MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ట్రెడిషనల్‌ లుక్‌లో పాల నురగలా పొంగుతున్న మెహరీన్‌.. తేనెలాంటి అందాలతో పిచ్చెక్కిస్తున్న పంజాబీ పిల్ల..

ట్రెడిషనల్‌ లుక్‌లో పాల నురగలా పొంగుతున్న మెహరీన్‌.. తేనెలాంటి అందాలతో పిచ్చెక్కిస్తున్న పంజాబీ పిల్ల..

పంజాబీ పోరి మెహరీన్‌.. తెలుగులో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత సస్టెయిన్‌ కాలేకపోతుంది. తాను తీసుకున్న నిర్ణయాలు, లైఫ్‌లో చోటు చేసుకున్న పరిణామాలు కొంత ఆమె కెరీర్‌ ట్రాక్‌ తప్పేలా చేసింది.

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 20 2023, 08:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

మెహరీన్‌ ఫిర్జాదా.. రెండేళ్ల క్రితం వరకు తెలుగులో హీరోయిన్‌గా ఫుల్‌ బిజీగా ఉంది. ఆమె సెకండ్‌ రేంజ్‌ హీరోలతో సినిమాలు చేస్తూ సండది చేసింది. ప్రారంభంలో మంచి విజయాలు అందుకుంది. కానీ వరుస ఫెయిల్యూర్స్ ఆమెని ఇబ్బంది పెట్టాయి. కెరీర్‌పై ప్రభావం చూపాయి. అదే సమయంలో మెహరీన్‌ పెళ్లికి సిద్ధమైంది. ఎంగేజ్‌మెంట్ వరకు వెళ్లి క్యాన్సిల్‌ అయ్యింది.

29

దీంతో మళ్లీ సినిమాలపై ఫోకస్‌ పెట్టింది. ఏం జరిగినా మన మంచికే అని భావించి ముందుకు సాగుతుంది. మళ్లీ నటిగా బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో గ్లామర్‌ షోతో ఆకట్టుకుంటుంది. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ మేకర్స్ ని తన బుట్టలో వేసుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తుంది. 
 

39

ఈ క్రమంలో తాజాగా ట్రెడిషనల్‌ లుక్‌లో మెరిసింది మెహరీన్‌. వినాయక చవితి పండుగ సందర్భంగా ఆమె వినాయక పూజలో పాల్గొంది. ఈ సందర్భంగా ట్రెడిషనల్‌గా ముస్తాబైంది. నిండుగా దుస్తులు ధరించి హోమ్లీ బ్యూటీగా మారిపోయింది. హాట్‌ షో చేయకపోయినా ఈ పంజాబీ బ్యూటీ టూ సెక్సీగానే ఉండటం విశేషం. 

49

`ఎఫ్‌2`లో హనీ ఈజ్‌ ద బెస్ట్ అంటూ రచ్చ చేసింది. ఇప్పుడు నయా లుక్‌లోనూ తేనెలాంటి అందాలతో పిచ్చెక్కిస్తుంది. కుర్రాళ్లని మంత్రముగ్దుల్ని చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే మెహరీన్‌ తన ఫ్యామిలీతో కలిసి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. 

59

మెహరీన్‌.. ప్రస్తుతం `స్పార్క్` అనే చిత్రంలో నటిస్తుంది. తెలుగు, తమిళంలో తెరకెక్కుతుంది. ఈ చిన్న సినిమాగా వస్తుంది. ఈ సినిమాతో తాను కమ్‌ బ్యాక్‌ కావాలనుకుంటుంది. మరి ఈ చిత్రం సక్సెస్‌ అవుతుందా? ఆమెకి పేరు తీసుకొస్తుందా? అనేది చూడాలి. 

69

మెహరీన్‌.. నాని సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. `కృష్ణగాడి వీర ప్రేమ గాథ`లో క్యూట్‌ లవర్‌గా మెప్పించింది. నయా అందాలతో టాలీవుడ్‌ ఆడియెన్స్ ని అలరించింది. ఇండస్ట్రీలోకి కొత్త అందాలు తీసుకొచ్చి అందరిని ఆకర్షించింది. ప్రారంభంలో మంచి విజయాలు అందుకుందీ ఆపిల్‌ బ్యూటీ. 
 

79

శర్వానంద్‌తో కలిసి నటించిన `మహానుభావుడు`, రవితేజతో నటించిన `రాజా దీ గ్రేట్‌` చిత్రాలు విజయాలు సాధించాయి. వరుసగా మూడు విజయాలతో హ్యాట్రిక్‌ హిట్‌ అందుకుంది. అంతే ఆ తర్వాత వరుస పరాజయాలు ఆమెని వెంటాడాయి. `కేరాఫ్‌ సూర్య`, `జవాన్‌`, `పంతం`, `నోటా`, `కవచం`.. బ్యాక్‌ టూ బ్యాక్‌ ఐదు ఫ్లాప్‌లు పడ్డాయి. 
 

89

కెరీర్‌ డౌన్‌ అవుతున్న సమయంలో దర్శకుడు అనిల్‌ రావిపూడి ఆమెని ఊపిరి పీల్చుకునేలా చేశాడు. `ఎఫ్‌2`తో అదిరిపోయే హిట్‌ అందించాడు. ఇందులో హనీ ఈజ్‌ ద బెస్ట్ అంటూ హనీ పాత్రలో రచ్చ చేసింది. ఇందులో ఆమె పాత్ర బాగా హైలైట్‌ అయ్యంది. బబ్లీగా నవ్వంచింది, అందంతో మంత్రముగ్దుల్ని చేసింది. 
 

99

మళ్లీ వరుస పరాజయాలు చవిచూసింది. `చాణక్య`, `ఎంత మంచివాడవురా`, `అశ్వత్థామ`, `మంచి రోజులొచ్చాయి`, `ఎఫ్‌3` చిత్రాలతో బ్యాక్‌ టూ బ్యాక్‌ ఫ్లాప్‌లు పడ్డాయి. దీంతో ఒక్కసారిగా డౌన్‌ అయిపోయింది. మళ్లీ ఫేడౌట్‌ సిచ్యూవేషన్స్ ఫేస్‌చేస్తుంది. మరి `స్పార్క్` చిత్రంతోనైనా పుంజుకుంటుందేమో చూడాలి. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
The Kerala Story 2 మూవీ రిలీజ్‌కు బ్రేక్.. 'ది కేరళ స్టోరీ 2'పై హైకోర్టు స్టే.. ఏం జరిగిందంటే?
Recommended image2
Rajasekhar Mistake: రాజశేఖర్‌ తన కెరీర్‌లో చేసిన బిగ్ మిస్టేక్.. ఈ మూడు సూపర్‌ హిట్స్ ని వదులుకోవడం
Recommended image3
ప్రమాదంలో పడ్డ డూప్, స్టార్ హీరో ప్రాణాలకు తెగించి ఏం చేశారో తెలుసా.. మూవీ సంచలన విజయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved