- Home
- Entertainment
- 12 మందితో ఎఫైర్, ఒకరితో పెళ్లి, 55 ఏళ్ల వయస్సులో ఒంటరి జీవితం గడుపుతోన్న హీరోయిన్ ఎవరో తెలుసా?
12 మందితో ఎఫైర్, ఒకరితో పెళ్లి, 55 ఏళ్ల వయస్సులో ఒంటరి జీవితం గడుపుతోన్న హీరోయిన్ ఎవరో తెలుసా?
50 ఏళ్ల వయస్సులో ఒంటరిగా జీవనం సాగిస్తోంది ఓ స్టార్ హీరోయిన్. గతంలో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ నటి వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నోవివాదాలతో వైరల్ అయ్యింది. ఇంతకీ ఎవరా హీరోయిన్?

ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ల జీవితాలు డిఫరెంట్ గా ఉంటాయి. కెరీర్ ను కరెక్ట్ గా ప్లాన్ చేసుకోపోతే మోసపోయి ఇబ్బందులు పడక తప్పదు. చాలామంది హీరోయిన్ల జీవితాలు అందుకు ఉదాహరణగా నిలిచాయి. ఇక ప్రస్తుతం 55 ఏళ్ల వయస్సులో ఒంటరి జీవితం గడుపుతోన్న ఓ హీరోయిన్ పరిస్థితి కూడా అంతే. 12 మందికి పైగా స్టార్స్ తో అఫైర్ వార్తలతో పాపులర్ అయ్యింది సీనియర్ బ్యూటీ. ఆమె మరెవరో కాదు మనీషా కోయిరాలా. బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన ఈ తార.. ప్రస్తుతం ఏం చేస్తోందో తెలుసా? 1970లో నేపాల్‌లో జన్మించిన మనీషా కోయిరాలా, 1991లో తన నటజీవితాన్ని బాలీవుడ్‌లో సౌదాగర్ సినిమా ద్వారా ప్రారంభించింది.
ఫిల్మ్ ఇండస్ట్రీలో 33 ఏళ్లు
దాదాపు 33 సంవత్సరాల సినీ కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసింది మనీషా. మనీషా కోయిరాలా బాలీవుడ్ తో పాటు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని కూడా ఒక ఊపు ఊపేసిన తార. ఎందరో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన ఈ బ్యూటీ.. పెళ్ళికి ముందే 12 మందితో ప్రేమలో మునిగి తేలిందంటూ న్యూస్ వైరల్ అవుతోంది. ఇక ఆమె చేసుకున్న ఏకైక పెళ్ళి కాస్త పెటాకులు కావడంతో... భర్తతో కూడా విడాకులు తీసుకొని 55 ఏళ్ల వయస్సులో ఒంటరిగా గడుపుతోంది.
మనీషా కోయిరాలా పెళ్లి , విడాకులు
మనీషా కోయిరాలా వ్యక్తిగత జీవితం కూడా ఎప్పటికప్పుడు వార్తల్లో వైరల్ అవుతూ వస్తోంది. 15 ఏళ్ళ క్రితం.. 2010 లో నీషా కొయిరాలా నేపాల్ వ్యాపారవేత్త సామ్రాట్ దహల్‌ను పెళ్ళి చేసుకున్నారు. కాని వారి వివాహజీవితం ఎక్కువ రోజులు నిలవలేదు. పెళ్ళైన రెండేళ్ళకే.. 2012 లో వీరు విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఆమె ఒంటరి జీవితాన్నే గడుపుతోంది.
ఎఫైర్ వార్తలతో పాపులర్
మనీషా కోయిరాలా లవ్ అఫైర్స్ ఆమె కెరీర్ లో స్టార్ డమ్ కంటే కూడా ఎక్కువగా పాపులర్ అయ్యేలా చేశాయి. వివేక్ ముశ్రన్‌తో మనీషా కోయిరాల మొదటి ప్రేమ మొదలైంది. ఆతరువాత నానా పటేకర్‌తో డేటింగ్ చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. 1996లో వచ్చిన అగ్నిసాక్షి సినిమా తర్వాత వీరి బంధం బలపడిందని టాక్ . నానా పటేకర్ స్వయంగా ఈ విషయాన్ని అంగీకరించిన సందర్భం కూడా ఉంది.
హాలీవుడ్ స్టార్స్ తో కూడా
తర్వాత ఆమె DJ హుస్సేన్‌తో మనీషా కోయిరాలా డేటింగ్ చేసినట్టు సమాచారం. తర్వాత నైజీరియన్ వ్యాపారవేత్త సెసిల్ ఆంథోనీతో ఈ హీరోయిన్ కు బంధం ఏర్పడింది. వీరి బంధం కూడా కొంత కాలానికే ముగిసింది. అనంతరం నటుడు ఆర్యన్ వైద్, ఆస్ట్రేలియన్ రాయబారి క్రిస్పిన్ కాన్రాయ్ లాంటి వ్యక్తులతో డేటింగ్ చేసినట్టు వార్తలు వచ్చాయి. ఈ లిస్ట్ అక్కడితో ఆగలేదు. ఈ జాబితాలో వ్యాపారవేత్త అజీమ్ ప్రేమ్‌జీ కుమారుడు తారిక్ ప్రేమ్‌జీ, మోడల్ రాజీవ్ మూల్‌చందానీ, సంగీత దర్శకుడు సందీప్ చౌతా, క్రిస్టోఫర్ డోరిస్‌లు కూడా ఉన్నారు. అయితే వీటిలో కొన్ని సంబంధాలు మనీషా తాను స్వయంగా అంగీకరించినవైతే, మరికొన్ని మీడియాలో వైరల్ అయిన రూమర్స్.