Meera Jasmine:మీరా జాస్మిన్ 'హాట్ షో' వెనక ఆ హీరో ? దగ్గరుండి ఫొటో షూట్?
ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉంటూ కేవలం హావభావాలతో లక్షలాదిమంది మనస్సును దోచుకుంది. 2001-2010 కాలంలో ఆమె స్టార్ హీరోయిన్. తెలుగుతో పాటు మలయాళం, తమిళ భాషల్లో నటించిన జాతీయ ఉత్తమ నటిగా గుర్తింపు పొందింది.

మీరాజాస్మిన్ అనగానే మనకు ఆమె చేసిన ఫ్యామిలీ రోల్స్, హోమ్లి గెటప్ లు గుర్తు వస్తాయి. ఆమె ఓ టైమ్ లో భీబత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ‘భద్ర’, ‘గుడుంబా శంకర్’, ‘అమ్మాయి బాగుంది’, ‘రన్’, ‘పందెం కోడి’ వంటి హిట్ చిత్రాలతో ఆమె తెలుగులో ముద్ర వేసింది. అప్పట్లో గ్లామర్ ప్రదర్శనకు పూర్తి దూరం అన్నట్లుంది. నటనకే ప్రయారిటీ ఇచ్చింది. అయితే నలభైల్లోకి వచ్చాక ఆమె రూట్ మార్చింది. గ్లామర్ వొలకబోయటం మొదలెట్టింది. ఇన్నాళ్లూ గుట్టుగా దాచిన అందాల ప్రదర్శన పెట్టింది. అయితే హఠాత్తుగా ఇలా మీరాజాస్మిన్ హాట్ షో మొదలెట్టడం చాలా మందిని షాక్ కు గురి చేసింది.
మీరాజాస్మిన్ ఫ్యామిలీ ఇమేజ్ నే ఇప్పటికే ఇష్టపడుతున్నవారు కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆమె ఇలా హాట్ షో చేయటం వెనక కారణం ఏమిటి అనే టాపిక్ మొదలైంది. అయితే ఇది మీరా జాస్మిన్ సొంత ఆలోచన కాదని...ఆమె తన సినిమాలో వేషం ఇస్తానని తెలుగులో ఓ సీనియర్ హీరో ప్రామిస్ చేసాడని అంటున్నారు.
ఆ హీరోనే ముందు నువ్వు ఇప్పటికీ హాట్ గా ఉన్నావని జనాలు గుర్తించాలని, అప్పుడు నేను చెప్పగానే డైరక్టర్, నిర్మాత నోరు మూసుకుని పెట్టుకుంటారని సలహా ఇచ్చారట. ఆ హీరోతో ఆమె గతంలో సినిమాలు చేసిందిట. అతని సలహా వినే అతను చెప్పిన ఓ ఫొటో షూట్ చేసే ఫొటో గ్రాఫర్ తో ఇలా ఫొటో షూట్ చేయించుకుందని చెప్తున్నారు. ఇంతకీ ఎవరా హీరో... ఆ మ్యాటర్ ఏంటనేది మాత్రం బయిటకు రాలేదు.
ఇప్పుడు ఫార్టీ ప్లస్ ఏజ్ లో రీఎంట్రీ ఇస్తోంది. అందునా గ్లామర్ పాత్రలు కోసం చూస్తోంది మీరా జాస్మిన్. ఆమె హీరోయిన్ గా వెలుగొందిన కాలంలో పక్కింటి అమ్మాయి పాత్రలే చేసిన విషయం తలుచుకుని ఫ్యాన్స్ నిట్టూరుస్తున్నారు.
Meera Jasmine
పదేళ్ల క్రితం పెళ్లి చేసుకొని దుబాయ్ వెళ్లిన మీరా జాస్మిన్ మళ్ళీ ఇండియాకి వచ్చింది. ఒకప్పుడు బొద్దుగా ఉన్న మీరా ఇప్పుడు సన్నబడింది. ఆ విషయం చెప్పటానికే అన్నట్లు ఆ ఫొటో లు ఉంటున్నాయి. ఇప్పుడీ ఫోటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
ఈ ఫొటోలు చూస్తూంటే ఆమె ఆల్కహాల్ వ్యసనం నుంచి కూడా బయటపడినట్లు ఉందనిపిస్తోంది. ఫార్టీ ప్లస్ లో కూడా తన సొగసు తగ్గలేదు అన్నట్లుగా చూపేందుకు మీరా జాస్మిన్ ఈ మధ్య గ్లామరస్ ఫోటోషూట్ లు చేస్తోంది.
ఇటీవలే ఆమె ఇన్ స్టాగ్రామ్ లోకి వచ్చింది. ఇప్పుడు అలాంటి ఫోటోలు షేర్ చేస్తోంది. మలయాళంలో అయితే ఆమెకి ఇప్పటికీ అడపాదడపా అవకాశాలు వస్తున్నాయి. మరి తెలుగులో ఛాన్స్ వస్తుందా అనేది చూడాలి.
Meera Jasmine
పాత తరం హీరోయిన్లకు మంచి పాత్రలు ఇచ్చే త్రివిక్రమ్ వంటి దర్శకులు టాలీవుడ్ లో కొందరున్నారు. మరి వారు మీరాని తెలుగులోకి మళ్ళీ తీసుకొస్తారా? వస్తే కనక మళ్లీ మీరా ఫుల్ బిజీ అవుతుంది. మీరా జాస్మిన్ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
Meera Jasmine
తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకప్పుడు రాణించిన హీరోయిన్స్ లలో మీరా జాస్మిన్ ఒకరు. తెలుగులో ఆమె బాలకృష్ణ .. జగపతిబాబు .. రవితేజ .. పవన్ కల్యాణ్ లతో సినిమాలు చేసింది. ముఖ్యంగా 'గుడుంబా శంకర్' సినిమా మీరా జాస్మిన్ కు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది.
Meera Jasmine got married to Anil John Titus, who works as a software engineer in Dubai, on February 9, 2014
అప్పట్లో మీరా జాస్మిన్ కు గ్లామర్ పరంగా నే కాకుండా నటనాపరంగా ఆమెకి మంచి మార్కులే పడ్డాయి గానీ, సరైన సినిమాలు పడలేదు. దాంతో ఆశించిన స్థాయిలో సక్సెస్ లభించలేదు. అయినా అరాకొరా తమిళ .. మలయాళ భాషల్లో ఆమె వరుస సినిమాలు చేస్తూ వెళ్లింది. అక్కడ ఆమె ఖాతాలో కొన్ని హిట్స్ ఉన్నాయి.
Meera Jasmine
తెలుగుతో పాటు మలయాళం, తమిళ భాషల్లో నటించిన జాతీయ ఉత్తమ నటిగా గుర్తింపు పొందింది. 2014లో దుబాయ్ కి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనిల్ ని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయింది.అయితే వివాహం తర్వాత తలెత్తిన విబేధాల కారణంగా మీరా.. తన భర్తతో విడిపోయింది.
Meera Jasmine
ఇప్పుడు మీరా జాస్మీన్ మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. మీరా జాస్మిన్ రీసెంట్ గా ఇన్ స్టా లో అడుగుపెట్టింది. ఇలా ఇన్ స్టాలో ఎకౌంట్ ఓపెన్ చేసిందో లేదో, అలా ఫాలోవర్స్ సంఖ్య కుప్పలు తెప్పలుగా పెరిగిపోతోంది. చాలా మంది సెలబ్రిటీలు ఆమెకి వెల్కమ్ మెసేజ్ లు పెడుతున్నారు.
Meera Jasmine
మాస్ మహారాజా రవితేజ కూడా మీరా జాస్మిన్ కి వెల్కమ్ చెబుతూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ పెట్టాడు. సినిమాలకు .. నా ఫ్యాన్స్ కు మరింత దగ్గర కావడం కోసమే ఇన్ స్టాలో అడుగుపెట్టినట్టుగా ఆమె చెప్పింది. మలయాళంలో రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె, తెలుగులోను రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Meera Jasmine
కేరళకు చెందిన ఈ బ్యూటీ.. 1982 ఫిబ్రవరి 15న కేరళలోని తీరువల్లలో ఓ సిరియన్ క్రైస్తవ కుటుంబంలో జన్మించింది. ఈమె అసలు పేరు జాస్మిన్ మేరి జోసెఫ్. మీరా సోదరుడు జార్జ్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశాడు. మీరా డిగ్రీ చదువుతున్న రోజుల్లో బ్లెస్సి అనే సహాయ దర్శకుడు ఆమెను చూసి సినిమాల్లోకి ఆహ్వానించాడు.
Meera Jasmine
ప్రముఖ దర్శకుడు లోహిత్ దాస్‌కు మీరాని పరిచయం చేసి మలయాళం మూవీ ‘సూత్రధారన్’లో అవకాశం ఇప్పించాడు. ఆ తర్వాత పలు కోలీవుడ్, మాలీవుడ్ సినిమాల్లో నటించి మెప్పించిన మీరా.. ‘పాదమ్ ఒన్ను ఒరు విలాపం’ మూవీతో ఉత్తమ నటిగా నేషనల్ అవార్డును అందుకుంది.
Meera Jasmine
తనదైన నటనతో దూసుకెళ్తున్న మీరాకు తక్కువ టైమ్‌లోనే టాలీవుడ్ నుంచి పిలుపొచ్చింది. తెలుగులోకి రిలీజైన్ డబ్బింగ్ మూవీ ‘రన్’తో టాలీవుడ్‌కి పరిచయమైంది మీరాజాస్మిన్. ఆ తర్వాత 2004లో హీరో శివాజీతో కలిసి ‘అమ్మాయి బాగుంది’లో నటించి మెప్పించింది.
పవన్ కళ్యాణ్‌తో గుడుంబా శంకర్, రవితేజతో భద్ర, విశాల్‌తో పందెం కోడి తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఈ భామ. హీరో రాజశేఖర్, మీరా జాస్మిన్ అన్న చెల్లెలుగా నటించిన ‘గోరింటాకు’తో తెలుగింటి ఆడపడుచు అయిపోయింది. ఈ మూవీలోని ఎమోషనల్ సీన్స్‌లో అద్భుతంగా నటించి ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించింది.
Meera Jasmine
కొంతకాలం క్రితం ఓ మలయాళం సినిమాలో గెస్ట్ రోల్‌లో మీరా కనిపించింది. అయితే ప్రస్తుతం పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మళ్లీ పూర్తిగా సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకుందట. రీ ఎంట్రీ కోసం ఈ అమ్మడు జిమ్ కి వర్క్ అవుట్స్ చేసి వెయిట్ లాస్ అయిందట. ప్రజెంట్ మీరాకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. భూమిక, స్నేహల మాదిరిగా మీరా సెకండ్ ఇన్సింగ్స్ కూడా సక్సెస్‌ఫుల్‌గా కొనసాగాలని ఆశిస్తున్నారు అభిమానులు.