సరోగసీ ద్వారా బిడ్డని కోల్పోయిన మహేష్ హీరోయిన్.. ఆ బాధాకరమైన రోజులు గుర్తు చేసుకుంటూ ఎమోషనల్
మహేష్‌బాబుతో `అతిథి` సినిమాలో మెరిసిన హీరోయిన్ అమృతారావు తాజాగా తన ప్రెగ్నెన్సీ గురించి ఓపెన్ అయ్యింది. ఫస్ట్ తాను బిడ్డని కోల్పోయినట్టు చెప్పి షాకిచ్చింది. తన యూట్యూబ్ ఛానెల్‌లో ఈ విషయాన్ని తెలిపింది.
మహేష్‌బాబు హీరోయిన్(Mahesh) అమృతా రావు(Amrita Rao) ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆర్జే అన్మోల్‌ని ఆమె వివాహం చేసుకుంది. మ్యారేజ్ తర్వాత సినిమాలకు దూరమైన అమృతారావు సోషల్ మీడియా ద్వారా మాత్రం అభిమానులతో టచ్‌లోనే ఉంటుంది. యూట్యూబ్ ఛానెల్ ద్వారా తన జీవితంలోనే అనేక విషయాలను పంచుకుంటుంది. తెలియని విషయాలను షేర్ చేసుకుంటూ ఆకట్టుకుంటుంది. `కపుల్ ఆఫ్ థింగ్స్` అనే ఛానెల్ ద్వారా ఆమె తమ జీవితానికి సంబంధించిన విషయాలను వెల్లడిస్తుంది.
అందులో భాగంగా లేటెస్ట్ ఓ సీక్రెట్ విషయాన్నిషేర్ చేసుకుంది. ఓ వీడియోలో ఆమె తాను ఎదుర్కొన ప్రెగ్నెన్సీ ప్రాబ్లెమ్స్ ని తెలిపింది. మొదట అమృత, అన్మోల్ పేరెంట్స్ అయ్యేందుకు సరోగసి ఎంచుకున్నారట. సరోగసిలోని ఐయూఐ,ఐవీఎఫ్, హోమియోపతి, ఆయుర్వేద పద్ధతులను ఎంచుకున్నట్టు తెలిపింది. అందులో భాగంగా సరోగసి పద్ధతి ద్వారా పిల్లలను కనాలని భావించినప్పుడు, ఈ పద్ధతి ప్రారంభించిన కొన్ని రోజుల్లోనే బిడ్డని కోల్పోయినట్టు తెలిపింది అమృతారావు.
ఆ సమయంలో వాళ్లు చాలా బాధపడినట్టు చెప్పింది. తల్లిదండ్రులు కావాలన్న ఉత్సాహంలో పొరపాట్లు చేస్తారని చెప్పింది అమృత. ఆ ఎగ్జైట్‌మెంట్స్ ఉద్వేగానికి గురి కావాల్సిన అవసరం లేదని చెప్పింది. అది మన చేతుల్లో ఉండదని పేర్కొంది. ఈ విషయంలో చాలా ఆచితూచి అడుగులు వేయాలని, జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. మరోవైపు ఐవీఎఫ్ చికిత్స గురించి చెబుతూ, చాలా ఏళ్లు ప్రయత్నించిన తర్వాత మనకు కూడా బిడ్డ పుట్టాలా? ఈ ఒత్తిడి జీవితాలతో పిల్లలను పెంచగలమా ఇది, అంత ముఖ్యమా? అని ప్రశ్నించుకున్నట్టు పేర్కొన్నారు. ఈ ఆలోచనల అనంతరం వీరిద్దరు కలిసి థాయ్‌లాండ్ వెళ్లారని చెప్పింది. అయితే మార్చి 2020 అమృత గర్భవతి కాగా, నవంబర్‌లో కుమారుడు వీర్‌కి జన్మనిచ్చింది. వీర్ కి ముందు పలు నిక్‌నేమ్‌లు పెట్టారని, ఫైనల్‌గా వీర్‌గా నిర్ణయించినట్టు చెప్పారు.
`అబ్ కే బరాస్` అనే హిందీ చిత్రంతో నటిగా తెరంగేట్రం చేసింది అమృతా రావు. `ది లెజెంట్ ఆఫ్ భగత్ సింగ్`లో కీలక పాత్రలో మెరిసింది. `ఇష్క్ విష్క్` , `మస్తి` చిత్రాలతో మరింత గుర్తింపు తెచ్చుకుంది. హిందీలో హీరోయిన్‌గా రాణిస్తున్న సమయంలోనే 2007లో సూపర్ స్టార్ మహేష్‌బాబు హీరోగా రూపొందిన `అతిథి` చిత్రంలో హీరోయిన్‌గా నటించే ఛాన్స్ వచ్చింది. ఇందులో ఆమె హీరోయిన్‌గా బలమైన పాత్రతో మెప్పించింది. ఒక్క సినిమాతోనే తెలుగు ఆడియెన్స్ కి దగ్గరైంది. అయితే ఆ చిత్రం సక్సెస్ కాలేకపోవడంతో తెలుగులో ఈ బ్యూటీకి ఆఫర్స్ రాలేదు.
2013 వరకు ఫుల్ స్వింగ్‌లో సినిమాలు చేసింది. పెద్ద చిత్రాలు పడకపోవడంతో ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. `శౌర్య`, `విక్టరీ`, `జాలీ ఎల్‌ఎల్‌బీ` చిత్రాలు చేసింది. అయితే అంతకు ముందే ఆమె ఆర్జే అన్మోల్‌తో ప్రేమలో పడింది. ఏడేళ్ల ప్రేమ అనంతరం 2016లో వీరిద్దరు ఒక్కటయ్యారు. అయితే అనధికారికంగా వీరిద్దరు 2014లోనే వివాహం చేసుకున్నారట. ఆ మధ్య ఈ విషయాన్ని చెప్పి షాకిచ్చింది అమృత. మ్యారేజ్ తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమయ్యింది అమృతా రావు.