- Home
- Entertainment
- Nayanthara: నయనతార, విగ్నేష్ జంటతో బోల్డ్ బ్యూటీ మలైకా.. ట్రెండింగ్ గా మారిన ఫోటోస్
Nayanthara: నయనతార, విగ్నేష్ జంటతో బోల్డ్ బ్యూటీ మలైకా.. ట్రెండింగ్ గా మారిన ఫోటోస్
నయనతార, విగ్నేష్ శివన్ జంట ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. మహాబలిపురంలో జూన్ 9న విగ్నేష్, నయనతార వివాహం వైభవంగా జరిగింది.

నయనతార, విగ్నేష్ శివన్ జంట ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. మహాబలిపురంలో జూన్ 9న విగ్నేష్, నయనతార వివాహం వైభవంగా జరిగింది. నయన్, విగ్నేష్ వివాహానికి సినీ ప్రముఖులు హాజరై ఆశీర్వదించారు. వివాహం తర్వాత నయన్, విగ్నేష్ శివన్ థాయిలాండ్ కి హనీమూన్ వెళ్లి తిరిగొచ్చారు.
ప్రస్తుతం నయనతార విగ్నేష్ శివన్.. కింగ్ ఖాన్ షారుఖ్ చిత్రం కోసం ముంబైలో ఉన్నారు. షారుఖ్, అట్లీ కాంబోలో వస్తున్న జవాన్ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. నయనతార ముంబైలో ఉండగా ఆసక్తికర సంఘటన జరిగింది.
అనుకోకుండా నయన్, విగ్నేష్ లని బోల్డ్ బ్యూటీ మలైకా అరోరా కలిసింది. మలైకా కొత్త జంటతో కలసి ఫోటోలు కూడా తీసుకుంది. ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి. నయన్ విగ్నేష్ తో కలసి మలైకా అందంగా ఫోటోకి ఫోజు ఇచ్చింది.
అందరూ సింపుల్ కాస్ట్యూమ్స్ లో బ్యూటిఫుల్ గా ఉన్నారు. ఓ పిక్ ని మలైకా సోషల్ మీడియాలో షేర్ చేసి .. కంగ్రాట్స్ నయనతార, విగ్నేష్.. మిమ్మల్ని ఇద్దరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది అంటూ పోస్ట్ చేసింది.
దాదాపు ఏడేళ్ల పాటు సహజీవనం చేసిన నయనతార, విగ్నేష్ శివన్ ఎట్టకేలకు వివాహం చేసుకున్నారు. ఇక మలైకా విషయానికి వస్తే.. ఈ ముదురు బ్యూటీ ప్రస్తుతం తనకన్నా వయసులో 12 ఏళ్ళు చిన్నవాడైన అర్జున్ కపూర్ తో సహజీవనం చేస్తోంది.
నయనతార తెలుగులో మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీలో కూడా నటిస్తోంది. సైరా నరసింహారెడ్డి తర్వాత మరోసారి చిరు చిత్రంలో నయన్ నటించడం విశేషం. వివాహం తర్వాత నయన్ సినిమాలు తగ్గించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నయనతార గ్లామర్ రోల్స్ కి దూరం కాబోతున్నట్లు నిర్మాతలకు చెప్పేసినట్లు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.