- Home
- Entertainment
- వైరల్ గా పూజా హెగ్డే మేకప్ లెస్ లుక్... బుట్టబొమ్మ ఇంట్లో ఇలాంటి బట్టల్లో తిరిగేస్తుందా!
వైరల్ గా పూజా హెగ్డే మేకప్ లెస్ లుక్... బుట్టబొమ్మ ఇంట్లో ఇలాంటి బట్టల్లో తిరిగేస్తుందా!
పూజా హెగ్డే మేకప్ లెస్ లుక్ వైరల్ గా మారింది. కాలికి దెబ్బ తగలడంతో పూజా ఇంటికే పరిమితం అవుతున్నారు . వైద్యుల సలహా మేరకు రెస్ట్ తీసుకుంటూ రికవరీ అయ్యే పనిలో ఉన్నారు.

Pooja Hegde
ఇక పూజా మేకప్ లెస్ ఫోటో వైరల్ అవుతుంది. పూజా కాలికి గాయమైందని తెలిసిన అభిమానులు త్వరగా కోలుకోవాలి కోరుకుంటున్నారు. పూజా దెబ్బతగిలిన కాలును నీళ్ల బకెట్ లో పెట్టి కూర్చోవడం మనం ఫొటోల్లో చూడవచ్చు.
ఈ క్రమంలో పూజా ssmb 28 సెకండ్ షెడ్యూల్ లో పాల్గొంటారా? లేదా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇటీవల మహేష్ విదేశాల నుండి తిరిగి రాగా సెకండ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో వేసిన స్పెషల్ సెట్ లో పూర్తి చేశారు.
Pooja Hegde
దర్శకుడు త్రివిక్రమ్ వరసగా తన మూడో చిత్రానికి హీరోయిన్ గా పూజా హెగ్డేను తీసుకుంటున్నాడు. అరవింద సమేత వీర రాఘవ చిత్రంతో మొదలైన పూజా-త్రివిక్రమ్ ప్రయాణం అల వైకుంఠపురంలో, ఎస్ ఎస్ ఎం బి 28 చిత్రాల వరకూ కొనసాగుతుంది. పూజా పై త్రివిక్రమ్ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు.
తెలుగులో రెండు భారీ చిత్రాలు పూజా చేతి నుండి జారిపోయాయి. పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ మూవీ డిలే అవుతుంది. భవదీయుడు భగత్ సింగ్ ఇప్పట్లో లేనట్లేనని టాలీవుడ్ సమాచారం. అలాగే విజయ్ దేవరకొండ కి జంటగా మొదలైన జనగణమన మధ్యలో ఆగిపోయింది. ఈ రెండు చిత్రాల ద్వారా పూజా రూ. 8 కోట్లు రెమ్యూనరేషన్ గా రాబట్టేది.
ఇక మహేష్ చిత్రంతో పాటు పూజా హిందీలో రెండు ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. రణ్వీర్ సింగ్ తో సర్కస్, సల్మాన్ ఖాన్ తో కిసీ కా భాయ్ కిసీ కి జాన్ చిత్రాల్లో నటిస్తున్నారు. సల్మాన్ మూవీ వచ్చే ఏడాది రంజాన్ కానుకగా విడుదల కానుంది.
కాగా పూజా హెగ్డే నటించిన గతం మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాయి. రాధే శ్యామ్, ఆచార్య డిజాస్టర్ టాక్ తో భారీ నష్టాలు మిగిల్చాయి. హీరో విజయ్ కి జంటగా చేసిన బీస్ట్ ప్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో సాలిడ్ హిట్ తో కమ్ బ్యాక్ కావాలి అనుకుంటుంది.