MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • దటీజ్ మెగాస్టార్.. డ్యాన్స్ మాస్టర్ లేరు, చైల్డ్ ఆర్టిస్ట్ తో కలసి కొరియోగ్రఫీ చేసిన చిరంజీవి

దటీజ్ మెగాస్టార్.. డ్యాన్స్ మాస్టర్ లేరు, చైల్డ్ ఆర్టిస్ట్ తో కలసి కొరియోగ్రఫీ చేసిన చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల సినిమాల్లో తన డ్యాన్సులకి గాను గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అందుకున్నారు. 156 చిత్రాల్లో చిరంజీవి 537 పాటలకు 24 వేలకి పైగా స్టెప్పులు వేశారు. ఈ ఘనత సాధించిన ఏకైక హీరోగా గిన్నిస్ బుక్ రికార్డ్స్ సంస్థ చిరంజీవిని గుర్తించింది. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Sep 26 2024, 10:47 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల సినిమాల్లో తన డ్యాన్సులకి గాను గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అందుకున్నారు. 156 చిత్రాల్లో చిరంజీవి 537 పాటలకు 24 వేలకి పైగా స్టెప్పులు వేశారు. ఈ ఘనత సాధించిన ఏకైక హీరోగా గిన్నిస్ బుక్ రికార్డ్స్ సంస్థ చిరంజీవిని గుర్తించింది. దీనితో చిరంజీవి డ్యాన్సులు మరోసారి చర్చనీయాశం అయ్యాయి. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

కెరీర్ బిగినింగ్ లో ఒక వైపు అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే చిరంజీవి డ్యాన్సులు చేసేవారట. చిరంజీవి 1978లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 1979 నుంచి చిరంజీవికి హీరోగా అవకాశాలు పెరుగుతూ వచ్చాయి. ఆ ఏడాది తమ్మారెడ్డి భరద్వాజ నిర్మించిన కోతల రాయుడు అనే చిత్రంలో చిరంజీవి హీరోగా నటించారు. 

 

35

ఈ చిత్రంలో ఒక నెలవంక చిరుగోరింక అనే సాంగ్ ఉంది. ఈ సాంగ్ షూటింగ్ సమయంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుందని తమ్మారెడ్డి గుర్తు చేసుకున్నారు. చిరంజీవి గిన్నిస్ రికార్డ్ అందుకునే సమయంలో ఈ పాటని కూడా ప్రదర్శించారట. అందుకే అప్పటి సంఘటన గుర్తుకు వచ్చినట్లు తమ్మారెడ్డి తెలిపారు. 

 

45

ఒక నెలవంక సాంగ్ కి తారా మాస్టర్ కొరియోగ్రఫీ చేయాలి. కానీ ఆమెకి మరో షూటింగ్ ఉండడంతో వెళ్లిపోయారు. ఆ సాంగ్ చిరంజీవి, నటి తులసి పై ఉంటుంది. ఈ చిత్రంలో నటి తులసి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. ఆ తులసినే తర్వాత కాలంలో ప్రముఖ నటిగా మారింది. కార్తికేయ, కార్తికేయ 2 చిత్రాల్లో నిఖిల్ తల్లిగా నటించింది ఆమెనే. కోతల రాయుడు చిత్రంలో ఆమెకి చిరంజీవి బాబాయ్ గా నటించారు. 

 

55

కొరియోగ్రాఫర్ లేకపోవడంతో చింరజీవి అప్పటికప్పుడు తులసితో కలసి కొరియోగ్రఫీ చేశారట. ఆ సాంగ్ చాలా అందంగా వచ్చింది. చిరంజీవికి డ్యాన్స్ పై ఉన్న మక్కువ అది. సింపుల్ స్టెప్పులతో చిరంజీవి ఆ పాటకి కొరియోగ్రఫీ చేశారు. అప్పటికి చిరంజీవికి ఇండస్ట్రీలో ఇంకా సరైన గుర్తింపు రాలేదు. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss: 50, 100 కోట్లు కాదు.. సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే, సినిమాల కంటే ఇదే బావుందే
Recommended image2
Maa Ramudu Andarivadu: సీఎం పాత్రలో హీరో సుమన్.. ట్విస్టులు అదిరిపోతాయి, హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్
Recommended image3
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved