- Home
- Entertainment
- Acharya First Review: తండ్రీకొడుకుల డెడ్లీ కాంబో దద్దరిల్లింది.. పక్కా పైసా వసూల్ బొమ్మ, రేటింగ్ ఎంతంటే..
Acharya First Review: తండ్రీకొడుకుల డెడ్లీ కాంబో దద్దరిల్లింది.. పక్కా పైసా వసూల్ బొమ్మ, రేటింగ్ ఎంతంటే..
కొరటాల శివ తెరకెక్కించిన తాజా చిత్రం ఆచార్య. మెగా స్టార్ చిరంజీవి నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ 29న ఆచార్య గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది.

Acharya
కొరటాల శివ తెరకెక్కించిన తాజా చిత్రం ఆచార్య. మెగా స్టార్ చిరంజీవి నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ 29న ఆచార్య గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టారు. మరో నాలుగు రోజుల్లో సిల్వర్ స్క్రీన్ పై ఆచార్య సందడి చేయనుంది.
Acharya
కొరటాల శివ లాంటి మాస్ డైరెక్టర్ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తుండడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పైగా ఈ చిత్రంలో ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత రాంచరణ్ నటిస్తుండడం ఫ్యాన్స్ లో ఉత్కంఠని పెంచేస్తోంది. గతంలో కూడా రాంచరణ్, చిరంజీవి వెండితెరపై మెరిశారు. కానీ అది కొద్దిసేపు మాత్రమే.
Acharya
కానీ ఆచార్య చిత్రంలో చిరంజీవితో కలిసి రాంచరణ్ పూర్తి స్థాయి పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో రాంచరణ్ రోల్ దాదాపు 40 నిమిషాల పాటు ఉంటుంది. ఇదిలా ఉండగా ఆచార్య రిలీజ్ కు అన్ని కార్యక్రమాలు పూర్తవుతున్నాయి. తాజాగా ఆచార్య చిత్రం సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం 154 నిమిషాల నిడివితో ఉండబోతున్నట్లు టాక్.
Acharya
ప్రముఖ క్రిటిక్, ఫారెన్ సెన్సార్ మెంబర్ ఉమర్ సంధు ఆచార్య చిత్రానికి ఫస్ట్ రివ్యూ ఇచ్చారు. సెన్సార్ కార్యక్రమాల అనంతరం ఆచార్య చిత్రం ఎలా ఉందొ తెలిపారు. మొత్తంగా చిరంజీవి, రాంచరణ్, లార్జ్ డోస్ లో ఉన్న ఎంటర్టైన్మెంట్ కలిస్తే ఆచార్య చిత్రం అవుతుంది అని ఉమర్ సంధు అన్నారు.
Acharya
మాస్ ప్రేక్షకుల్లో అద్భుతంగా వర్క్ అయ్యే మసాలా ఎలిమెంట్స్ ఈ చిత్రంలో పక్కాగా ఉన్నాయి. ఈద్ ఫెస్టివ్ సీజన్ లో విడుదలవుతున్న ఈ చిత్రం గేమ్ చేంజెర్ గా మారే అవకాశం ఉంది. ఈ చిత్రం ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్. రాంచరణ్ అందరి హృదయాలు దోచుకుంటాడు. తండ్రీకొడుకుల డెడ్లీ కాంబినేషన్ అదిరిపోయింది. ఈ పైసా వసూల్ చిత్రంతో ఫ్యాన్స్ పండగ చేసుకోవడం ఖాయం అని ఉమర్ సందు తన రివ్యూలో తెలిపారు.
Acharya
ఈ చిత్రానికి ఉమర్ సంధు 4 స్టార్ రేటింగ్ ఇచ్చారు. ఆచార్యలో రాంచరణ్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది. దేవాలయాల బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రాంచరణ్, చిరంజీవి ఇద్దరూ కామ్రేడ్ సోదరులుగా కనిపిస్తున్నారు.