Mahesh babu: మహేష్ దుబాయ్ లో ఏం చేస్తున్నారు...? వైరల్ గా పర్సనల్ ఫొటోస్
మహేష్ సర్కారు వారి పాట (Sarkaru vaari paata) షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకున్నారు. ఎటూ విడుదలకు మూడు నెలల సమయం ఉన్న నేపథ్యంలో ప్రశాంతంగా షూట్ పూర్తి చేయొచ్చని భావిస్తున్నారు.

ఇటీవల మహేష్ (Mahesh babu)హఠాత్తుగా భార్య నమ్రతతో పాటు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. మహేష్ తో పిల్లలు సితార, గౌతమ్ లేకపోవడంతో ఇది విహార యాత్ర కాదని మీడియా, ఫ్యాన్స్ ఓ అభిప్రాయానికి వచ్చారు.
అదే సమయంలో మహేష్ స్పెయిన్ వెలుతున్నట్లు కథనాలు వెలువడ్డాయి. చాలా కాలంగా మోకాలి నొప్పితో బాధపడుతున్న మహేష్ స్పెయిన్ లో సర్జరీ చేయించుకోనున్నారని , మహేష్ ప్రయాణం వెనుక కారణం అదే అంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి.
దీనిపై ఎటువంటి అధికారిక సమాచారం లేని నేపథ్యంలో మహేష్ మోకాలికి సర్జరీ జరిగిందా? లేదా ? అనే విషయంపై క్లారిటీ లేదు. అయితే ప్రస్తుతం మహేష్ దుబాయ్ లో ఉన్నారు. మహేష్ ఫ్యామిలీకి దుబాయ్ ఫేవరేట్ ప్లేస్.
మహేష్ సతీమణి నమ్రతా శిరోద్కర్ (Namrata shirodkar)సిస్టర్ శిల్పా శిరోద్కర్ దుబాయ్ లో నివాసం ఉంటున్నారు. మనం చెన్నై, ముంబై వెళ్లినంత తరచుగా మహేష్ ఫ్యామిలీ దుబాయ్ వెళుతూ ఉంటారు. సర్కారు వారి పాట మొదటి షెడ్యూల్ దుబాయ్ లోనే జరిగింది. అప్పుడు కూడా కుటుంబ సమేతంగా దుబాయ్ లో మహేష్ స్టే చేశారు.
ఒకరకంగా దుబాయ్ మహేష్ ఫ్యామిలీ కి చుట్టాల ఊరన్న మాట. మహేష్ దుబాయ్ వెళ్లి రెండు వారాలు దాటిపోయింది. మహేష్, నమ్రత, సితార, గౌతమ్ దుబాయ్ వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు. సినిమాలు, షికార్లు చేస్తున్నారు. వరల్డ్ షాపింగ్ హబ్ గా దుబాయ్ ని చెప్పుకుంటారు. దీనితో తమకు ఇష్టమైన వస్తువులను కొనుగోలు చేస్తున్నారు.
మహేష్ దుబాయ్ వెకేషన్ కి సంబంధించిన పర్సనల్ ఫొటోస్ ఇంటెర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. సితార, నమ్రత సదరు ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. దుబాయ్ లో క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు.
ఇక చరణ్ వైఫ్ ఉపాసన దుబాయ్ లో నమ్రతను కలిశారు.దుబాయ్ ఎక్స్ పో 2020కి హాజరైన ఉపాసన పనిలో పనిగా నమ్రతతో లంచ్ పార్టీలో పాల్గొన్నారు. రామ్ చరణ్, మహేష్ మంచి మిత్రులు కాగా... వాళ్ళ సతీమణులైన ఉపాసన, నమ్రతల మధ్య కూడా మంచి స్నేహ బంధం ఉంది.
ఇక ఇండియా వచ్చిన అనంతరం పరిస్థితులను బట్టి మహేష్ సర్కారు వారి పాట షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. ఒమిక్రాన్ వ్యాప్తి రోజురోజుకు అధికం అవుతుండగా.. థర్డ్ వేవ్ భయాలు వెంటాడుతున్నాయి. ప్రభుత్వాలు ఆంక్షలు విధించే సూచనలు కనిపిస్తున్నాయి.