మంచు మనోజ్ షాకింగ్ డెసిషన్.. ఏపీ, తెలంగాణ రెండు చోట్లా, సినిమాలకు గుడ్ బై ?
మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ టాలీవుడ్ లో హీరోగా కొనసాగుతున్నాడు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్ తో యువతకు బాగా చేరువయ్యాడు.

మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ టాలీవుడ్ లో హీరోగా కొనసాగుతున్నాడు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్ తో యువతకు బాగా చేరువయ్యాడు. కానీ మంచు మనోజ్ కి సక్సెస్ కంటే ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉన్నాయి. మనోజ్ చిత్రాలకు బలమైన మార్కెట్ కూడా లేదు.
మనోజ్ తన పర్సనల్ లైఫ్ లో కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. కొంత గ్యాప్ తీసుకుని 'అహం బ్రహ్మాస్మి' అనే సాలిడ్ ప్రాజెక్టుని ప్రారంభించాడు కూడా. ఈ చిత్ర ఫస్ట్ లుక్ కూడా ఆకట్టుకుంది. కరోనా ప్రభావమో ఏమో కానీ.. చాలా రోజుల నుచి అహం బ్రహ్మాస్మి అప్డేట్ లేదు.
తాజాగా మంచు మనోజ్ తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. తన సోదరి మంచు లక్ష్మీతో కలసి శ్రీవారిని దర్శించుకున్నట్లు మనోజ్ తెలిపాడు. అనుకోకుండా తాను, అక్క తిరుమలకు రావడం జరిగింది అని తెలిపాడు.
ఈ సందర్భంగా మంచు మనోజ్ మీడియాతో మాట్లాడుతూ సంచలన నిర్ణయం బయట పెట్టాడు. తన తదుపరి చిత్రం గురించి ప్రశ్నించగా.. అది ఏప్రిల్ నుంచి అంటూ స్పష్టమైన సమాధానం లేకండా దాటవేశారు. సినిమా ఏప్రిల్ నుంచి.. కానీ తాను త్వరలోనే ఏపీ తెలంగాణాలో వెంచర్స్ మొదలు పెట్టబోతున్నట్లు ప్రకటించాడు.
తెలుగురాష్ట్రాల్లో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకే కొత్త బిజినెస్ నిర్ణయం తీసుకున్నట్లు మనోజ్ తెలిపాడు. పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తాం అని, అక్టోబర్ నుంచి దీనిని ప్రారంభిస్తాం అని మనోజ్ తెలిపాడు.
మనోజ్ తాజా ప్రకటనతో మనోజ్ సినిమాలకు స్వస్తి చెప్పి బిజినెస్ చేస్తాడనే వార్తలు జోరందుకున్నాయి. మంచు ఫ్యామిలీ ఇప్పటికే శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థలని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మోహన్ బాబు పెద్ద కుమారుడు విద్యాసంస్థల భాద్యతలు చూసుకుంటున్నాడు.