- Home
- Entertainment
- Acharya Review: ఆచార్య ట్విట్టర్ రివ్యూ.. చిరు, చరణ్ రాక్ సాలిడ్, కానీ కొరటాల నుంచి ఇది ఊహించలేదు
Acharya Review: ఆచార్య ట్విట్టర్ రివ్యూ.. చిరు, చరణ్ రాక్ సాలిడ్, కానీ కొరటాల నుంచి ఇది ఊహించలేదు
కొరటాల శివ తెరకెక్కించిన తాజా చిత్రం ఆచార్య. మెగా స్టార్ చిరంజీవి నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. నేడు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది.
- FB
- TW
- Linkdin
Follow Us

కొరటాల శివ తెరకెక్కించిన తాజా చిత్రం ఆచార్య. మెగా స్టార్ చిరంజీవి నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. నేడు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. పరాజయం ఎరుగని కొరటాల శివ దర్శకత్వంలో తొలిసారి చిరంజీవి నటిస్తుండడంతో అంచనాలు తారా స్థాయికి చేరాయి. ఆ అంచనాలు మరింత పెంచేలా తన తండ్రితో కలసి రాంచరణ్ పూర్తి స్థాయి పాత్రలో నటిస్తున్న చిత్రం ఇది.
తండ్రీకొడుకుల చిరుత పులుల లాంటి వేట చూసేందుకు ఫ్యాన్స్ సిద్ధం అయ్యారు. ఆల్రెడీ యూఎస్, తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు షురూ అయ్యాయి. దీనితో ట్విట్టర్ లో ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందొ చూద్దాం.
ట్విట్టర్ లో వస్తున్న టాక్ ప్రకారం.. ఆచార్య ఫస్ట్ హాఫ్ ఓకె అనిపించే విధంగా ఉంది. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ ని మించేలా ఉంది. చిరంజీవి బాగా చేసినప్పటికీ రాంచరణ్ పాత్ర ఆచార్య చిత్రానికి సోల్ అని అంటున్నారు. ఓవరాల్ గా సినిమా ఎవబ్ యావరేజ్ గా ఉందని అంటున్నారు.
మరికొందరు ట్విట్టర్ లో ఆచార్య సినిమా పట్ల బాగా డిసప్పాయింట్ అవుతూ పోస్ట్ లు పెడుతున్నారు. రాంచరణ్, చిరంజీవి ఇద్దరూ రాక్ సాలిడ్ పెర్ఫామెన్స్ ఇచ్చారని.. కానీ కొరటాల శివ నుంచి ఈ తరహా స్క్రిప్ట్ ఊహించలేదని అంటున్నారు. ఆచార్య స్క్రిప్ట్ వీక్ గా ఉన్నట్లు ట్విట్టర్ లో ప్రేక్షకులు అంటున్నారు.
Acharya
ఆచార్య చిత్రంలో పాజిటివ్ గా చెప్పుకోవాల్సింది చరణ్, చిరంజీవి పాత్రల గురించే. మిగిలినవన్నీ చాలా వీక్ గా ఉన్నాయి. విఎఫెక్స్ చాలా పూర్ గా ఉన్నాయి. నేరేషన్ సరిగ్గా లేదు. తొలిసారి కొరటాల శివ తీవ్రంగా నిరాశపరిచారు. మెగా అభిమానులు కూడా ట్విట్టర్ లో ఆచార్య సినిమాపై పూర్తి స్థాయి సంతృప్తి వ్యక్తం చేయడం లేదు.
రెండు సాంగ్స్, చిరంజీవి డాన్సులు ఆకట్టుకునే విధంగా ఉంటాయి. సినిమాలో అనవసరంగా ఫైట్స్ ఎక్కువగా కనిపిస్తాయి. కేవలం రాంచరణ్ పాత్ర మాత్రమే ఈ చిత్రాన్ని కాపాడాలి. మిగిలినదంతా పట్టించుకోలేం అంటూ ప్రేక్షకులు కామెంట్స్ పెడుతున్నారు.
Acharya Trailer
రాంచరణ్, చిరంజీవి కలిసి నటించిన చిత్రం ఇలా అవుతుందని ఊహించలేం. ఇది కొరటాల శివ చిత్రమేనా అని నమ్మలేని విధంగా ఆచార్య ఉంది. పరిస్థితులు అనుకూలిస్తే తప్ప ఆచార్య.. బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకోవడం కష్టం. ఓవరాల్ గా రాంచరణ్ ఈ చిత్రంలో స్పెషల్ రోల్ చేయాల్సినంత స్టఫ్ సిద్ద పాత్రలో లేదు అని ప్రేక్షకులు అంటున్నారు.
క్లయిమాక్స్ ఏమాత్రం ఆకట్టుకునే విధంగా లేదని అంటున్నారు. క్లయిమాక్స్ లో ఫైట్స్ ఉండాలి కాబట్టి పెట్టినట్లు ఉందని అంటున్నారు. ట్విట్టర్ లో మరికొందరు ప్రేక్షకులు.. ఇది బాస్ చేయాల్సిన చిత్రం కాదు. వెంటనే ఓ మంచి మాస్ డైరెక్టర్ తో సినిమా సెట్ చేసుకోండి అని సూచిస్తున్నారు.
Acharya
ఓవరాల్ గా ఆచార్య చిత్రం కొరటాల శివ గత చిత్రాలతో ఏమాత్రం పోల్చే విధంగా లేదు. విఎఫ్ఎక్స్ మరీ దారుణంగా ఉన్నాయని అంటున్నారు. చిరంజీవి, మణిశర్మ కాంబినేషన్ కు తగ్గట్లుగా సంగీతం కూడా లేదు. మరి బాక్సాఫీస్ వద్ద ఆచార్య ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి.