- Home
- Entertainment
- మలైకా అరోరా ప్రియుడు వాళ్ల సిస్టర్ ఫ్రెండ్స్ తో బెడ్ షేర్.. అర్జున్ కపూర్ రిలేషన్‌కే ఎసరు పెట్టిన కరణ్
మలైకా అరోరా ప్రియుడు వాళ్ల సిస్టర్ ఫ్రెండ్స్ తో బెడ్ షేర్.. అర్జున్ కపూర్ రిలేషన్‌కే ఎసరు పెట్టిన కరణ్
బాలీవుడ్ యోగా బ్యూటీ, హాట్ బాంబ్ మలైకా అరోరా, హీరో అర్జున్ కపూర్ ఘాటు ప్రేమలో మునిగి తేలుతున్నారు. కానీ తాజాగా కరణ్ జోహార్ మాత్రం చూడబోతుంటే వారి రిలేషన్‌షిప్‌కే ఎసలు పెట్టినట్టున్నాడు. ఇదే ఇప్పుడు హాట్ న్యూస్.

బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ హోస్ట్ గా రన్ అవుతున్న అత్యంత పాపులర్ షో `కాఫీ విత్ కరణ్`. ప్రస్తుతం ఏడో సీజన్ రన్ అవుతుంది. ఓటీటీలో ప్రసారమవుతున్న ఈ షోలో టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు పాల్గొంటున్నారు. లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఇందులో మలైకా అరోరా ప్రియుడు అర్జున్ కపూర్, ఆయన కజిన్ సిస్టర్ సోనమ్ కపూర్‌తో కలిసి పాల్గొన్నారు.
ఇందులో కరణ్ జోహార్ అడిగిన ప్రశ్నలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇందులో అర్జున్ కపూర్‌కి సంబంధించిన ప్రశ్నలకు అడిగాడు కరణ్. సోనమ్‌ని ప్రశ్నిస్తూ.. మీ ఫ్రెండ్స్ లో ఎంత మందితో అర్జున్ బెడ్ షేర్ చేసుకున్నారని ప్రశ్నించారు. ఇది విన్న అర్జున్ ముఖం ఎత్తుకోలేకపోయాడు. తలదించుకుని కనిపించారు. దీనికి సోనమ్ కపూర్ స్పందించింది.
ఈ ప్రశ్నకి తాను సమాధానం చెప్పలేనని చెబుతుంది. అయినా నాకు అలాంటి బ్రదర్స్ లేరని చెబుతుంది. దీనికి అర్జున్ షాక్ అవ్వగా, మరెలాంటి బ్రదర్స్ ఉన్నారని ప్రశ్నించాడు కరణ్ జోహార్. దీనికి మధ్యలో కల్పించుకున్న అర్జున్.. `నువ్వెలాంటి సిస్టర్స్ వి అసలు. మా కోసం ఏం చెబుతున్నావో తెలుస్తుందా? అని సోనమ్‌ని, సోనమ్‌తో ట్రోల్ చేయించడానికే నన్ను ఈషోకి పిలిచారా? అంటూ కరణ్‌ని ప్రశ్నించాడు అర్జున్.
మరోవైపు రణ్‌బీర్ కపూర్ గురించి సోనమ్ చెబుతూ, ఆయన ప్రస్తుతం నటిస్తున్న సినిమా పేరు `శివ నెం1` అని అంటున్నారు. దీంతో అటు కరణ్, ఇటు అర్జున్ కపూర్ నవ్వులు పూయించడం విశేషం. మరోవైపు తాను అనిల్ కపూర్ కూతురిగా వచ్చానని చెప్పడంతో ఓ మైగాడ్ సోనమ్ కమ్ బ్యాక్ అంటూ అర్జున్ చెప్పడం విశేషం.
దీంతోపాటు అర్జున్ కపూర్‌కి ఆయన ప్రియురాలి ప్రశ్న కూడా ఎదురైంది. మలైకాఅరోరా ఫోన్ నెంబర్ నీ ఫోన్‌లో ఎలా సేవ్ చేసుకున్నావని ప్రశ్నించగా, ఆమెపేరంటేనే తనకిష్టమని, అందుకే మలైకాగా సేవ్ చేసుకున్నట్టు తెలిపారు అర్జున్ కపూర్.
ప్రస్తుతం `కాఫీ విత్ కరణ్`6వ ఎపిసోడ్ లేటెస్ట్ ప్రోమో వైరల్ అవుతుంది. ఇది ఆగస్ట్ 11న డిస్నీప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. అంతకు ముందు అలియా భట్-రణ్ వీర్ సింగ్, సమంత-అక్షయ్ కుమార్, జాన్వీ కపూర్-సారా అలీ ఖాన్, విజయ్ దేవరకొండ-అనన్యపాండే, అమీర్ ఖాన్-కరీనా కపూర్ పాల్గొన్న విషయం తెలిసిందే.
ఇటీవల `ఏక్ విలన్ రిటర్న్స్` చిత్రంతో మెప్పించిన అర్జున్ కపూర్ ఇప్పుడు `కుట్టీ`, `ది లేడీ కిల్లర్` చిత్రాల్లో నటిస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం ప్రెగ్నెంట్‌తో ఉన్నసోనమ్ కపూర్ `బ్లైండ్` అనే సినిమాలో నటించింది. ఇది రిలీజ్‌కి రెడీగా ఉంది.