MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • వరుణ్ తేజ్ అసలు పేరేంటి, మెగా ప్రిన్స్ ఆధార్ కార్డ్ లో అలా ఉందా..?

వరుణ్ తేజ్ అసలు పేరేంటి, మెగా ప్రిన్స్ ఆధార్ కార్డ్ లో అలా ఉందా..?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అసలు పేరు ఎంటో మీకుతెలుసా..? ఆయన ఆధార్ తో పాటు.. పాస్ పోర్ట్ లాంటి వాటిలో  మాత్రమే ఆ పేరు ఉంటుందా..? ఇంతకీ స్క్రీన్ మీద పేరు మార్చుకోడానికి గల కారణం ఏంటీ..?  

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Feb 25 2024, 07:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

సాలిడ్ హిట్ కోసం ఎదరు చూస్తున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ప్రస్తుతం  ‘ఆపరేషన్ వాలంటైన్’ సినిమా తో ఫ్యాన్స్ ను అలరించడానికి రెడీ అవుతున్నాడు.రిలీజ్ కు రెడీగా ఉన్న ఈసినిమా ప్రమోషన్స్‌ ను సూపర్ ఫాస్ట్ గా నిర్వహిస్తున్నారు. ఈప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. వరుణ్ తేజ్ టీమ్. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

ఇక ఆపరేషన్ వాలంటైన్ మూవీ మార్చి 1న  ప్రపంచ వ్యాప్తంగా  రిలీజ్ కాబోతోంది. 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో భారత జవాన్లపై జరిగిన దాడి, తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్థాన్, అక్కడి ఉగ్రవాదులపై తీర్చుకున్న ప్రతీకారం నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోంది. 

37

ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ జంటగా నటించగా.. దేశ వ్యాప్తంగా ఈ సినిమాపై  అంచనాలుపెరిగేలా ప్రమోషలన్ ఈవెంట్స్ ను నిర్వహిస్తన్నారు టీమ్.ఇక ఈ మూవీ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా వరుస పర్యటనలు చేస్తున్న వరుణ్ తేజ్.. కొన్ని మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు కూడా ఇస్తూ వెళ్తున్నారు. ఈక్రమంలో ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన  ఆసక్తికరమైన విషయాలు షేర్ చేసుకున్నారు.
 

47

ఈ సందర్భంగా వరుణ్ తేజ్ తన అసలు పేరు ఇది మాత్రమే కాదు అని సీక్రేట్ ను వెల్లడించారు. తన పేరకు ముందు మరో పేరు ఉందని ఆయన అన్నారు. తన అసలు పేరు ‘సాయి వరుణ్ తేజ్’ అని చెప్పారు వరుణ్.  అయితే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే ముందు  స్క్రీన్ మీద ఈ పేరు  పెద్దదిగా ఉంటుందని సాయిని తీసేసారట. అంతే కాదు స్క్రీన్ నేమ్ ఏది అయినా.. ఆధార్ , పాస్‌పోర్టు లాంటి  అన్ని సర్టిఫికేట్స్‌లో ‘సాయి వరుణ్ తేజ్’ అనే  ఉంటుందట. 
 

57

ఇక షూటింగ్స్ లో హీరోయిన్ల తో ఇబ్బందుల గురించి కూడా వరుణ్ తేజ్ కామెంట్స్ చేశారు.  తన  హైట్ 6 అడుగుల 4 అంగుళాలు. షూటింగ్స్ టైమ్‌లో ఈ హైట్ వల్ల  హీరోయిన్స్ తో ఇబ్బంది తప్పడంలేదు అన్నారు వరుణ్. వారి  పక్కన నటిస్తున్నప్పుడు వాళ్ల హైట్‌కి కాస్త అడ్జస్ట్ అయి నటించాల్సి వస్తుందని వరుణ్ చెప్పారు. దాంతో కాస్త ఇబ్బందిగా అనిపిస్తుందట వరుణ్ తేజ్ కు. 
 

67

ఇక తన రెమ్యూనరేషన్ ఫిక్స్ అయి ఉండదని.. సినిమా బడ్జెట్ ను బట్టి రెమ్యునరేషన్ తీసుకుంటాను అన్నారు వరుణ్.  ఇక తనకు  టాటూ అంటే చాలా ఇష్టమని.. కాని అవి  వేయించుకోవడమే భయమన్నారు వరుణ్  తేజ్. ఇక ఆయన ఈ సినిమాతో పాటు మట్కా అని మరో సినిమా కూడా చేస్తున్నారు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈసినిమా షూటింగ్ కూడా త్వరలో కంప్లీట్ చేయాలని చూస్తున్నాడు వరుణ్ తేజ్. 
 

77

ఇక లాస్ట్ ఇయర్ నవంబర్ లో ఓ ఇంటివాడు అయ్యాడు వరుణ్ తేజ్. హీరోయిన్ లావణ్య త్రిపాఠిని 5 ఏళ్ళు రహస్యంగా ప్రేమించి.. పెద్దలు ఒప్పించి పెళ్ళి చేసుకున్నాడు. ఇక పెళ్ళి తరువాత మొదటి సంక్రాంతిని కూడామెగా ఫ్యామిలీ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. మెగాస్టార్ బెంగళూరు ఫామ్ హౌస్ లో మెగా సంక్రాంతి సంబరాలు జరిగాయి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Dragon Glimpse: ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ ఊచకోత.. 4 నిమిషాలు అల్లాడించిన తారక్..
Recommended image2
Darshan Thoogudeepa: ప్రపంచమంతా ఎదురొచ్చినా నిన్ను వదలను.. దర్శన్‌పై ఆయన భార్య ఎమోషనల్ పోస్ట్
Recommended image3
Nara Lokesh as Hero: హీరోగా నారా లోకేష్‌ మిస్‌ చేసుకున్న మూవీ ఏంటో తెలుసా? దెబ్బకి కుర్ర హీరో జాతకమే మారిపోయింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved