MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రాశి కెరీర్ నాశనం చేసిన స్టార్ డైరెక్టర్... అందులో మహేష్ బాబు పాత్ర కూడా, ఇప్పుడు ఏడ్చి ఏం లాభం!

రాశి కెరీర్ నాశనం చేసిన స్టార్ డైరెక్టర్... అందులో మహేష్ బాబు పాత్ర కూడా, ఇప్పుడు ఏడ్చి ఏం లాభం!

ఓ స్టార్ డైరెక్టర్ నా జీవితం నాశనం చేశాడంటూ వాపోయింది హీరోయిన్ రాశి. ఆయన కారణంగా తన ఇమేజ్ దెబ్బతిందట. షూటింగ్ మొదటిరోజే వచ్చేదామని అనుకున్నా, డబ్బులు తీసుకోవడం వలన తప్ప లేదు అని చెప్పుకొచ్చింది..  

2 Min read
Author : Sambi Reddy
Published : Jul 09 2024, 12:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిశ్రమకు పరిచయమైంది రాశి. స్టార్ గా వెలుగొందిన తెలుగు అమ్మాయిల్లో రాశి ఒకరు. ఈమె పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించారు. శుభాకాంక్షలు, పెళ్లి పందిరి, గోకులంలో సీత, ప్రేయసి రావే, మనసిచ్చి చూడు... వంటి హిట్ చిత్రాలు ఆమెకు ఫేమ్ తెచ్చాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

2002 వరకు రాశి కెరీర్ సక్సెస్ఫుల్ గా సాగింది. ఆమె టైర్ హీరోలతో వరుస చిత్రాలు చేస్తున్నారు. హిందీ, మలయాళ, కన్నడ, తమిళ భాషల్లో కూడా రాశి నటించారు. అయితే 2003లో తన ఇమేజ్ కి పూర్తి భిన్నమైన రోల్ చేసింది రాశి. అప్పట్లో స్టార్ డైరెక్టర్ గా వెలుగొందుతున్న తేజ నిజం టైటిల్ తో ఓ మూవీ చేశారు. మహేష్ బాబు హీరోగా నటించారు. 

 

36

జయం మూవీలో విలన్ రోల్ చేసి మెప్పించిన గోపీచంద్ కి తేజ మరో ఆఫర్ ఇచ్చాడు. నిజం లో గోపీచంద్ విలన్ నిజం మరింత భయంకరంగా ఉంటుంది. గోపీచంద్ కీప్ పాత్ర చేసింది రాశి. హీరోయిన్ గా చేస్తున్న ఆమె నెగిటివ్ షేడ్స్ తో కూడిన బోల్డ్ రోల్ లో కనిపించి షాక్ ఇచ్చింది. హోమ్లీ హీరోయిన్ ఇమేజ్ ఉన్న రాశి నుంచి ఫ్యాన్స్ ఊహించని పాత్ర అది. 

46

ఏడాదికి ఐదారు చిత్రాలు చేసే రాశికి ఆఫర్స్ భారీగా తగ్గాయి. ఒక సినిమా చేయడం కూడా గగనమైపోయింది. నిజం మూవీ చేయడం వలన తన కెరీర్ నాశనం అయ్యిందని రాశి పలు సందర్భాల్లో వాపోయారు. దర్శకుడు తేజ తన కెరీర్ పాడు చేశాడని ఆమె వాపోయింది. రాశి మాట్లాడుతూ... నిజం మూవీలో మల్లి పాత్ర చేయడం వలన నేను విమర్శలు ఎదుర్కొన్నాను. 

56

ఆ మూవీలో గోపీచంద్ తో పరిమితికి మించి రొమాంటిక్ సన్నివేశాల్లో నటించాను. దర్శకుడు తేజ నా పాత్ర విషయంలో మొదట చెప్పింది వేరు. తర్వాత తెరకెక్కించింది వేరు. ఇష్టం లేకుండానే ఆ పాత్ర చేశాను. మొదటి రోజే వచ్చేద్దామని అనుకున్నాను. కానీ అడ్వాన్స్ తీసుకోవడం వలన తప్పక నటించాను. 

 

66

నెగిటివ్ షేడ్స్ తో కూడిన పాత్ర చేసినందుకు ప్రశంసలు దక్కాయి. కానీ అలాంటి సన్నివేశాల్లో నటించడం చూసి అభిమానులు నొచ్చుకున్నారు, అన్నారు. అదేదో మూవీ చేయక ముందు ఉండాలి. ఇప్పుడు ఏడ్చి ఏం లాభం అని కొందరు ఎద్దేవా చేస్తున్నారు.  2017లో లంక టైటిల్ తో ఓ మూవీ చేసింది రాశి. ఆ చిత్రాన్ని ఆమె స్వయంగా నిర్మించారు. లంక ఆశించిన స్థాయిలో ఆడలేదు. మళ్ళీ రాశి సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు. జానకి కలగనలేదు సీరియల్ లో ఓ రోల్ చేసింది. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Chennai Love Story Collections: బాక్సాఫీసు వద్ద కిరణ్‌ అబ్బవరం రచ్చ.. చెన్నై లవ్‌ స్టోరీకి మొదటి రోజు అదిరిపోయే కలెక్షన్లు
Recommended image2
Jana Nayakudu 2 Days Collections: విజయ్‌కి బిగ్‌ షాక్‌, జన నాయకుడు కలెక్షన్లు, రెండో రోజు భారీ డ్రాప్‌
Recommended image3
Tanuja: కళ్యాణ్‌ పడాల, పవన్‌ సాయి, ఎంఎం విషయంలో దారుణంగా ట్రోల్స్.. గట్టిగా ఇచ్చిపడేసిన తనూజ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved