రిపోర్ట్
Mithra Mandali Review: ఈ వారం విడుదలవుతున్న సినిమాల్లో కామెడీని ప్రధానంగా చేసుకుని రూపొందిన చిత్రం `మిత్ర మండలి`. ఈ మూవీ ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చింది. హిట్ బొమ్మా అనే టాక్ వినిపిస్తోంది.

మిత్ర మండలి ఫస్ట్ రిపోర్ట్
ఈ దీపావళి పండుగని పురస్కరించుకుని ఈ వారం నాలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. అందులో కామెడీని ప్రధానంగా చేసుకుని రూపొందిన చిత్రం `మిత్ర మండలి`. ప్రియదర్శి, రాగ్ మయూర్, నిహారికా ఎన్‌ఎమ్, విష్ణు, సత్య, వెన్నెల కిశోర్, వీటీవీ గణేష్ వంటి వారు ప్రధాన పాత్రలు పోషించారు. కామెడీ ఆర్టిస్టులు పుష్కలంగా ఉన్నారు. విజయేందర్ దర్శకత్వం వహించిన ఈ మూవీని బీవీ వర్క్స్ బ్యానర్ మీద బన్నీ వాస్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్ పతాకంపై కళ్యాణ్ మంతెన, భాను ప్రతాప, డా. విజేందర్ రెడ్డి తీగల నిర్మించారు. ఈ నెల 16న సినిమా విడుదలవుతుంది. ఈ క్రమంలో దీన్ని ఇండస్ట్రీలో కొందరు తిలకించారు. దీంతో ఫస్ట్ రిపోర్ట్ బయటకు వచ్చింది. మరి సినిమాకి ఎలా ఉండబోతుందో టాక్ బయటకు వచ్చింది.
నిర్మాత బన్నీ వాస్ ఆవేదన, వారికి వార్నింగ్
`మిత్ర మండలి` టీజర్, ట్రైలర్ ఇప్పటికే విడుదలై ఆద్యంతం నవ్వులు పూయించాయి. డైలాగ్ కామెడీ బాగా వర్కౌట్ అయ్యింది. సినిమాపై అంచనాలు పెంచింది. ప్రియదర్శి, విష్ణు, ప్రసాద్ బెహరా, రాగ్ మయూర్ మధ్య కామెడీ నవ్వులు పూయించింది. వీరితోపాటు సత్య, వెన్నెల కిశోర్ మధ్య ఫన్ కూడా వర్కౌట్ అయ్యింది. అంతేకాదు ఇందులో బ్రహ్మానందం కూడా మెరిశారు. ఆయన సాంగ్‌లో రచ్చ చేయబోతున్నట్టు ట్రైలర్‌ని చూస్తే అర్థమయ్యింది. అటు నిర్మాత బన్నీవాసు, టీమ్ అంతా సినిమాపై కాన్ఫిడెన్స్ ని వ్యక్తం చేశారు. అయితే సోమవారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాత్రం తన సినిమాపై నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారని వాపోయారు. డిజిటల్ మీడియాలో నెగటివ్ ప్రచారంపై ఆయన మండిపడ్డారు. ఎవరూ ఏం చేయలేరని వెల్లడించారు. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఇప్పుడు ఈ మూవీ హాట్ టాపిక్‌గా మారింది.
మిత్ర మండలి ఎలా ఉండబోతుందంటే?
ఈ నేపథ్యంలో తాజాగా సినిమాని చూసిన వాళ్లు తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. చాలా వరకు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఫన్ బాగా వర్కౌట్ అయ్యిందంటున్నారు. కామెడీ టైమింగ్ బాగా సెట్ అయ్యిందని, రైటింగ్, డైలాగ్స్, కెమిస్ట్రీ పర్‌ఫెక్ట్ గా కుదిరాయని అంటున్నారు. పైసా వసూల్ మూవీ అని, పోరగాళ్లు సినిమా చూస్తే బాగా ఎంజాయ్ చేస్తారని, డైలాగ్స్ కి బాగా కనెక్ట్ అవుతారని అంటున్నారు. ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఎలాంటి డిస్కషన్ ఉంటుందో, ఇది అలానే ఉందని చాలా వరకు అభిప్రాయపడుతున్నారు. సింపుల్ స్టోరీ, సింపుల్ స్క్రీన్ ప్లే అని, ఇందులో ఎమోషన్స్ కూడా ఉంటాయని చెబుతున్నారు. ఫుల్ ఫన్ అని, ఒత్తిడి నుంచి రిలీఫ్‌నిచ్చే చిత్రమవుతుందని అంటున్నారు.
మిత్ర మండలి హిట్ బొమ్మ టాక్
మొత్తంగా హిట్టు బొమ్మా అంటున్నారు. అయితే చూసేవాళ్లంతా సినిమాకి దగ్గరివాళ్లే అయి ఉంటారు. కామన్ ఆడియెన్స్ తక్కువగానే ఉంటారు. మరి సినిమా నిజంగానే నవ్వులు పూయించిందా అనేది తెలియాలంటే మరో ఒక్క రోజులో ఒరిజినల్ రివ్యూ వస్తుంది. అప్పుడుగానీ ఈ మూవీ ఫలితాన్ని జడ్జ్ చేయలేం. కాకపోతే ఉన్నవాటిలో కామెడీ పరంగా ఈ మూవీకే మంచి బజ్ ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కామెడీ వర్కౌట్ అయితే సినిమా పెద్ద రేంజ్ హిట్ అవుతుందని చెప్పొచ్చు. ఈ మూవీ ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ పొందింది. సెన్సార్ సభ్యుల నుంచి పాజిటివ్ టాక్ వినిపించింది. బుధవారం(అక్టోబర్ 15న) ప్రీమియర్స్ ప్రదర్శిస్తున్నారు. మరి ఏ మేరకు ఆడియెన్స్ ని ఆకట్టుకుంటుందో చూడాలి.