రాజమౌళితో సినిమానా... అమ్మో నావల్ల కాదు అంటున్న మెగాస్టార్ చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాతో సందడి చేయబోతున్నారు. రేపు ( ఏప్రిల్ 29) ప్రపంచ వ్యాప్తగా ఈమూవీ రిలీజ్ కాబోతోంది. ఈసందర్భంగా ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు మెగాస్టార్.

మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా ఆచార్య. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈమూవీ రిలీజ్ కు రెడీ అయ్యింది. ఇక ఈమూవీ ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంగ్లీష్ పేపర్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు మెగాస్టార్. అందులో రాజమౌళిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
సౌత్ సినిమా బాలీవుడ్ ముందు తల ఎత్తుకుని నిలబడేలా చేసిన దర్శుకుడు రాజమౌళి అంటూ పోగడ్తలతో ముంచెత్తారు మెగాస్టార్. ఆయన వల్లే బాలీవుడ్ లో సౌత్ సినిమా గౌరవం నిలబడింది అన్నారు. అంతే కాదు.. రాజమౌళి ఒప్పుకోబట్టే.. రామ్ చరణ్ ఆచార్య సినిమా చేయగలిగాడు అన్నారు చిరు.
అంతే కాదు రాజమౌళితో మీ సినిమా త్వరలో ఉందట కదా అని ప్రశ్న ఎదురవగా... అదేం లేదు. రాజమౌళితో సినిమా అంటే అది నాకు సాధ్యం కాదు. నావల్ల కాదు కూడా. చరణ్, తారక్ లాంటి యంగ్ స్టార్స్ అయితేనే రాజమౌళి ఎనర్జీని తట్టుకోగలరు. ఆయన తగ్గట్టు ఫ్రేమ్ లో తాను ఇమడలేని అన్నారు చిరు.
జక్కన్నతో సినిమా అంటే తనకు సాధ్యం కాదు అని తేల్చేశారు మెగాస్టార్. సోషల్ మీడియాలో ఈ విషయంలో వస్తున్న వార్తలన్నీ పుకార్లే అనేశాడు. ఇక తను ఊపిరి ఉన్నంత వరకూ నటిస్తూనే ఉంటాన్నారు చిరంజీవి. 90 ఏళ్ళు వచ్చినా.. అప్పటికీ ఓపిక ఉంటే నటిస్తానని చెప్పారు.
అయితే డైరెక్షన్ చేయాలి అనేది తన డ్రీమ్ అన్నారు చిరంజీవి. అది ఎప్పుడు నెరవేరుతుందో తెలియదు. ఇప్పటికైతే నా దృష్టి నటన మీదనే ఉంది. భవిష్యత్తలో మాత్రం ఒక్క సినిమా అయినా డైరెక్ట్ చేస్తాను అంటున్నారు మెగాస్టార్.
వీటితో పాటు ఆచార్య కుసంబంధించిన చాలా విషయాలు పంచుకున్నారు చిరంజీవి. కోరటాల శివ చరణ్ తో సినమా చేయాల్సి ఉంది, కాని అది కుదరక నేను చేస్తున్నానన్నారు. తెలుగు ఇండస్ట్రీలో పుట్టడం తాను చేసుకున్న అదృష్టం అన్నారు.