- Home
- Entertainment
- మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య ట్విట్టర్ రివ్యూ, మెగా మాస్ మంత్రం పనిచేసిందా..?
మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య ట్విట్టర్ రివ్యూ, మెగా మాస్ మంత్రం పనిచేసిందా..?
మెగా ఫ్యాన్స్ కు పండగే.. వరుస సినిమాలతో దడదడలాడిస్తున్న మెగాస్టార్ చిరంజీవి, మారోసారి ఊరమాస్ సినిమాతో ఫ్యాన్స్ కు భారీ ట్రీట్ ఇస్తున్నారు. వాల్తేరు వీరయ్య సినిమాతో చాలా కాలం తరువాత పక్కా మాస్ ఎంటర్టైనర్ తో ఆయన ఆడియన్స్ ముందుకు వచ్చారు. మరి ఈరోజు రిలీజ్ అవుతున్న వాల్తేరు వీరయ్య సినిమా ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ ఏమంటున్నారు. ట్విట్టర్ లో వారి రియాక్షన్ ఏంటీ చూద్దాం.

మెగాస్టార్ చిరంజీవి.. శ్రుతీహాసన్ జంటగా.. బాబీ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా వాల్తేరు వీరయ్య. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈసినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిచారు. ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేస్తూ వస్తోన్న ఈసినిమా ఈరోజు ( 13జనవరి ) సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతుంది. ఇప్పటికే యూఎస్ లో ప్రీమియర్స్ చూసిన జనాలు సినిమాపై తమ అభిప్రాయాలు ట్విట్టర్ లో వెల్లడిస్తున్నారు.
ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో మెగా ఫ్యాన్స్ సందడిమామూలుగా లేదు. థియేటర్ లో మెగా ఫ్యాన్స్ నినాదాలతో దద్దరిల్లిపోయింది. అక్కడి ఐమాక్స్ లో స్టార్ స్టార్ మెగాస్టార్ అంటూ ఫ్యాన్స్ స్లోగన్స్ తో సినిమా స్టార్ట్ అయ్యింది. సీన్ సీన్ కు రెచ్చిపోయి రచ్చ రచ్చ చేశారు మెగా ఫ్యాన్స్. సినిమా రిలీజ్ అయిన అన్ని దేశాల్లో దాదాపు థియేటర్లలో పరిస్థితి ఇలానే ఉంది.
ఇక ఈసినిమా ఫస్ట్ 30 నిమిషాలు హైలెట్ అంటూ.. ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. అంతే కాదు ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది అన్నారు. మెగాస్టార్ .. మాస్ మహారాజ్ ఇద్దరు పోటీ పడి నటించడంతో పాటు ఫ్యాన్స్ కు భారీ ట్రీట్ ఇచ్చారంటున్నారు ట్విట్టర్ జనాలు.
Waltair Veerayya
యూఎస్ లో ఎక్కడ చూసినా మెగా అభిమానులు సందడే కనిపిస్తుంది. ఏదైనా బాస్ దిగనతం వరకే.. దిగితే మరో లెవల్లో ఉంటుంది. దానికి ఈ సినిమా ఎక్జాంపుల్ అంటూ... ట్విట్టర్ లో కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక పూనకాలే అంటూ పోస్ట్ లు పెడుతున్నారు.
వాల్తేరు వీరయ్య ఫస్ట్ హాఫ్ అదరిపోయింది.. సెకండ్ హాఫ్ ఊచకోత మొదలయ్యింది.. సంక్రాంతి విన్నర్ మీరే.. నిజంగా సూపర్ బాస్ అంటూ.. మెగాస్టార్ అభిమాని ఒకరు ట్వీట్ చేశారు. వాల్తేరు వీరయ్య బొమ్మ మొదలైంది. చిరంజీవి ఇంట్రో సీన్ అదరిపోయింది. బీజీఎం అయితే ఇంకా అదిరింది... చిరంజీవి మాస్ లుక్స్ సూపర్ అంటూ మరో నెటిజన్ పోస్ట్ పెట్టాడు.
ఫస్ట్ హాఫ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్.. పూనకాలు లోడింగ్.. బాస్ ఎంట్రీ.. ఎనర్జీ.. యాక్షన్ సీన్స్.. బీజియం అదుర్స్.. డివోపీ సూపర్.. డైరెక్టర్ బాబీ అన్నా థ్యాంక్స్ అంటూ మెగా అభిమాను ఒకరు ట్వీట్ చేశారు.
ఇలా మెగా అభిమాను.. కామన్ ఆడియన్స్ సినిమా గురించి ట్విట్టర్ లో కామెంట్లు పెడుతున్నారు. అటు కొన్ని నెగెటీవ్ కామెంట్స్ కూడా ఈసినిమాకు తప్పలేదు. యాంటీ ఫ్యాన్స్ అవ్వచ్చు.. సినిమాపై తమ అభిప్రాయం అవ్వచ్చు కాని కొంత మంది సినిమా యావరేజ్ అంటుంటే.. మరికోంత మంది మాత్రం రొటీన్ మెగా మూవీ అంటూ కొట్టిపారేస్తున్నారు.
ఏది ఏమైనా.. మెగా పూనకాలు లోడింగ్ లో ఉన్నాయి. ఈరోజు రిలీజ్ అయిన సినిమా.. బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్ సాధిస్తుందో చూడాలి. మెగాస్టార్ కు సాలిడ్ హిట్ ఇస్తుందా.. ? లేక సాధారణ విజయంతో సరిపెడుతుందా అనేది ఆసక్తికరమైన విషయం