MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బీజేపీలోకి చిరంజీవి, రాజ్యసభ ఎంపీ పదవి.. అందుకే సైలెంట్ గా తప్పుకున్నారా ?

బీజేపీలోకి చిరంజీవి, రాజ్యసభ ఎంపీ పదవి.. అందుకే సైలెంట్ గా తప్పుకున్నారా ?

టాలీవుడ్ సినీ ప్రముఖులతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. అల్లు అర్జున్ అరెస్ట్, సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ భేటీకి మెగాస్టార్ చిరంజీవి హాజరు కాకపోవడంతో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Dec 26 2024, 01:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
CM Revanth Reddy

CM Revanth Reddy

టాలీవుడ్ సినీ ప్రముఖులతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. అల్లు అర్జున్ అరెస్ట్, సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ భేటీకి మెగాస్టార్ చిరంజీవి హాజరు కాకపోవడంతో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టాలీవుడ్ ని దృష్టిలో పెట్టుకుంటే ఇది అత్యంత కీలకమైన భేటీ. చిరంజీవి హాజరు కాకపోవడానికి వినిపిస్తున్న కారణం ఆయన హైదరాబాద్ లో అందుబాటులో లేరు. చెన్నైలో షూటింగ్ లో ఉండడం వల్ల రాలేకపోయారని అంటున్నారు. 

25

కానీ చిరంజీవి.. రేవంత్ రెడ్డితో మీటింగ్ కి హాజరు కాకపోవడానికి పొలిటికల్ రీజన్స్ ఉన్నాయనేది ప్రధానంగా వినిపిస్తున్న రూమర్స్. చిరంజీవి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. రాజ్యసభ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా సేవలందించారు. కానీ చివరికి చిరంజీవి తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుని ఖైదీ నెంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి చిరు రాజకీయాలకు దూరం అయ్యారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. 

35

ఇటీవల కొంతకాలంగా చిరు బీజేపీ పెద్దలతో టచ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సందర్భం వచ్చిన ప్రతిసారీ మోడీ.. చిరంజీవికి మంచి ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. ఈ క్రమంలో చిరంజీవికి బీజేపీ నాయకత్వం రాజ్యసభ ఎంపీ పదవి ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో పవన్ కళ్యాణ్ ప్రమేయం లేకపోలేదు అనే వార్తలు కూడా వస్తున్నాయి. వాస్తవానికి నాగబాబు రాజ్యసభ ఎంపీ పదవి, తద్వారా కేంద్ర మంత్రి పదవి దక్కాల్సింది. 

Also Read : దమ్ముంటే పట్టుకోరా షెకావత్, బన్నీకి తెలియకుండానే పుండుమీద కారం చల్లారా.. దేవిశ్రీ రియాక్షన్ ఇదే

45
Chiranjeevi

Chiranjeevi

కానీ పవన్ నిర్ణయం మార్చుకుని నాగబాబుకి రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి పదవి వచ్చేలా చేశారు. దీనితో చిరంజీవికి రాజ్యసభ ఎంపీ పదవి ఇచ్చి, ఆ తర్వాత మంత్రి పదవిని కూడా కట్టబెట్టే ఆలోచన ఉందట. అందువల్లే చిరంజీవి కూడా సైలెంట్ గా రేవంత్ రెడ్డితో మీటింగ్ కి దూరం అయ్యారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి హాజరైన ప్రధాని మోడీ.. వేదికపై చిరంజీవికి ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చారో చూశాం. చిరు, పవన్ అన్నదమ్ముల చేయి పట్టుకుని మోడీ అభివాదం చేసిన దృశ్యాలు ఇప్పటికీ వైరల్ అవుతున్నాయి. 

55

చిరంజీవి ప్రతి అంశానికి ముఖ్యమంత్రుల వద్దకు వెళ్లడం పవన్ కి నచ్చడం లేదని టాక్. తన సోదరుడి స్థాయికి, హుందాతనానికి అది దెబ్బ అని పవన్ భావిస్తున్నారు. గతంలో చిత్ర పరిశ్రమ తరుపున చిరంజీవి జగన్ తో భేటీ అయ్యారు. ఆ సంఘటనతో చిరంజీవి అభిమానులు బాధపడ్డారు. పవన్ సైతం పలు సందర్భాల్లో ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ అప్పటి ప్రభుత్వంపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఏది ఏమైనా చిరంజీవి నిజంగానే రాజ్యసభ్య ఎంపీ కాబోతున్నారా ? ఆయన బీజేపీతో టచ్ లో ఉన్నారా అనే అంశాలు చర్చనీయాంశంగా మారాయి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
దిల్ రాజు

Latest Videos
Recommended Stories
Recommended image1
నిర్మాతలది మామూలు ధైర్యం కాదు, మెగా హీరో మూవీ క్లైమాక్స్ కోసం 20 కోట్ల బడ్జెట్.. మహాభారతాన్ని తలపించేలా
Recommended image2
Toxic Movie: యశ్‌తో కియారా రొమాంటిక్ ఫోజు.. ఫన్నీ కామెంట్లతో ఆడుకుంటున్న నెటిజన్లు
Recommended image3
Shreya Ghoshal: ఆ పాట నాకు సెట్ అవ్వదనుకున్నా.. కానీ నా వాయిసే కరెక్ట్ అయింది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved