Acharya Review:‘ఆచార్య’ మూవీ రివ్యూ
ఈ సినిమాకు అనుకున్న స్దాయిలో బజ్ క్రియేట్ కాలేదు. కావాలనే సినిమాపై ఎక్సపెక్టేషన్స్ పెరగకుండా అలా ప్లాన్ చేసారని సరిపెట్టుకున్నారు. సినిమా రిలీజ్ అయ్యాక మామూలుగా ఉండదు అని లెక్కలేసుకున్నారు.

చిరంజీవి సినిమా అంటే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్స్ . అలాగే కొరటాల శివ కూడా కమర్షియల్ కథలు చెప్పటంలో పండిపోయినవాడు. దానికి తోడు రామ్ చరణ్ కూడా తోడు కలిసాడు. అంటే సినిమా ఎలా ఉంటుంది. కమర్షియాల్టికు అమ్మా,బాబులా ఉంటుందని లెక్కవేస్తాం. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను…లాగ బొమ్మ బ్లాక్ బస్టర్ అని అంచనాకు వచ్చేస్తాం. అయితే అదేంటో కానీ ఈ సినిమాకు అనుకున్న స్దాయిలో బజ్ క్రియేట్ కాలేదు. కావాలనే సినిమాపై ఎక్సపెక్టేషన్స్ పెరగకుండా అలా ప్లాన్ చేసారని సరిపెట్టుకున్నారు. సినిమా రిలీజ్ అయ్యాక మామూలుగా ఉండదు అని లెక్కలేసుకున్నారు. ఆ లెక్కలు నిజం అయ్యాయా...సినిమా కథేంటి..వర్కవుట్ అవుతుందా...వంటి విషయాలు రివ్యూలో చూద్దాం. Acharya Review.
కథ
టెంపుల్ టౌన్ ధర్మస్దలికి దాదాపు ఎనిమిది వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఓ ప్రక్క నది..మరో ప్రక్క పాధ ఘట్టం అనే తండా.ఆయుర్వేదానికి ,భక్తికి వాళ్లు ఫేమస్. అయితే ధర్మ స్దలిలో పేరు ఉన్న ధర్మ అక్కడ లేదు. దుర్మార్గుడైన మున్సిపల్ చైర్మన్ బసవన్న(సోనూసూద్) అక్కడ రాజ్యం ఏలుతున్నాడు. అతను చేసే వన్నా వెధవ పనులే. ఆ దేవాదాయ భూముల సొమ్ము అంతా నొక్కేస్తూంటాడు. రీసెంట్ గా మైనింగ్ మాఫియా లీడర్ రాథోడ్ (జిషు సేన్ గుప్తా) తో చేతులు కలిపుతాడు. అమ్మవారి టెంపుల్ తోపాటు పాద ఘట్టాన్ని కూడా అతనికి అప్పగించబోతాడు. ఆ పరిస్దితుల్లో అక్కడికి ఆచార్య (చిరంజీవి) అడుగుపెట్టాడు. ఆచార్య ఓ నక్సలైట్. అక్కడ రాజ్యం ఏలుతున్న అధర్మం, హింసకు అడ్డుగట్ట వేయటం మొదలెతాడు. అసలు ఆచార్యకు అక్కడకి రావాల్సిన అవసరం ఏమిటి...సిద్ధ (రామ్ చరణ్) కు ధర్మస్థలి సంభందం ఏమిటి...సిద్ద..కు ఆచార్య ఏమౌతాడు, చివరకు బసవ అరాచకాలు ఎలా ఆచార్య ఆపాడు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
ఏ సినిమా కథ అయినా సాధారణంగా అంటే హీరో...ఓ సమస్య...దాని పరిష్కారం...ఈ దిసగా సాగుతుంది. సీనియర్ రైటర్ కొరటాలకు ఆ విషయం తెలియంది కాదు. అయితే ఈ సినిమాలో హీరో లు ఉంటారు. వాళ్లకు కథలు ఉంటాయి. కానీ వాళ్లిద్దరు ఎదుర్కొనే సమస్య ఉంటుంది. కానీ దాని పరిష్కారం... అందుకోసం హీరోలు చేసే పోరాటం మాత్రం ఉండదు. విలన్స్ ఉంటారు. కానీ ..వాళ్ళకీ, హీరోకు మధ్య ఏదో మ్రొక్కుబడి వ్యవహారమే కానీ అసలైన పోరాటం ఉండదు. విలన్స్ ..హీరోని ముప్పు తిప్పలు పెట్టడానికి ప్రయత్నించారు. హీరో అంతకన్నా సౌమ్యంగా విలన్స్ ఉన్నట్లుంటారు. అప్పుడప్పుడూ వచ్చి ఫైట్ చేసి వెళ్లిపోతూంటారు.
ఓ Conflict, అది పరెగటం ..Rise, resolution కనపడదు. అఖండ గుర్తు వస్తుందనుకున్నారో ఏమో కానీ మైనింగ్ మాఫియా మీద ఎక్కువ వెళ్లలేదు. వాస్తవానికి సెకండాఫ్ లో వచ్చే రామ్ చరణ్ ప్లాష్ బ్యాక్ లేకపోయినా సినిమా కు ఒక్క ఇంచి కూడా నష్టం లేదు. అలాగే కథకు కలిసొచ్చిందేమీ లేదు. ఆచార్య పాత్రను సిద్ద పాత్ర వచ్చి ప్రేరేపించకపోయినా...వెళ్లి ధర్మ స్దలిపై పోరాటం చేయవచ్చు. అతను నక్సలైజ్..సమాజ హితం కోరుకునే వాడు కాబట్టి...అలాంటప్పుడు సిద్ద పాత్రను ఎందుకు అంత పెంచి సెకండాఫ్ మొత్తం ఆ పాత్రతో నింపేసి, మెయిన్ కథకు అన్యాయం చేయటం?
మహేశ్ బాబు వాయిస్ ఓవర్‌తో ప్రారంభం అయ్యే ఈ సినిమా ఫస్టాఫ్ అంతా విలన్స్ ని ఎదుర్కుంటూ ఆచార్య ఫైట్స్ చేయటంతోనే సరిపోయింది. అయితే ఆచార్య ఎందుకు ఆ విలన్స్ తో పనిగట్టుకుని ఫైట్ చేస్తున్నాడు...తన పోరాటానికి ఆ ధర్మస్దలినే ఎందుకు ఎంచుకున్నాడు అంటే సిద్ద (రామ్ చరణ్)కు ఇచ్చిన మాట కోసం. ఇప్పుడు రామ్ చరణ్ ఎవరు....అతని తండ్రి (సత్యదేవ్) కథ, అతన్ని పెంచుకున్న వారి కథ, తను పెరిగిన ఊరు ధర్మపురి కు వచ్చిన కష్టాలు , నక్సలైట్ గా సిద్ద మారిన వైనం, అతనికి ఆచార్య పరిచయం, ఇద్దరి మధ్యా సీన్స్, ఫైనల్ గా తన ఆశయాన్ని ఆచార్యకు ట్రాన్ఫర్ చేయటం ఇలా సెకండాఫ్ మొత్తం గడిచిపోయిన సిద్ద ఫ్లాష్ బ్యాక్ తో నడిచిపోతుంది. ఆ ప్లాష్ బ్యాక్ పూర్తవగానే చిన్న ట్విస్ట్...ఫైనల్ ఫైట్, శుభం కార్డ్. అంటే ఈ కథలో చిరంజీవి చేసిందేమిటి...చేయగలిగింది ఏమిటి అంటే ఏమీ కనపడదు. దాంతో సినిమా అక్కడక్కడా తప్పించి బోర్ కొట్టేసింది. రామ్‌చరణ్ - పూజాహెగ్డేల మధ్య సీన్స్ అయినా గొప్పగా,ఇంట్రస్టింగ్ గా ఉన్నాయేమో అనుకుంటే అవీ అలాగే డల్ గా ఉన్నాయి.
టెక్నికల్ గా ...
చిరులాంటి పెద్ద స్టార్ హీరో సినిమాకు టెక్నికల్ గా మంచి స్టాండర్డ్స్ ఉండటంలో పెద్ద వింతేమీ లేదు.టెక్నిషియన్స్ లో గొప్పగా చెప్పుకోవాల్సింది... టెంపుల్ సిటీని కళ్లముందుకు తీసుకొచ్చిన ఆర్ట్ డైరెక్టర్ పనితనం. ఆ తర్వాత తిరు కెమెరా వర్క్. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. డైరక్టర్ కొరటాల శివ డైరక్టరోయిల్ టచ్ కనపడలేదు ..స్క్రిప్టు లోపాలే సినిమాని ముందుకు వెళ్లనివ్వలేదు. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సారి పెద్ద గా లేదు. పాటల్లో లాహె.. లాహె బాగుంది. ఎడిటింగ్ సోసో గా ఉంది.
చిరంజీవికు సినిమా రిజల్ట్ ముందే ఎక్సపెక్ట్ చేసినట్లుగా అనిపిస్తుంది. ఆయనలో ఆ జోష్ కనపడదు. రామ్ చరణ్, చిరు కలిసిన సీన్స్ మాత్రం బాగున్నాయి. భలే భలే బంజారా పాటలో ఇద్దరి డాన్స్ చాలా బాగుంటుంది. సోనూసూద్, జిషూసేన్ గుప్తా రొటీన్ విలన్స్ పూజాహెగ్డే పాత్ర అయితే దారుణం. నీలాంబరి పాటలో బాగుంది. రెజీనా శానాకష్టం సాంగ్ ఉన్నంతలో బాగుంది.
ఫైనల్ థాట్
కథ ,కథనం సరిగ్గా లేకపోతే ఎంత స్టార్స్ ఉన్నా ఫలితం లేదని ఈ సినిమా పాఠం...గుణ పాఠం రెండూ నేర్పుతుంది.
Rating:2
---సూర్య ప్రకాష్ జోశ్యుల
ఎవరెవరు...
నటీనటులు: చిరంజీవి, రామ్‌చరణ్, తనికెళ్ల భరణి, పూజా హెగ్డే, అజయ్, సోనూసూద్, సంగీత, జిషు సేన్‌గుప్త తదితరులు;
సంగీతం: మణిశర్మ;
సినిమాటోగ్రఫీ: తిరు;
ఎడిటింగ్: నవీన్ నూలి;
నిర్మాత: నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి, రామ్‌చరణ్;
రచన, దర్శకత్వం: కొరటాల శివ;
విడుదల: 29-04-2022