MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • నా బట్టలు కొట్టేసింది, పబ్లిక్ లో యాంకర్ సుమ పరువు తీసిన చిరంజీవి... తెల్లముఖం వేసిన స్టార్ యాంకర్ 

నా బట్టలు కొట్టేసింది, పబ్లిక్ లో యాంకర్ సుమ పరువు తీసిన చిరంజీవి... తెల్లముఖం వేసిన స్టార్ యాంకర్ 

యాంకర్ సుమ కనకాల తన కాస్ట్లీ బట్టలు కొట్టేసిందని పబ్లిక్ లో చెప్పి ఆమె పరువు తీశాడు చిరంజీవి. ఓ ప్రైవేట్ ఈవెంట్లో జరిగిన ఈ ఘటనకు సుమ తెల్లముఖం వేసింది.   

2 Min read
Author : Sambi Reddy
Published : Apr 01 2024, 01:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Anchor Suma

Anchor Suma

స్టార్ యాంకర్ గా సుమ కనకాలది దశాబ్దాల ప్రస్థానం. ఏళ్లుగా ఆమె బుల్లితెరను ఏలుతున్నారు. సుమ మలయాళీ అమ్మాయి. తండ్రి  ఉద్యోగరీత్యా హైదరాబాద్ లో స్థిరపడ్డారు. నటి కావాలని ప్రయత్నాలు చేసి సక్సెస్ కాకపోవడంతో యాంకర్ గా మారి సక్సెస్ అయ్యింది. 


 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
anchor Suma

anchor Suma

సుమ యాంకరింగ్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. నాలుగైదు భాషలు అనర్గళంగా మాట్లాడుతుంది. అలాగే సమయస్ఫూర్తి, సెన్సాఫ్ హ్యూమర్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. సుమతో మాట్లాడాలంటే ఎదుటివారు భయపడతారు. ఎటు నుంచి పంచ్ వేస్తుందో అని కంగారు పడతారు. సుమ యాంకర్ గా ఉంటే స్టార్స్ సైతం కంగారు పడతారు. 

36
Chiranjeevi

Chiranjeevi


అలాంటి సుమకు చుక్కలు చూపించాడు చిరంజీవి. సోషల్ మీడియా స్టార్స్ ని అభినందిస్తూ హైదరాబాద్ లో ఒక కార్యక్రమం నిర్వహించారు. చిరంజీవి, విజయ్ దేవరకొండ వంటి స్టార్స్ ఈ ఈవెంట్ కి హాజరయ్యారు. విజయ్ దేవరకొండ ఆయన్ని ఇంటర్వ్యూ చేశాడు. చిరంజీవి తన నట ప్రస్థానం గురించి అనేక విషయాలు పంచుకున్నారు.. 


 

46
Chiranjeevi

Chiranjeevi

కాగా ఈ కార్యక్రమానికి సుమ యాంకర్ గా వ్యవహరించింది. ఈ క్రమంలో చిరంజీవి-సుమ మధ్య ఓ సరదా సంభాషణ చోటు చేసుకుంది. సుమను దగ్గరకు పిలిచిన చిరంజీవి... భార్య సురేఖకు కాల్ చేశాడు. నన్ను లంచ్ కి ఇంటికి పిలవడానికి కాబోలు అని సుమ అన్నారు. 

56
Chiranjeevi

Chiranjeevi

అయితే సుమకు ఝలక్ ఇస్తూ చిరంజీవి భార్య సురేఖతో... నా గ్రే కలర్ కోట్, బ్లాక్ ప్యాంటు పోయిందని బాధపడ్డావు కదా. అది దొరికింది. సుమ మన ఇంటికి ఎప్పుడు వచ్చిందో కానీ, చేతి వాటం చూపించింది. ఆ డ్రెస్ సుమ వద్దే ఉంది. తీసుకొచ్చేస్తా... కంగారు పడకు, అన్నాడు. దానికి సుమ మీరు ఇవ్వాలి, నేను వేసుకోవాలి అని అన్నారు. 
 

66
Chiranjeevi

Chiranjeevi


లేదు కాస్ట్లీ డ్రెస్ నా కష్టార్జితం అని చిరంజీవి అన్నారు. సుమ తన డ్రెస్ దొంగతనం చేసిందని చిరంజీవి వేదిక మీద చెప్పడంతో సుమ ముఖంలో రంగులు మారాయి. ఏం మాట్లాడాలో తెలియక సరే సార్ అంటూ పక్కకు వెళ్ళిపోయింది. సుమపై చిరంజీవి సరదాగా వేసిన పంచులు ఆడియన్స్ లో నవ్వులు పూయించాయి. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: ఎంగిలి గ్లాసులు కడిగిన నాగార్జున.. రోహిత్ కి చుక్కలు, పెద్ది సాంగ్ పంచాయతీలో అతడికి శిక్ష
Recommended image2
R Madhavan: 'నువ్వు అహంకారిగా ఉండాలి'.. కొడుక్కి మాధవన్ ఎందుకలా సలహా ఇచ్చాడు?
Recommended image3
Namitha: తాళి, బొట్టు ఆడవాళ్లకేనా? మగవాళ్లకు ఎందుకు లేవు?.. దుమారం రేపుతున్న నమిత కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved