Manchu Manoj: మనోజ్ రెండో పెళ్లి? తాజా ట్వీట్ తో పూర్తి క్లారిటీ!
మంచు మనోజ్ రెండో పెళ్లి వార్త కొద్దిరోజులుగా ప్రచారంలో ఉంది. భూమా మౌనికతో ఆయన సన్నిహితంగా ఉంటున్నారు. ఈ క్రమంలో మనోజ్-మౌనికల వివాహం ఖాయమే అంటున్నారు. ఈ ఊహాగానాలకు మంచు మనోజ్ పోస్ట్ మరింత బలం చేకూర్చింది.
మంచు మనోజ్ కి 2019లో విడాకులయ్యాయి. 2015లో ఆయన ప్రణీత రెడ్డిని వివాహం చేసుకున్నారు మనస్పర్థలతో విడిపోయారు. అప్పటి నుండి మనోజ్ ఒంటరిగా ఉంటున్నారు. మరోవైపు కెరీర్ డల్ అయ్యింది. హీరోగా దాదాపు ఫేడ్ అవుట్ అయ్యారు. ఆయన సిల్వర్ స్క్రీన్ పై కనిపించి ఏళ్ళు గడిచిపోయాయి.
గత ఏడాది మనోజ్ భూమా మౌనిక రెడ్డితో పాటు కనిపించారు. మనోజ్-మౌనిక గణేష్ మండపం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఎంత స్నేహితులైనా... అమ్మాయి, అబ్బాయి కలిసి పూజలు, వ్రతాలు చేయరు. కాబట్టి పెళ్లి చేసుకోబోతున్నారని ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఈ వార్తలను మనోజ్ ఖండించలేదు.
ఈ ఊహాగానాలకు బలం చేకూర్చేలా మంచు మనోజ్ కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నట్లు సోషల్ మీడియాలో కామెంట్స్ పోస్ట్ చేశారు. మనోజ్ మాదిరి మౌనికకు కూడా విడాకులు అయ్యాయి. ఇద్దరికీ వివాహం జరగక ముందే పరిచయం ఉందట. పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా చేశారట. కారణమేమిటో గానీ... అది జరగలేదు.
విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటున్న మనోజ్, మౌనిక ఒక అవగాహనకు వచ్చారంటున్నారు. పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారట. ప్రస్తుతం సహజీవనం చేస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు మనోజ్ మాత్రం రెండో పెళ్లి పై అధికారిక ప్రకటన చేయలేదు. అదే సమయంలో ఈ రిలేషన్ మంచు ఫ్యామిలీలో కుంపటి రగిలించింది అంటున్నారు.
మోహన్ బాబు కుటుంబంతో మనోజ్ దూరంగా ఉంటున్నారట. విష్ణు, మోహన్ బాబు... మనోజ్ పై కోపంగా ఉన్నారంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలను మంచు లక్ష్మీ ఖండించారు. మంచు బ్రదర్స్ మధ్య, కుటుంబ సభ్యుల మధ్య ఎలాంటి విబేధాలు లేవు. అవన్నీ పుకార్లు మాత్రమే అని కొట్టిపారేశారు.
విబేధాల సంగతి అటుంచితే... మౌనికతో ఆయన వివాహం ఖాయమే అన్న మాట గట్టిగా వినిపిస్తోంది . మంచు మనోజ్ తాజా ట్వీట్ తో దీనిపై మరింత స్పష్టత వచ్చింది. మౌనిక తండ్రి భూమా నాగిరెడ్డి జయంతి సందర్భంగా మంచు మనోజ్ ట్వీట్ చేశారు. ఆయన్ని మంచి తండ్రిగా,కొడుకుగా, భర్తగా.. అన్నింటికీ మించి గొప్ప మనసున్న వ్యక్తిగా మనోజ్ కొనియాడారు.
అంకుల్ అని సంబోధిస్తూ మనోజ్ ప్రేమ, ఆప్యాయత, ప్రేమ కురిపిస్తూ... భూమా నాగిరెడ్డిపై ట్వీట్ చేయడం వెనుక... ఒక ఫ్యామిలీ మెంబర్ గా ఆయన భావిస్తున్నారు. అల్లుడు హోదాలోనే ఆయన ట్వీట్ చేశారని అంటున్నారు.