MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Chiranjeevi:మెగా లీక్..'విశ్వంభర'లో చిరు పాత్ర ఇదే.. ముల్లోకాల వీరుడైనా అతడి అడ్డా మాత్రం అక్కడే ?

Chiranjeevi:మెగా లీక్..'విశ్వంభర'లో చిరు పాత్ర ఇదే.. ముల్లోకాల వీరుడైనా అతడి అడ్డా మాత్రం అక్కడే ?

చిరంజీవి ఆ ప్రయత్నాల్లో భాగంగానే తనకు అచ్చొచ్చిన ఫాంటసీ థ్రిల్లర్ కథని ఎంచుకున్నారు. బింబిసార చిత్రంతో క్రేజీ డైరెక్టర్ గా మారిపోయిన వశిష్ట మల్లిడి దర్శకత్వంలో చిరు నటిస్తున్న సంగతి తెలిసిందే. 

Sreeharsha Gopagani | Published : Nov 26 2023, 09:47 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవికి భోళా శంకర్ రూపంలో ఫ్లాప్ ఎదురైంది. దీనితో చిరంజీవి నుంచి అదిరిపోయే చిత్రం కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. చిరంజీవి ఆ ప్రయత్నాల్లో భాగంగానే తనకు అచ్చొచ్చిన ఫాంటసీ థ్రిల్లర్ కథని ఎంచుకున్నారు. బింబిసార చిత్రంతో క్రేజీ డైరెక్టర్ గా మారిపోయిన వశిష్ట మల్లిడి దర్శకత్వంలో చిరు నటిస్తున్న సంగతి తెలిసిందే. 

26
Asianet Image

పంచభూతాలని కలుపుతూ అనౌన్సమెంట్ పోస్టర్ ని ఆ మధ్యన రిలీజ్ చేశారు. రీసెంట్ గా షూటింగ్ ప్రారంభం అయింది. ఈ చిత్రానికి విశ్వంభర అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికి ఇదే వర్కింగ్ టైటిల్. దీనినే ఫైనల్ టైటిల్ గా కూడా ఫిక్స్ చేసే అవకాశం ఉంది. గతంలో చిరంజీవి జగదేక వీరుడు అతిలోక సుందరి, యముడికి మొగుడు లాంటి ఫాంటసీ చిత్రాలతో సూపర్ హిట్స్ కొట్టారు. అది కొన్ని దశాబ్దాల క్రితం. 

36
Asianet Image

ఇప్పుడు టెక్నాలజీ మారిన తరుణంలో చిరంజీవి ఈ కథని ఎంచుకోవడంతో అంచనాలు పెరిగిపోయాయి. పైగా దర్శకుడు వశిష్ట లిమిటెడ్ బడ్జెట్ తో బింబిసార చిత్రంతో అద్భుతం చేసి చూపించారు. ఇక చిరంజీవి సినిమా అంటే బడ్జెట్ పరిమితులు ఉండవు. దీనితో గ్రాఫిక్స్, విజువల్స్ పై భారీ అంచనాలు ఉన్నాయి. 

46
Asianet Image

ఈ తరుణంలో  విశ్వంభర చిత్రం నుంచి ఆసక్తికర లీక్ వచ్చింది. ఇది చిరంజీవి పాత్రకి సంబంధించినది. ఈ చిత్రంలో చిరు దొరబాబు అనే సామాన్య వ్యక్తిగా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముల్లోకాలను వీరుడైనప్పటికీ అతడి అడ్డా మాత్రం గోదావరి తీరం అని అంటున్నారు. గోదావరి జిల్లాలకు చెందిన వ్యక్తిగా చిరు కనిపిస్తాడట. చిరంజీవి డైలాగులు మొత్తం గోదావరి యాసలో ఉండబోతున్నాయి. 

56
Asianet Image

అయితే సామాన్య వ్యక్తి దొరబాబు ముల్లోకాలని రక్షించే వీరుడిగా ఎలా మారాడు.. దొరబాబు దేనిపై విజయం సాధించాడు అనే సన్నివేశాలు ఈ చిత్రంలో అత్యంత ఉత్కంఠ భరితంగా గ్రాండ్ విజువల్స్ తో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

66
Asianet Image

కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో 5గురు హీరోయిన్లు ఉంటారని కూడా వార్తలు వస్తున్నాయి. అనుష్క శెట్టి, ఐశ్వర్య రాయ్ లాంటి హీరోయిన్ల పేర్లు పరిశీలిస్తున్నట్లు టాక్. 

Sreeharsha Gopagani
About the Author
Sreeharsha Gopagani
 
Recommended Stories
Top Stories