Ginna: మంచు విష్ణు 'జిన్నా' మూవీ రివ్యూ
మా ప్రెసిడెంట్, హీరో మంచు విష్ణు హిట్టు కొట్టి చాలా కాలమే అవుతోంది. ఇటీవల మంచు విష్ణు నటించిన చిత్రాలు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాయి. దీనితో విష్ణు మంచి వినోదాత్మక చిత్రంతో విజయం సాధించాలని భావించాడు. ఆ క్రమంలోనే జిన్నా చిత్రంలో నటించాడు.

మా ప్రెసిడెంట్, హీరో మంచు విష్ణు హిట్టు కొట్టి చాలా కాలమే అవుతోంది. ఇటీవల మంచు విష్ణు నటించిన చిత్రాలు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాయి. దీనితో విష్ణు మంచి వినోదాత్మక చిత్రంతో విజయం సాధించాలని భావించాడు. ఆ క్రమంలోనే జిన్నా చిత్రంలో నటించాడు. కోన వెంకట్ రచనలో, ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు గ్రాండ్ గా రిలీజ్ అయింది. పాయల్ రాజ్ పుత్, సన్నీలియోన్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి మంచి బజ్ కూడా క్యారీ అవుతూ వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలని అందుకుందా లేదా అనేది సమీక్షలో చూద్దాం.
కథ:
చిత్తూరు జిల్లాకి చెందిన ఒక చిన్న గ్రామం నేపథ్యంలో ఈ కథ సాగుతూ ఉంటుంది. టెంట్ హౌస్ నడిపే యువకుడు గాలి నాగేశ్వరరావు(మంచు విష్ణు). ఆ పేరుతో పిలిస్తే అతడికి నచ్చదు. అందుకే అందరికీ షార్ట్ కట్ లో జిన్నా అని చెబుతుంటాడు. ఊరంతా అప్పుల్లో మునిగిపోయి ఉంటాడు జిన్నా. చిన్నతనంలో జిన్నాపై రేణుక(సన్నీ లియోన్), స్వాతి( పాయల్ రాజ్ పుత్ ) ఇద్దరు స్నేహితులు ఉంటారు
చిన్న తనంలోనే రేణుక తన తండ్రితో కలసి విదేశాలకు వెళ్ళిపోతుంది. ఇక జిన్నా స్వాతిని ప్రేమిస్తాడు. పెద్దయ్యాక రేణుక కోటీశ్వరురాలిగా ఊళ్లోకి తిరిగి అడుగుపెడుతుంది. రేణుక దగ్గర చాలా డబ్బు ఉందని తెలియడంతో..ఆమెని పెళ్లి చేసుకుని అప్పుల నుంచి బయట పడాలని, ఊరికి ప్రెసిడెంట్ అయి తన కోరిక నెరవేర్చుకోవాలని అనుకుంటాడు. మరి స్వాతిని ప్రేమించిన జిన్నా రేణుకని పెళ్లి చేసుకున్నాడా ?రేణుక గతం ఏంటి ? ఆమె విషయంలో ఊరి జనంలో ఉన్న భయం ఏంటి ? లాంటి ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాలి.
విశ్లేషణ :
చాలా కాలం తర్వాత మంచు విష్ణు వినోదాత్మక పాత్రలో నటించాడు. విష్ణు మంచి కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. ఇది హర్రర్ టచ్ ఉన్న వినోదాత్మక చిత్రం అని ట్రయిల్ చూసే తెలుసుకోవచ్చు. కానీ సినిమా ఆ రకమైన ఫీలింగ్ ఇవ్వదు. అందుకు కారణం రొటీన్ గా తెరకెక్కించిన సన్నివేశాలు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అయితే పదేళ్ల క్రితం నాటి రొటీన్ సీన్స్ తో బోర్ కొట్టించారు.
ఇంటర్వెల్ లో రేణుక పాత్ర ట్విస్ట్ బావుంటుంది. ఇది తప్ప ఫస్ట్ హాఫ్ లో చెప్పుకోదగ్గ సన్నివేశాలేమీ లేవు. సెకండ్ హాఫ్ లో హర్రర్ సన్నివేశాలతో కథని నడిపించారు. కానీ అవి కూడా చాలా చిత్రాల్లో కనిపించినట్లే ఉంటాయి. కానీ ఆ సీన్స్ ని తెరకెక్కించిన విధానం మాత్రం కథ బెటర్ గా ఉంటుంది. కానీ సాలిడ్ ప్రీ క్లైమాక్స్ తో అదరగొట్టారు.
ప్రీ క్లైమాక్స్ సీన్ ఈ చిత్రానికే హైలైట్ అని చెప్పొచ్చు. నటీనటుల విషయానికి వస్తే ఈ చిత్రంలో ఏ పాత్ర కూడా బలంగా అనిపించదు. డబ్బు కోసం హీరోయిన్ ని హీరో మోసం చేసే పత్రాలు గతంలో కోకొల్లలుగా వచ్చాయి. విష్ణు పోషించింది ఫన్ రోల్ అయినప్పటికీ హీరో కాబట్టి అతడికి ఎలాంటి పాజిటివ్ లక్షణాలు ఆపాదించలేదు. విష్ణు పాత్రని సెల్ఫిష్ గా ప్రొజెక్ట్ చేశారు. ఇక సన్నీ లియోన్ మూగ చెవిటి పాత్రలో ఛాలెంజింగ్ రోల్ చేసింది. కానీ ఆమెకి అది అంతగా సెట్ కాలేదు. ఊహించని విధంగా సన్నీలియోన్, పాయల్ రాజ్ పుత్ ఈ చిత్రంలో గ్లామర్ ప్రియులని నిరాశ పరిచారు.
టెక్నికల్ గా :
అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. బ్యాగ్రౌండ్ స్కోర్ పర్వాలేదనిపించే విధంగా ఉంది. ఇక పాటలు వెండి తెరపై బావున్నాయి. విష్ణు కుమార్తెలు అరియనా, విరియానా పాడిన 'ఇది స్నేహం' అనే పాట ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి కోన వెంకట్ స్క్రీన్ ప్లే అందించారు. దర్శకుడు ఇషాన్ సూర్య ఒక మంచి అవకాశాన్ని సరిగా వినియోగించుకోలేదు అనే చెప్పాలి. ప్రొడక్షన్ వాల్యూస్ జస్ట్ ఒకే అనిపిస్తాయి.
ఫైనల్ థాట్ :
మంచు విష్ణు బాగా కష్టపడినప్పటికీ.. 'జిన్నా'గా టైం పాస్ వినోదం కూడా ఇవ్వలేకపోవడం నిరాశ కలిగించే అంశం.
రేటింగ్ : 2/5