- Home
- Entertainment
- మహేష్‌బాబు లాంటి సూపర్‌స్టార్‌కి ఇలాంటి యెలపరం వచ్చే సీన్లు అవసరమా? నెటిజన్ల కామెంట్లు.. అయ్యో మహేషా?
మహేష్‌బాబు లాంటి సూపర్‌స్టార్‌కి ఇలాంటి యెలపరం వచ్చే సీన్లు అవసరమా? నెటిజన్ల కామెంట్లు.. అయ్యో మహేషా?
మహేష్‌బాబు ఫస్ట్ టైమ్ తన అభిమానుల నుంచి, నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. తాను నటించిన `సర్కారు వారి పాట` చిత్రంలో పలు అభ్యంతరకర డైలాగులు, సన్నివేశాలు ఉండటంతో ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు.

సూపర్ స్టార్ మహేష్(Mahesh) నటించిన సినిమాల్లో పవర్‌ఫుల్ పంచ్ డైలాగ్‌లు చాలా ఫేమస్. `పోకిరి`లో ఎవరు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు` అనే డైలాగ్ ఇప్పటికీ చాలా ఫేమస్. ఇంకెప్పటికైనా ఫేమస్సే. ఇది హీరోయిజాన్ని చాటే డైలాగ్. ఇలాంటివి ఆయన సినిమాల్లో చాలా ఉంటాయి. ఫ్యాన్స్ కి థియేటర్లలో పూనకాలు తెప్పిస్తుంటాయి. సినిమా హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా డైలాగ్‌లు పేలుతుంటాయి.
కానీ ఇటీవల మహేష్ నటించిన `సర్కారు వారి పాట` (Sarkaru Vaari Paata) చిత్రం విషయంలో మాత్రం పవర్‌ఫుల్ డైలాగ్‌ల కంటే పలు అభ్యంతరకర డైలాగులుండటం ఇప్పుడు వారిని ఇబ్బందికి గురి చేస్తుంది. అలాగే పలు అసహ్యకరమైన సన్నివేశాలు సైతం సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి ఇరకాటంలో పెడుతున్నాయి. ట్రోల్స్ కి, మీమ్స్ కి, విమర్శలకు తావిస్తున్నాయి. మహేష్ వాటిని సినిమాలోని సన్నివేశం కోసమే చెప్పినా, బయట మాత్రం మరోలా జనాల్లోకి వెళ్లడం ఇప్పుడు వివాదానికి కారణమవుతుంది.
`సర్కారు వారి పాట` చిత్రంలో ప్రధానంగా `నేను విన్నాను.. నేను ఉన్నాను` అనే డైలాగ్ దుమారం రేపుతుంది. మహేష్ సొంత ఫ్యాన్స్ నుంచే కామెంట్లు వస్తున్నాయి. ఆయన అభిమానుల్లో చాలా వరకు టీడీపీ వర్గం ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పై చెప్పిన డైలాగ్ జగన్‌ది కావడంతో వైసీపీకి అనుకూలంగా ఉందని, దీంతో ఆ వర్గం వారు దీన్ని వ్యతిరేకిస్తూ నెగటివ్ కామెంట్లు చేస్తున్నారు. సొంత ఫ్యాన్ బేస్ నుంచి ఇప్పుడు మహేష్‌కి దెబ్బ పడేలా ఉందంటున్నారు. అదే సమయంలో సినిమాల్లో రాజకీయ డైలాగ్‌లు ఎందుకంటూ జనరల్ ఆడియెన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.
మరోవైపు సినిమా క్లైమాక్స్ లో వంద వయాగ్రాలు వేసుకుని శోభనం కోసం వేచి ఉన్న పెళ్లికొడుకు రూమ్‌లోకి వచ్చినట్టు వచ్చారని మహేష్ చెప్పడంపై కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి డైలాగ్‌ని మహేష్ నుంచి ఊహించలేదంటున్నారు. ఇలాంటి బోల్డ్ డైలాగ్‌లు ఎందుకు మహేషా అంటూ, కామెంట్లతోపాటు దర్శకుడు పరశురామ్‌ని ఆడుకుంటున్నారు నెటిజన్లు.
మరోవైపు హీరోయిన్ కీర్తిసురేష్‌పై మహేష్ కాలు వేసుకుని పడుకునే సీన్‌పై తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతుంది. దీనిపై దర్శకుడు పరశురామ్ ఇచ్చిన ఆన్సర్ మరింత దుమారం రేపుతుంది. లవర్స్ బెడ్‌పై ఉన్న సీన్‌ని తల్లి కొడుకులు పడుకున్నట్టుగా ఉందని దర్శకుడు చెప్పడాన్ని వ్యతిరేకిస్తున్నారు. లవర్స్ ని, తల్లికొడుకులకు కన్వర్ట్ చేయడమేంటంటున్నారు. దీంతోపాటు హీరోయిన్‌పైకి కాలులేపే సీన్, తంతా అంటూ చెప్పడం కూడా విమర్శలెదుర్కొంది.
మరోవైపు ప్రభాస్ శీనుని కొట్టే సన్నివేశంలో గ్లాస్ వాడకంపై కూడా వివాదంగా మారింది. ఇది `జనసేన` పార్టీని, పవన్‌ని టార్గెట్ చేయడమే అంటున్నారు. ఇలాంటి సీన్లు అవసరమా అంటున్నారు నెటిజన్లు. అంతేకాదు మహేష్ విసిరే రూపాయి కాయిన్ ముద్ర ఇయర్‌కి, పవన్ కళ్యాణ్‌కి లింక్ పెడుతూ కూడా కామెంట్లు వినిపించాయి.
ఇంకోవైపు నటుడు సుబ్బరాజుపై బాత్‌రూమ్‌లో టాయిలెట్ పోసే సీన్‌ని చాలా వల్గర్‌గా ఉందంటూ విమర్శలు వస్తున్నాయి. దీంతోపాటు సుబ్బరాజు ధరించిన ప్యాంట్‌ని ఉద్దేశించి `సగం ప్యాంట్ వేసుకున్నావేంటి?` అని మహేష్ చెప్పడం కూడా విమర్శలకు తావిస్తుంది. ఇది బన్నీని, విజయ్ దేవరకొండలను టార్గెట్ చేసిందంటూ కామెంట్లు రావడం గమనార్హం.
మొత్తంగా మహేష్‌బాబు సినిమాపై ఇలాంటి నెగటివ్ కామెంట్లు వినిపించడం ఇదే ఫస్ట్ టైమ్. సినిమా బాగుందా? లేదా అనేది కామన్. కానీ సీన్లు, డైలాగ్‌లను పాయింట్ ఔట్ చేసి మరీ కామెంట్లు చేయడం వివాదంగా మారుతుంది. అయితే ఇందులో పాత్ర పరంగానూ మహేష్ బోల్డ్ గా మారిపోయారు. డైలాగ్‌లు కూడా బోల్డ్ గానే చెప్పారు. వీటి ఇంపాక్ట్ సినిమా కలెక్షన్లపై, ఆడియెన్స్ థియేటర్‌కి రావడమనేదానిపై లేకపోయినా, విమర్శలు రావడం పట్ల మాత్రం మహేష్ డై హార్డ్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారని టాక్. ఇక మే 12న విడుదలైన `సర్కారు వారి పాట` ఎనిమిది రోజుల్లో 171కోట్ల గ్రాస్ సాధించిందని చిత్ర బృందం ప్రకటించింది.