ప్లాన్ చేంజ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి, రంగంలోకి దిగబోతున్న వి.వి వినాయక్, ముచ్చటగా మూడోసారి ...?
మెగాస్టార్ చిరంజీవి ప్లాన్ మార్చేశారు. ఆచార్య ఫలితంతో ఆలోచనలో పడ్డ చిరు.. నెక్ట్స్ సినిమాలపై జాగ్రత్తపడుతున్నాడు. అందుకే రంగంలోకి కొంత మంది సీనియర్లను దింపుతున్నాడు. ఇందులో భాగంగా.. మెగాస్టార్ వి.వి.వినాయక్ ను తెరపైకి తీసుకువస్తున్నట్టు తెలుస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి వినాయక్ ను రంగంలోకి దింపుతున్నారట. ఇప్పటికే నాలుగు సినిమాలతో బిజీగా ఉన్న మెగాస్టార్.. ఇప్పుడు వినాయక్ ను ఎందుకు దింపుతున్నారు...? దానికి అసలు కారణం ఏంటీ..? ఆచార్య దెబ్బతో మెగాస్టార్ ప్లాన్ చేంజ్ చేశారా..? ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాటలు ఇవే.
ఆచార్య సినిమాపై చిరంజీవి ఎంతో నమ్మకం పెట్టుకుంటే దాని ఫలితం నిరాశ పరిచింది. దాంతో ఆయన ఆ తరువాత చేయనున్న సినిమాల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఒకసారి అన్ని స్క్రిప్టులను అన్ని వైపులా నుంచి చెక్ చేసుకోవాలని కూడా డైరెక్టర్స్ అందరికీ మరీ మరీ చెప్పారట.
ఆచార్య ఫెయిల్యూర్ తో బాగా డిస్సపాయింట్ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి ప్రెజర్ తో బాగా ఇబ్బంది పడ్డారట. దాంతో భర్య సురేఖ తో కలిసి విదేశాలకు వెకేషన్ కు వెళ్ళారు మెగాస్టార్. గత నెల 3న తన సతీమణి సురేఖతో కలిసి చిరంజీవి విదేశాలకు విహార యాత్రకు వెళ్లారు. నెల రోజుల హాలిడే తర్వాత రీసెంట్ గా హైదరాబాద్ చేరారు.
రీ ఫ్రెష్ అయిన చిరు.. వరుస ప్రాజెక్టుపై వాళ్లు ప్రత్యేకమైన దృష్టిని పెట్టినట్టుగా తెలుస్తోంది. . ఈ వరుసలో ముందుగా మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ తో పాటు మిగతా మూడు సినిమాల విషయంలో కూడా మరోసారి మార్పులు చేర్పులు చెప్పినట్టు తెలస్తోంది. ఆచార్య రిజల్ట్ రిపిట్ కాకుండా చూసుకుంటున్నాడట చిరు.
గాడ్ ఫాదర్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత ప్రాజెక్టులుగా బాబీ దర్శకత్వంలో వాల్తేర్ వీరయ్య'.. మెహర్ రమేశ్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా లైన్లోనే ఉన్నాయి. ఈ రెండు సినిమాలు షూటింగు దశలోనే ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల తరువాత వెంకీ కుడుములతో చిరంజీవి ఒక సినిమా చేయనున్నారు. ఆల్రెడీ అందుకు సంబంధించిన సన్నాహాలు మొదలైపోయాయి.
ఇక ఈ మధ్యలోనే మెగాస్టార్ వి.వి వినాయక్ తో కూడా సినిమా చేస్తారు అన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. వినాయక్ దర్శకత్వంలో చిరంజీవి మూవీ చేయనున్నట్టు ఒక వార్త బలంగానే వినిపిస్తోంది. అందుకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ అయ్యిందని సమాచారం.
చిరంజీవికి వినాయక్ ఠాగూర్ లాంటి బ్లాక్ బస్టర్ తో పాటు... రీ ఎంట్రీ కి ఖైదీ నెంబర్ 150 వంటి హిట్స్ ను ఇచ్చాడు. ఇక ఇప్పుడు కూడా వినాయక్ సినిమాతో మరోసారి హిట్ కొట్టాలనేది మెగాస్టార్ ఆలోచనగా తెలుస్తోంది. వినాయక్ పై చిరంజీవికి విపరీతమైన నమ్మకం ఉంది. తన స్టైల్ .. తన నుంచి అభిమానులు కోరుకునే అంశాలు వినాయక్ కి బాగా తెలుసును గనుక, ఆయనకి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు.
అయితే ఈ సినిమా ఇప్పుడు స్టార్ట్ చేయాలా.. లేకు వచ్చే ఏడాదిలో ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాలా అనేదాని గురించి చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. మెగాస్టార్ తో హ్యాట్రిక్ మూవీని బ్లాక్ బస్టర్ గా..మెమరబుల్ గా ఉండేలా... పక్కా ప్లాన్ తో రెడీ చేస్తున్నాట వినాయక్.