- Home
- Entertainment
- 30 ఏళ్లుగా చిరంజీవికి డూప్ గా చేస్తున్నాడు..చిన్న చూపు చూస్తూ అవమానాలు, అతడు ఎవరంటే..
30 ఏళ్లుగా చిరంజీవికి డూప్ గా చేస్తున్నాడు..చిన్న చూపు చూస్తూ అవమానాలు, అతడు ఎవరంటే..
భోళా శంకర్ చేదు జ్ఞాపకాలని పక్కన పెట్టేసి మెగా ఫ్యాన్స్ అంతా మెగా స్టార్ చిరంజీవి బర్త్ డే సెలెబ్రేషన్స్ కి రెడీ అవుతున్నారు. ఆగష్టు 22న చిరు తన 68వ జన్మదిన వేడుకలకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం భోళా శంకర్ డిజాస్టర్ గా ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేసింది. ఈ చిత్రం పై అంతగా అంచనాలు లేవు. దానికి కారణం ఈ మూవీ తమిళ హిట్ చిత్రం వేదాళంకి రీమేక్ గా తెరకెక్కడమే. దీనికి తోడు ఫ్లాపుల్లో ఉన్న మెహర్ రమేష్ డైరక్టర్ కావడంతో సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ మొదటి నుంచి అనుమానంగానే ఉన్నారు. వారి అనుమానమే నిజమవుతూ భోళా శంకర్ మూవీ తీవ్రంగా నిరాశపరిచింది.
Chiranjeevi
భోళా శంకర్ చేదు జ్ఞాపకాలని పక్కన పెట్టేసి మెగా ఫ్యాన్స్ అంతా మెగా స్టార్ చిరంజీవి బర్త్ డే సెలెబ్రేషన్స్ కి రెడీ అవుతున్నారు. ఆగష్టు 22న చిరు తన 68వ జన్మదిన వేడుకలకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. దీనితో చిరంజీవి కెరీర్ లోని అనేక ఆసక్తికర అంశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిరంజీవికి డూప్ గా చేస్తున్న ఓ వ్యక్తి గురించి అనేక ఆసక్తిర అంశాలు వైరల్ గా మారాయి.
స్టార్ హీరోలందరికీ బాడీ డబుల్స్ ఉంటారు. ఎక్కువ రిస్క్ తో కూడిన సన్నివేశాలని దర్శకులు డూప్ లతో చేయిస్తుంటారు. ఆ విధంగా చిరంజీవికి దాదాపు మూడు దశాబ్దాల నుంచి ఓ వ్యక్తి డూప్ గా చేస్తున్నారు. అతడిపేరు ప్రేమ్ కుమార్. తాజాగా ఓ కార్యక్రమంలో ప్రేమ్ కుమార్ తన ఎమోషనల్ జర్నీని వివరించారు. మా నాన్న స్టేజి ఆర్టిస్టు కావడంతో నాకు కూడా నాటకాలపై ఆసక్తి పెరిగింది. మొదట నేను ఏఎన్నార్ అభిమానిని. ఆయన సన్నివేశాలపై ప్రోగ్రామ్స్ చేసేవాడిని.
కానీ నా స్నేహితులు ఏఎన్నార్ ట్రెండ్ ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు అంతా చిరంజీవే. కాబట్టి చిరంజీవి లాగా ట్రై చెయ్ అని చెప్పారు. నేను చిరంజీవి లాగా చేయగలనా అని అనుకున్నాను. నెమ్మదిగా చిరంజీవిని ఇమిటేట్ చేయడం ప్రారంభించాను. ఎక్కడకి వెళ్లినా చిరంజీవి అని నన్ను పిలిచేవారు. ఒకసారి ఓ దర్శకుడు చిరంజీవి లాగా చేయమంటే ఎలా చేయగలవు అని అడిగారు. చేసి చూపించాను. ఆ విధంగా చిరు చిత్రాల్లో డూప్ గా అవకాశం వచ్చింది.
అదే విధంగా చిరంజీవి పాటలకు రికార్డింగ్ డ్యాన్సులు చేస్తూ డబ్బు సంపాదించాను. హిట్లర్ చిత్రంలో హాబీబి అనే సాంగ్ కి రికార్డింగ్ డ్యాన్స్ చేస్తే అక్కడికి వెళ్లినా జనాలు నీరాజనాలు పట్టారు. నేను నా కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్నాను అంటే అది చిరంజీవి అనే పేరువల్లే సాధ్యం అయింది. చివరగా చిరంజీవి డూప్ గా సైరా చిత్రంలో నటించా అని ప్రేమ్ కుమార్ తెలిపారు.
ఎంత గుర్తింపు వచ్చినా జీవితంలో ఎదురుదెబ్బలు కూడా తిన్నాను. అవమానాలు ఎదుర్కొన్నాను. కెరీర్ బిగినింగ్ లో ఒక డ్యాన్సర్ తో పరిచయం ఏర్పడింది.ఆ ఆమెని బాగా నమ్మేశా. ప్రాణం అనుకున్నా. కానీ చివరకి నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది. ఏంటి ఎలా చేశావ్ అని అడిగితే నువ్వు రికార్డింగ్ డ్యాన్సులు చేసుకునేవాడివి.. నీకు నాకు సెట్ కాదు అంటూ అవహేళనగా మాట్లాడినట్లు ప్రేమ్ కుమార్ తెలిపారు. సూసైడ్ కోసం ప్రయత్నించిన సందర్భాలు కూడా ఉన్నాయి.
కానీ ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు పెళ్లీడుకి వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు. కానీ సమాజంలో రికార్డింగ్ డ్యాన్స్ అంటే చిన్నచూపు ఉంది. మమల్ని ఎందుకనో అవహేళన చేస్తారు.. కళాకారులుగా గుర్తించరు అని ప్రేమ్ కుమార్ బాధపడ్డారు.