MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • చిరంజీవికి ఇష్టమైన హీరోయిన్.. సావిత్రి, జయసుధ స్థాయిలో గొప్ప నటి, ఆమె పేరు మరచిపోయాడే

చిరంజీవికి ఇష్టమైన హీరోయిన్.. సావిత్రి, జయసుధ స్థాయిలో గొప్ప నటి, ఆమె పేరు మరచిపోయాడే

చిరంజీవికి బాగా ఇష్టమైన హీరోయిన్ ఎవరనే ప్రశ్న ఎదురైంది. ఇది చిరంజీవిని ఇరకాటంలో పెట్టే ప్రశ్న. కానీ చిరంజీవి తెలివి సమాధానం ఇస్తూ ఒక్కో హీరోయిన్ కి ఒక్కో గొప్ప లక్షణం ఉందని తెలిపారు. అయినప్పటికీ అందరికంటే ఎక్కువ ఇష్టం ఉన్న హీరోయిన్ పేరుని చిరు ఓపెన్ గా చెప్పేశారు.

2 Min read
Author : Tirumala Dornala
| Updated : Jan 12 2025, 09:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మెగాస్టార్ చిరంజీవి చిన్న విలన్ వేషాలు వేస్తూ ఇప్పుడు మెగాస్టార్ స్థాయికి చేరుకున్నారు. 40 ఏళ్ళకి పైగా టాలీవుడ్ ని చిరంజీవి శాసించారు. ఈ క్రమంలో చిరంజీవి ఎందరో హీరోయిన్లతో కలసి నటించారు. చిరంజీవితో ఎక్కువగా సినిమాలు చేసిన హీరోయిన్ల జాబితాలో రాధా, రాధిక, సుమలత, సుహాసిని, విజయశాంతి లాంటి వారు ఉంటారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

వీరిలో చిరంజీవికి బాగా ఇష్టమైన హీరోయిన్ ఎవరనే ప్రశ్న ఎదురైంది. ఇది చిరంజీవిని ఇరకాటంలో పెట్టే ప్రశ్న. కానీ చిరంజీవి తెలివి సమాధానం ఇస్తూ ఒక్కో హీరోయిన్ కి ఒక్కో గొప్ప లక్షణం ఉందని తెలిపారు. అయినప్పటికీ అందరికంటే ఎక్కువ ఇష్టం ఉన్న హీరోయిన్ పేరుని చిరు ఓపెన్ గా చెప్పేశారు. చిరంజీవి ఒక టీవీ షోలో పాల్గొంటుండగా ఈ ప్రశ్న ఎదురైంది. చిరంజీవితో నటించిన రాధిక, సుమలత స్క్రీన్ పైకి వచ్చి చిరంజీవితో మాట్లాడారు. రాధిక అయితే నా ఫేవరెట్ హీరో చిరంజీవి అని తెలిపింది. చిరుని సరదాగా బెదిరిస్తూ.. చిరు నీకు కూడా ఇష్టమైన హీరోయిన్ నేనే.. ఆ విషయం నువ్వు అందరి ముందు చెప్పాలి అని స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. ఆమె మాటలకు చిరంజీవి సరదాగా నవ్వుకున్నారు. 

35
sumalatha

sumalatha

సుమలత కూడా చిరంజీవితో మాట్లాడారు. మీతో కలసి నటించిన క్షణాలు ఎప్పటికీ మరచిపోలేను అని సుమలత తెలిపింది. మీతో స్నేహం కూడా గొప్ప అనుభూతిని ఇచ్చింది అంటూ సుమలత పేర్కొన్నారు. ఆ తర్వాత చిరంజీవి తనకి ఇష్టమైన హీరోయిన్ గురించి చెప్పారు. నాతో నటించిన హీరోయిన్లలో ఒక్కొక్కరిలో ఒక్కో గొప్ప లక్షణం ఉంది. హీరోయిన్ రాధా నీతో కలసి చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది. అందం విషయంలో శ్రీదేవి బెస్ట్. అప్పట్లో హోమ్లీ పాత్రలో చేయాలంటే సుమలత బెస్ట్ ఛాయిస్. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో క్వాలిటీ ఉంటుంది.. ఆ క్వాలిటీస్ కి నేను దాసోహం అని చిరంజీవి అన్నారు. 

45

వీళ్లందరికంటే రాధిక అంటే ఎక్కువ ఇష్టం అని చిరంజీవి తెలిపారు. మహానటి సావిత్రి, వాణిశ్రీ, జయసుధ తర్వాత ఆ స్థాయి ఉన్న నటి రాధిక అని చిరంజీవి తెలిపారు. రాధికకి నటనలో లిమిటేషన్స్ లేవు. ఎమోషనల్ గా నటించగలదు, కామెడీ చేయగలదు, మాస్ గా కనిపిస్తుంది, క్లాస్ గా కూడా కనిపిస్తుంది అంటూ వర్ణించారు. కాబట్టి రాధిక అంటే తనకి ఎక్కువ ఇష్టం అని చిరంజీవి తెలిపారు. 

55

కానీ చిరంజీవి ఒక క్రేజీ హీరోయిన్ పేరు మరచిపోయారు. రాధిక, రాధా తరహాలోనే చిరంజీవితో ఎక్కువ సినిమాల్లో నటించిన హీరోయిన్ విజయశాంతి. విజయశాంతి చిరంజీవికి నటనలో, డ్యాన్స్ లో ఎంతలా పోటీ ఇచ్చిందో చూశాం. కానీ విజయశాంతి పేరు చెప్పలేదు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Aakali Rajyam 2026: 'ఆకలి రాజ్యం 2026' వెబ్ సిరీస్ రివ్యూ.. నిరుద్యోగుల కష్టాలతో అల్లిన కథ, ఎలా ఉందంటే
Recommended image2
బాలకృష్ణ హ్యాండిచ్చినట్లే, రవితేజతో క్రేజీ డైరెక్టర్ మూవీ.. ఇరుముడి జోష్ తో మాస్ మహారాజ వరుస సినిమాలు
Recommended image3
Sunil: హీరోగా కోలుకోలేని దెబ్బ, అందుకే సునీల్ తన బంధువునే పక్కన పెట్టారా..ఇద్దరి మధ్య ఏం జరిగింది ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved