- Home
- Entertainment
- Mahesh-Namrata Shirodkar: సమ్మర్ వేర్ లో సూపర్ స్టైలిష్ గా మహేష్ వైఫ్ నమ్రత... వైరల్ గా గ్లామరస్ ఫొటోస్
Mahesh-Namrata Shirodkar: సమ్మర్ వేర్ లో సూపర్ స్టైలిష్ గా మహేష్ వైఫ్ నమ్రత... వైరల్ గా గ్లామరస్ ఫొటోస్
సూపర్ స్టార్ మహేష్ వైఫ్ నమ్రత శిరోద్కర్ సూపర్ స్టైలిష్ లుక్ లో దర్శనమిచ్చారు. సమ్మర్ ట్రెండీ వేర్ ధరించిన ఈ మాజీ హీరోయిన్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. వయసు పెరిగినా వన్నె తరగని అందంతో మెస్మరైజ్ చేస్తున్నారు.

Namrata shirodkar
మహేష్ (Mahesh Babu) ని ప్రేమించి పెళ్లి చేసుకున్న నమ్రత... తన కెరీర్ వదిలేసి పూర్తి గృహిణిగా మారిపోయారు. అనేక జాతీయ, అంతర్జాతీయ బ్యూటీ టైటిల్స్ గెలిచిన ఒక అల్ట్రా మోడరన్ గర్ల్, ఇలా హౌస్ వైఫ్ గా మారడం ఊహించని పరిణామం. 2005లో మహేష్ ని వివాహం చేసుకున్న నమ్రత 2004 తర్వాత వెండితెరపై కనిపించలేదు.
Namrata shirodkar
భర్త, పిల్లలే ప్రపంచంగా ఆమె బ్రతికారు. కొడుకు గౌతమ్, కూతురు సితార పెద్దయ్యాక, కొన్ని బాధ్యతలు చేపట్టారు. భర్త మహేష్ కి ఆమె అనధికారిక మేనేజర్ అని చెప్పాలి. ఆయన షెడ్యూల్స్ స్వయంగా చూసుకుంటారు. సినిమాల ఎంపిక విషయంలో కూడా నమ్రత (Namrata Shirodkar) హస్తం ఉంటుందని టాక్.
Namrata shirodkar
మహేష్ ఎండార్స్మెంట్ తో పాటు ఆయన ఏర్పాటు చేసిన నిర్మాణ సంస్థ, ఏఎంబీ సినిమాస్ వంటి వ్యాపారాలు చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఏఎంబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో మహేష్ సర్కారు వారి పాట చిత్రంతో పాటు, యంగ్ హీరో అడివి శేష్ నటిస్తున్న మేజర్ మూవీ నిర్మిస్తున్నారు. అదే సమయంలో పిల్లల ఆలనా పాలనా చూసుకుంటున్నారు.
Namrata shirodkar
సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే నమ్రత పిల్లల వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ అందమైన జ్ఞాపకాలు అభిమానులతో పంచుకుంటారు. ఇక విరామం దొరికితే విహారాలకు చెక్కేస్తారు.
మహేష్ సైతం తన విరామ సమయం పూర్తిగా కుటుంబానికి కేటాయిస్తారు. ప్రతి సినిమా షూటింగ్ మొదలయ్యే ముందు, విడుదల తర్వాత వరల్డ్ టూర్ కి ఫ్యామిలీతో చెక్కేస్తారు. ప్రతి ఏటా రెండు మూడు పర్యాయాలు టూర్స్ కి వెళుతూ ఉంటారు.
Namrata shirodkar
ఇక తన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata)తో కూతురు సితారను వెండితెరకు పరిచయం చేశారు. సెకండ్ సింగిల్ 'పెన్నీ సాంగ్' లో సితార స్టైలిష్ స్టెప్స్ తో అదరగొట్టారు. థమన్ స్వరాలు సమకూర్చిన ఈ పాట అత్యంత ఆదరణ దక్కించుకుంది. సమ్మర్ కానుకగా మే 12న విడుదలవుతున్న ఈ మూవీపై పరిశ్రమలో భారీ అంచనాలున్నాయి.