- Home
- Entertainment
- బికినీలో ఇంటర్నెట్ షేక్ చేస్తున్న 'యమదొంగ' హీరోయిన్.. ఒంపుసొంపులు చూపిస్తూ చెమటలు పట్టిస్తోంది
బికినీలో ఇంటర్నెట్ షేక్ చేస్తున్న 'యమదొంగ' హీరోయిన్.. ఒంపుసొంపులు చూపిస్తూ చెమటలు పట్టిస్తోంది
అందాల మెరుపు తీగలా కనిపించే హీరోయిన్లు కొందరే ఉంటారు. అలాంటి వారిలో మమతా మోహన్ దాస్ ఒకరు. మమతా మోహన్ దాస్ పేరు చెప్పగానే ఆమె నటించిన తెలుగు చిత్రాలు గుర్తుకు వస్తాయి.

అందాల మెరుపు తీగలా కనిపించే హీరోయిన్లు కొందరే ఉంటారు. అలాంటి వారిలో మమతా మోహన్ దాస్ ఒకరు. మమతా మోహన్ దాస్ పేరు చెప్పగానే ఆమె నటించిన తెలుగు చిత్రాలు గుర్తుకు వస్తాయి. దాదాపు 15 ఏళ్ల క్రితమే మమతా మోహన్ దాస్ స్టన్నింగ్ ఫిగర్ తో తెలుగు యువతని మెస్మరైజ్ చేసింది.
ప్రస్తుతం మమతా మోహన్ దాస్ వయసు 37 ఏళ్ళు. వివాహం తర్వాత మమతా పూర్తిగా తెలుగు చిత్రాలకు దూరం అయింది. కానీ మలయాళీ చిత్రాల్లో నటిస్తోంది. మమత మోహన్ దాస్ తెలుగులో యమదొంగ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ సరసన నటించిన ఆ మూవీ ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఆ తర్వాత చింతకాయల రవి మూవీతో మరో హిట్ ఖాతాలో వేసుకుంది. కానీ ఆ తర్వాత నటించిన చిత్రాలు పరాజయం చెందడంతో మమతా క్రమంగా తెలుగు సినిమాకి దూరం అయింది.
రీసెంట్ గా మమతా మోహన్ దాస్ 'జన గణ మన' అనే మలయాళీ చిత్రంలో నటించిన సంగతి తేలిందే. పృథ్విరాజ్ సుకుమారన్ నటించిన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. మమతా మోహన్ దాస్ ఈ చిత్రంలో సబా అనే లెక్చరర్ రోల్ లో నటించింది. తన పాత్ర లిమిటెడ్ అయినప్పటికీ మమతా పాత్ర కథకి చాలా కీలకం.
అలాంటి రోల్ లో మమతా మోహన్ దాస్ తన నటనతో ప్రేక్షకులని థ్రిల్ చేసింది. ఈ చిత్రం తెలుగులో కూడా డబ్ అయింది. జనగణమన చిత్రంతో మమతా పేరు మరోసారి మారుమోగుతోంది. నటనకు ప్రాధాన్యత ఉన్న రోల్స్ తో పాటు మమతా మోహన్ దాస్ గ్లామర్ రోల్స్ కూడా చేయాలనుకుంటుందేమో.
తాజాగా సోషల్ మీడియాలో మమతా మోహన్ దాస్ బికినీ పిక్స్ తో రచ్చ రచ్చ చేస్తోంది. మాల్దీవుల్లో వెకేషన్ లో ఎంజాయ్ చేస్తూ బికినీ ఫోజుల్లో గ్లామర్ విందు వడ్డిస్తోంది.
మమతా మోహన్ దాస్ హాట్ నెస్ కి ఇంటర్నెట్ షేక్ అవుతోంది. 37 ఏళ్ల వయసులో ఆమె హాట్ స్ట్రక్చర్ చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. 2011లో వివాహం చేసుకున్న మమతా మోహన్ దాస్ ఆ తర్వాత విభేదాలతో భర్త నుంచి విడిపోయింది.