Niharika Konidela: ఎవరేమనుకున్నా తగ్గేదేలే... దూసుకెళుతున్న నాగబాబు తనయ నిహారిక
మెగా ఫ్యామిలీలో డేరింగ్ డాషింగ్ గర్ల్ గా ఉంది నిహారిక కొణిదెల. కోట్లలో అభిమానులు కలిగిన ఆ ఫ్యామిలీ నుండి హీరోయిన్ అయిన ఒకే ఒక అమ్మాయి నిహారిక కావడం విశేషం. దీనికి ఆమె పెద్ద యుద్ధమే చేశారు. కుటుంబ సభ్యులతో పాటు ఫ్యాన్స్ నిహారిక హీరోయిన్ కావడానికి అనుమతి ఇవ్వలేదు.

అందరినీ ఒప్పించి నిహారిక (Niharika Konidela)హీరోయిన్ గా వెండితెరకు పరిచయమయ్యారు. అయితే మెగా హీరోలు సక్సెస్ అయినట్లు నిహారిక కాలేదు. దానికి కారణం ఆ ఫ్యామిలీ స్టార్స్ నుండి ఆమెకు పెద్దగా సప్పోర్ట్ లభించలేదు. నిహారిక సినిమాలను చిరు, పవన్, చరణ్ లాంటి స్టార్స్ ప్రమోట్ చేసిన దాఖలాలు లేవు. నిహారిక హీరోయిన్ గా నటించిన చిత్రాలేవీ విజయం సాధించలేదు.
ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవడంలో ఫెయిలైన నిహారికకు పెళ్లి చేశారు. తమ కుటుంబానికి చాలా కాలంగా తెలిసిన పోలీస్ అధికారి ప్రభాకర్ రావు కుమారుడు వెంకట చైతన్యతో నిహారిక వివాహం ఘనంగా జరిగింది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలస్ లో ఐదు రోజులు ఘనంగా నిర్వహించారు. పవన్ తో పాటు మెగా హీరోలందరూ పాల్గొన్న ఈ వివాహం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.
పెళ్లి తర్వాత నటనకు నిహారిక పూర్తిగా దూరమవుతారని అందరూ భావించారు. అత్తింటి వారిది కూడా సినిమా నేపథ్యం లేని కుటుంబం. దీంతో నిహారిక వెండితెరపై కనిపించడం గగనమే అని ఊహించారు. అయితే ఆమె వాళ్ళ అనుమతితో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. నటిగా ఆమె ఓ వెబ్ సిరీస్ చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇదిలా ఉంటే నిహారిక పబ్ లో దొరకడం సంచలనంగా మారింది. బంజారాహిల్స్ లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్ లో జరుగుతున్న ఓ లేట్ నైట్ పార్టీలో పాల్గొన్న నిహారికతో పాటు చాలా మంది యువతీ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిహారిక ఏకంగా పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్షం కావడం సంచలనంగా మారింది. ఈ పార్టీలో డ్రగ్స్ వాడినట్లు ఆధారాలు లభించాయి. పబ్ నిర్వాహకులతో పాటు డ్రగ్స్ పెడ్లర్లను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.
ఈ సంఘటన తర్వాత నిహారిక అసలు కనిపించలేదు. తాజాగా ఆమె భర్త వెంకట చైతన్యతో పాటు కనిపించారు. నిహారిక కొత్త ప్రాజెక్ట్ లాంచింగ్ ఈవెంట్ ఫోటోలు తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశారు. నిహారికకు పింక్ పాంథర్ ఎంటర్టైన్మెంట్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థ ఉంది. ఈ బ్యానర్ లో ఆమె నాన్న కుచ్చి, మ్యాడ్ హౌస్ లాంటి సిరీస్లు తెరకెక్కించారు.
Niharika Konidela
తాజాగా నిహారిక నిర్మాతగా హలో వరల్డ్ పేరుతో ఓ సిరీస్ తెరకెక్కిస్తున్నారు. ఈ సిరీస్ నిన్న గ్రాండ్ గా పూజా కార్యక్రమాలతో లాంచ్ చేశారు. సద, ఆర్యన్ రాజేష్ ప్రధాన పాత్రల్లో ఈ సిరీస్ తెరకెక్కుతుంది. ఈ నేపథ్యంలో ఓ పక్క నటిగా కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తూనే, నిర్మాతగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పబ్ సంఘటన తర్వాత ఆమె ఫ్రీడమ్ కట్ అంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని ఈ సంఘటనతో తేలింది. నిహారిక ఎవరేమనుకున్నా తగ్గేదేలే అంటూ ముందుకు దూసుకెళుతుంది.