MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • షాక్ :తమన్నా నే అలా చేసింది, మా తప్పేముంది?...'మాస్టర్ చెఫ్' టీమ్ వివరణ

షాక్ :తమన్నా నే అలా చేసింది, మా తప్పేముంది?...'మాస్టర్ చెఫ్' టీమ్ వివరణ

‘మాస్టర్ చెఫ్’లో హోస్ట్ చేసేందుకు రూ.2 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చేలా తమన్నాతో అగ్రిమెంట్ చేసుకున్నామని నిర్వాహకులు తెలిపారు. జూన్ 24 నుంచి సెప్టెంబర్ చివరి వరకు మొత్తం 18 రోజులు షోకు హోస్ట్ గా వ్యవహరించేందుకు తమన్నాతో అగ్రిమెంట్ పై సంతకం చేశారని చెప్పారు.  

2 Min read
Author : Surya Prakash
Published : Oct 27 2021, 03:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానెల్ జెమినీ టీవీలో  ప్రసారమవుతున్న ‘మాస్టర్ చెఫ్’(Master chef) కార్యక్రమం తమన్నా(Tamannah) విషయంలో వివాదమైంది.  తమన్నా ఈ పోగ్రామ్ కు హోస్ట్ గా చేస్తోంది. అయితే తమన్నా వల్ల ఈ షోకు రేటింగ్ రావటం లేదని.. ఆమె యాంకరింగ్ అంతగా బాగా లేదన్న విమర్శల వచ్చాయి. ఈ లోగా ఊహించని విధంగా మాస్టర్ చెఫ్ నిర్వాహకులు తమన్నాను తొలగించి.. యాంకర్ అనసూయ(Anasuya)ను తీసుకోవడం సెన్సేషన్ అయ్యి..మీడియాలో చర్చనీయాంశమైంది.  ఈ నేపథ్యంలోనే మాస్టర్ చెఫ్ నిర్వాహకులు దీనిపై వివరణ ఇస్తూ ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఆ ప్రెస్ నోట్ లో ఏముందంటే..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27


తాము బెంగళూరు సివిల్ కోర్టుకు వెళుతున్నామని Tmannah తమతో సైన్ చేసిన అగ్రిమెంట్ ప్రకారమే కోర్టుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. వారు జారీ చేసిన ప్రకటనలో తమన్నా మాట్లాడిన మాటలు అన్నీ నిజాలు కావని, మాకు అంటే ఇన్నోవేటివ్ ఫిల్మ్ అకాడమీ-తమన్నా మధ్య ఉన్న కాంట్రాక్టు ప్రకారం 24వ తేదీ జూన్ నుండి సెప్టెంబర్ నెలాఖరు లోపు 18 రోజులు షూటింగ్ చేయాల్సి ఉందని పేర్కొన్నారు. 

37

అలా 18 రోజుల షూటింగ్ జరిపినందుకుగాను ఇన్నోవేటివ్ ఫిల్మ్ అకాడమీ తమన్నాకు రెండు కోట్లు కట్టేందుకు అంగీకరించిందని ఈ మేరకు ఉన్న కాంట్రాక్టు మీద రెండు పార్టీలు సంతకాలు చేశారని పేర్కొన్నారు. 

47


అయితే ఇప్పుడు నిర్వాహకులు ఏమంటున్నారంటే మేము ఆమె 16 రోజుల షూటింగ్ లో పాల్గొంది కాబట్టి ఆ డబ్బులు క్లియర్ చేశాము అంటున్నారు. 16 రోజులకు గాను ఆమెకు 1.56 కోట్లు ఇచ్చామని చెబుతున్నారు. కానీ ఆమె లేట్ చేయడం వల్ల షెడ్యూల్ అంతా డిస్టర్బ్ అయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి అని చెబుతోంది. లెక్క ప్రకారం ఈ షూటింగ్ అంతా సెప్టెంబర్ లోపు పూర్తి కావాలి కానీ ఇప్పటి వరకు కూడా పూర్తి చేసే పరిస్థితి లేదని చెబుతోంది.

57


తమన్నా మంచి రెస్పాన్స్ లేకపోవడం వల్ల తాము ఐదు కోట్ల రూపాయల దాకా నష్టపోయామని ఎందుకంటే తమన్నా ఒక్కరూ రాకపోయినా తాము మిగతా 300 పైగా ఉన్న ఇతర క్రూ మొత్తాన్ని పిలిపించుకోవాల్సి ఉంటుందని ఈ కారణంగా మేము ఐదు కోట్ల రూపాయలు నష్టపోయామని చెబుతున్నారు. అయితే తమన్నాతో ఉన్న అగ్రిమెంట్ ప్రకారం  చివరి రెండు రోజులు షూటింగ్ కూడా పూర్తి చేసి ఉంటే మిగిలిన పేమెంట్ చేసేవాళ్లమని తెలిపారు.

67


అంతేకాక ఆమె మిగిలిన ఎపిసోడ్స్ పూర్తి చేయకుండా రెండవ సీజన్ కి సంబంధించిన అడ్వాన్స్ డబ్బులు కూడా అడుగుతోంది అని, అసలు మిగిలిపోయిన 2 ఎపిసోడ్స్ ఎవరితో పూర్తి చేయాలో తెలియక మేము తలలు పట్టుకుంటే ఆమె రెండవ సీజన్ డబ్బులు కూడా డిమాండ్ చేయడం మాకు షాకింగ్ అనినిపించిందని నిర్వాహకులు చెబుతున్నారు. 

77

అలాగే ఏమైనా తేడాలు ఉంటే మాట్లాడుకోవాలి కానీ తమన్నా నేరుగా మీడియాకి వెళ్లడం కూడా తమకు షాకింగ్ గా అనిపించిందని అందుకే ఒక రెస్పాన్సిబుల్ కంపెనీ గా మేము దీనిని లీగల్ గానే ఫైట్ చేయాలని నిర్ణయించుకున్నామని కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. తమన్నా అంశానికి సంబంధించి ఏ వార్త రాయాలన్న మీడియా తమను సంప్రదించాలని నిర్వాహకులు కోరారు. 

also read: Priyamani:భుజాలపై నుండి జారిపోతున్న ప్రియమణి గౌను, ఆ సోకులు చూస్తే కుర్రాళ్ళు ఏం కాను..!

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే
Recommended image2
Kajal Aggarwal Mysore Palace: మైసూర్ ప్యాలెస్‌లో కాజల్ సందడి.. అది చూసి చందమామ సర్‌ప్రైజ్‌
Recommended image3
Top 5 Flop Movies: రజనీ, సూర్య, అజిత్‌, విక్రమ్‌.. ఓవర్ హైప్ ఇచ్చి అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved