- Home
- Entertainment
- Ram Charan Birthday: రామ్ చరణ్ పక్కా ప్లాన్... యాక్షన్ ట్రీట్ కు రెడీ అయిన మెగా పవర్ స్టార్
Ram Charan Birthday: రామ్ చరణ్ పక్కా ప్లాన్... యాక్షన్ ట్రీట్ కు రెడీ అయిన మెగా పవర్ స్టార్
ఆర్ఆర్ఆర్ సూపర్ హిట్ తో దిల్ కుష్ అయ్యాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. తన బర్త్ డే సందర్భంగా చరణ్ కు ట్రిపుల్ ఆర్ సినిమా సక్సెస్ తో మెమోరబుల్ గిఫ్ట్ లభించింది. దాంతో ఈ పుట్టిన రోజును జీవితంలో మర్చిపోలేనంటున్నాడు చరణ్. తకు ఇంతటి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు స్పెషల్ థ్యాంక్స్ కూడా చెప్పుకున్నాడీ హీరో.

ఇక ట్రిపుల్ ఆర్ సూపర్ సక్సెస్ తో చరణ్ బాబు నెక్ట్స్ సినిమాలపై గట్టిగానే దృష్టి పెట్టాడు. ఈ సక్సెస్ మ్యానియాను ఇలాగు కంటీన్యూ చేయాలని చూస్తున్నాడు. మళ్లీ గ్యాప్రాకుండా చూసుకోవాలన ప్లాన్ చేస్తన్నాడు. ఈ దెబ్బతో ప్యాన్ ఇండియాను ఏలే ప్లాన్ లో ఉన్నాడు చెర్రీ. పక్కా యాక్షన్ ప్లాన్ ను రెడీ చేసుకున్నాడు. ఇక రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా.. చరణ్ సినిమాలపై ఓ లుక్కేసి వద్దాం..
ట్రిపుల్ ఆర్ లో చరణ్ కొత్తగా కనిపించాడంటు ప్రశంసలు వస్తున్నాయి. బాగాలేడు, నటన అస్సలు లేదు అంటూ విమర్షించిన వారిచేత ప్రశంసలు పొందేలా మారిపోయాడు చరణ్. తనలో టాలెంట్ కు గట్టిగానే పదును పెట్టాడు. ముఖ్యంగా రంగస్థలం సినిమాతో తనలో చాలా మార్పులు వచ్చాయి. నటన పరంగా ఒకేసారి చరణ్ టర్న్ అయిపోయాడు. ఫ్యాన్స్ కు ప్రేక్షకులకు కొత్త చెర్రీని చూపించాడు.
ఆర్ ఆర్ ఆర్ కోసం ఎన్టీఆర్ తో పాటు చరణ్ కూడా దాదాపు మూడేళ్లకు పైగా ధారపోశాడు.ఈ సినిమా కోసం చాలా సమయాన్ని కేటాయించాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో.. దిల్ ఖుష్ అయ్యాడు. కాని ఇక నుంచి తన సినిమాల స్పీడ్ పెంచబోతున్నాడు. ఫ్యాన్స్ తో గ్యాప్ లేకుండా చూసుకోవాలని చూస్తున్నాడు. అందుకే ట్రిపుల్ ఆర్ రిలీజ్ అవ్వకముందే శంకర్ సినిమా స్టార్ట్ చేసిన చరణ్.. ఈ ఏడాదిలోనే మరో సినిమాకు కొబ్బరి కాయ కొట్టబోతున్నాడు.
రామ్ చరణ్ ఎక్కువగా యాక్షన్ మూవీస్ పై దృష్టి పెడుతున్నారు. మెగా పవర్ ను చూపించబోతున్నాడు. యాక్షన్ సీక్వెన్స్ లతో పాటు పెర్ఫామెన్స్ ఓరియోంటెడ్ కథలను ఏరి కోరి ఎంచుకుంటున్నాడు. ట్రిపుర్ ఆర్ తరువాత చరణ్ చేయబోతున్న సినిమాలు దాదాపు ఆ కోవలోనివేగా కనిపిస్తున్నాయి.
ఈ ఏడాది చరణ్ కు డబుల్ ట్రీట్ అందబోతోంది. ట్రిపుల్ ఆర్ సక్సెస్ తరువాత కొంత గ్యాప్ లోనే ఆయన నటించిన మరో సినిమా ఆచార్య రిలీజ్ కు రెడీ అవుతుంది. కొరటాల డైరెక్షన్ లో తెరక్కెక్కిన ఈసినిమాలో చరణ్ మెగాస్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే ఈ సినిమాలో కూడా నూ చరణ్ పోరాట వీరుడిగానే కనిపించనున్నాడు.
ఇక ప్రస్తుతం ఆయన శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్స్ ను పూర్తిచేసుకుంది. ఆ తరువాత షెడ్యూల్ కి కావలసిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా కూడా యాక్షన్ బేస్ గా నడిపించబోతున్నట్టు తెలుస్తోంది. శంకర్ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
శంకర్ డైరెక్షన్ లో చరణ్ సినిమా రన్నింగ్ లో ఉండగానే..ఈ సినిమాతో పాటు గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్టును కూడా చరణ్ పట్టాలెక్కించనున్నాడు. ఈ సినిమా స్పోర్ట్స్ నేపథ్యంలో నడుస్తుందనే ప్రచారం జరిగింది. అయితే అందులో ఎంతమాత్రం నిజం లేదని అంటున్నారు. ఇది పూర్తిస్థాయి యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో ఉంటుందని సమాచారం.
గౌతమ్ తిన్ననూరి సినిమాను కొత్తగా ప్లాన్ చేస్తున్నారట. ఇందులోప్రతీ అంశం డిఫరెంట్ గా ఉండేట్టు చూస్తున్నారట. ముఖ్యంగా యాక్షన్ కూడా కొత్తగా ఉంటుందట. ఇంతవరకూ వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుందని అంటున్నారు.
ఇక ఈరోజు (మార్చ్ 27) రామ్ చరణ్ 36వ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా సెలబ్రేట్ చేయడానికి ఇప్పటికే చరణ్ ఫ్యాన్స్ అన్ని ఏర్పాట్లు చేశారు. ఈరోజు సాయంత్రం 4. 32 నిమిషాలకు శిల్పా కళావేది ఆడిటోరియంలో చాలా గ్రాండ్ గా చెర్రీ బర్త్ డే సెలబ్రేషన్స్ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలుస్తోంది.